![విభజన వల్ల తెలుగువారందరికి నష్టం: సీఎం కిరణ్ - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2017/09/2/71392789181_625x300.jpg.webp?itok=22e0muBT)
విభజన వల్ల తెలుగువారందరికి నష్టం: సీఎం కిరణ్
హైదరాబాద్ : రాష్ట్ర విభజన వల్ల తెలుగువారందరికి నష్టం కలుగుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన అనంతరం తొలిసారిగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రెస్మీట్ పెట్టారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విభజన విషయంలో కేంద్రం అనుసరించిన విధానంపై సిగ్గుతో తలదించుకోవాలన్నారు.