తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్న తర్వాత సోనియాగాంధీ ...ముఖ్యమంత్రి పదవిలో కొనసాగమంటేనే సీఎం పదవిలో ఉన్నానని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన బుధవారం ప్రెస్మీట్లో మాట్లాడారు. సీఎం ప్రెస్మీట్ వివరాలు
* సీట్లకోసం, అధికారకోసం తెలుగుజాతికి తీవ్ర నష్టం కలిగించారు
*విభజన వల్ల తెలుగు ప్రజలకు నష్టం కలుగుతుంది
*విభజన వల్ల ప్రజలకు లాభం కాకుండా నష్టం కలుగుతుంది
*58 సంవత్సరాలుగా ఇరు ప్రాంతాల వాళ్లు కలిసి ఉన్నారు
*ప్రతి సంవత్సరం ప్రజల మధ్య చిచ్చుపెట్టే అంశాలున్నాయి
*విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
*విభజన నిర్ణయం తీసుకున్నప్పటినుంచీ ప్రతి అంశంలోనూ ఉల్లంఘనలు జరిగాయి
*పద్ధతి ప్రకారం విభజన జరగలేదు.. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి
*టేబుల్ ఐటెంగా కేబినెట్ భేటీలో పెట్టారు
*కనీసం నోట్‌ను చదువుకునే అవకాశాన్ని కేబినెట్ మంత్రులకూ ఇవ్వలేదు
*జీవోఎం ఏర్పాటుతో పాటు చేసిన పద్ధతులన్నీ ఉల్లంఘనలే
*ఇదే బిల్లు పార్లమెంటులో పెడితే బుట్టదాఖలు అవుతుందని చెప్పాను
*లేకపోతే రాజకీయాలనుంచి తప్పుకుంటానని చెప్పాను
*అయితే దీనివల్ల రాజీనామా చేయడంలేదు
*డ్రాఫ్టు బిల్లుపై అసెంబ్లీ చర్చించడం ఎంతవరకు సమంజసం
*పార్లమెంటులో బిల్లు నడిపిన తీరుకూడా ఎంతవరకు సమంజసం?
*పార్లమెంటు సభ్యులను కొట్టించారు
*పార్లమెంటులో ప్రవర్తన దిగజారిపోయింది
*రాష్ట్ర సభ్యులు లేకుండా చేసి దొంగల మాదిరిగా వ్యవహరించారు
*ప్రత్యక్షప్రసారాలను ఎందుకు నిలిపేశారో దేశప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది
*అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును తిరస్కరిస్తే.. అది సమాఖ్య స్ఫూర్తికి అగౌరవం కాదా?
*ప్రతిపక్ష బీజేపీ కూడా కుమ్మక్కైంది
*బీజేపీ చీకటి ఒప్పందాలను చేసుకుంది
*తెలుగువారి హృదయాలను గాయపరిచారు
*తెలుగుజాతిని నిలువునా చీలుస్తున్నారు
*ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచడానికి కాంగ్రెస్...
అనేక సీడబ్ల్యూసీ, ఏఐసీసీ సమావేశాల్లోనిర్ణయించింది
*అలాంటి రాష్ట్రాన్ని విభజించడంతో దేశం బాగుపడుతుందా?
*ప్రజాస్వామ్యాన్ని హేళన చేశారు
*ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి కుమ్మక్కు చేశారు
*నా ఎదుగుదలకు, సీఎం పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు
*కాని తెలుగువారి గుండెలను గాయపరిచినందుకు రాజీనామా
*సీఎం, ఎమ్మెల్యే పదవులతో సహా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
*ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలకు 3రోజుల ముందే నాతో మాట్లాడారు
*సోనియాగాంధీ, నేను మాత్రమే మాట్లాడాం
*తెలంగాణపై నిర్ణయం తీసుకుందామా? అని అడిగారు
*బడ్జెట్ సెషన్స్ తర్వాత అంటే మార్చి 28 తర్వాత తీసుకోమని చెప్పాను
*ఆతర్వాత 50 సార్లు నిర్ణయం తీసుకోమన్నా తీసుకోలేదు
*సీడబ్ల్యూసీ తర్వాత రాజీనామా చేస్తానంటే కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోలేదు
*తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తర్వాత సోనియా పదవిలో కొనసాగమంటేనే కొనసాగాను
'సోనియా పదవిలో కొనసాగమంటేనే ....'
Published Wed, Feb 19 2014 11:56 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement