Kiwis team
-
Ireland vs New Zealand: ఐర్లాండ్ ఓడినా... వణికించింది!
డబ్లిన్: అయ్యో... ఐర్లాండ్! కొండను కరిగించే పనిలో పరుగు తేడాతో ఓడింది. ఇదివరకే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోల్పోయిన ఐర్లాండ్ మూడో మ్యాచ్ ఓటమితో ‘వైట్‌వాష్’ అయ్యింది. కానీ అసాధారణ పోరాటంతో ఆఖరి బంతి దాకా కివీస్ ఆటగాళ్లను వణికించింది. కివీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 360 పరుగుల భారీస్కోరు చేసింది. గప్టిల్ (126 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేయగా, నికోల్స్ (54 బంతుల్లో 79; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. గట్టి ప్రత్యర్థి తమ ముందుంచిన కొండంత లక్ష్యాన్ని చూసి ఏమాత్రం బెదిరిపోని ఐర్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 359 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్ (103 బంతుల్లో 120; 14 ఫోర్లు, 5 సిక్సర్లు), హ్యారీ టెక్టర్ (106 బంతుల్లో 108; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు)ల సెంచరీలతో ఓ దశలో న్యూజిలాండ్‌ను ఓడించినంత పని చేశారు. చివరి బంతికి 3 పరుగుల కావాల్సి వుండగా, ‘బై’ రూపంలో పరుగు మాత్రమే వచ్చింది. -
ఆసీస్‌కు ఇన్నింగ్స్ విజయం
కివీస్‌తో తొలి టెస్టు వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టును మరో రోజు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా గెల్చుకుంది. స్పిన్నర్ లియోన్ (4/91), పేసర్ మిషెల్ మార్ష్ (3/73) ధాటికి సోమవారం నాలుగో రోజు కివీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 104.3 ఓవర్లలో 327 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఆసీస్‌కు ఇన్నింగ్స్ 52 పరుగులతో ఘనవిజయం లభించింది. కివీస్ జట్టులో లాథమ్ (164 బంతుల్లో 63; 3 ఫోర్లు), నికోల్స్ (134 బంతుల్లో 59; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించగా గప్టిల్ (55 బంతుల్లో 45; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. నాలుగోరోజు 178/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ తమ మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో 218 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. అయితే చివరి వరుస బ్యాట్స్‌మెన్ క్రెయిగ్ (64 బంతుల్లో 33 నాటౌట్; 6 ఫోర్లు) పోరాడగా... టిమ్ సౌతీ (23 బంతుల్లో 48; 5 ఫోర్లు; 3 సిక్సర్లు) వన్డే తరహా ఆటతీరుతో విజృంభించాడు. వీరిద్దరి మధ్య తొమ్మిదో వికెట్‌కు 59 పరుగులు వచ్చాయి. ఓవరాల్‌గా చివరి మూడు వికెట్ల మధ్య 109 పరుగులు జత చేరాయి. హాజెల్‌వుడ్‌కు రెండు వికెట్లు దక్కాయి. సిరీస్‌లో చివరిదైన రెండో టెస్టు 20 నుంచి క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతుంది.