రాజ్యాంగం ప్రకారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ జరుగుతుందని కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. హొం మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. మంత్రి మండలిలో నిర్ణయం తీసుకొని తెలంగాణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్రపతికి పంపుతామన్నారు. దానిని రాష్ట్రపతి ద్వారా రాష్ట్ర అసెంబ్లీకి పంపుతామని చెప్పారు. అసెంబ్లీ తీర్మానం ఎలా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందన్నారు. అసెంబ్లీ తీర్మానం ఎలా ఉన్నా, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టడం సాధ్యం కాదన్నారు. వచ్చే వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెడతామన్నారు. ఆరు నెలలు, అంతకంటే ముందే తెలంగాణ ఏర్పడుతుందని చెప్పారు. తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. ఇక ఈ నిర్ణయం వెనక్కు తీసుకునే అధికారం ఇప్పుడు కాంగ్రెస్ చేతులలో కూడా లేదని చెప్పారు. గతంలో భాషాప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేశాం, ఇప్పుడు అదొక్కటే ప్రాతిపదిక కాదన్నారు. దేశంలో చాలా ప్రాంతాల వారు ప్రత్యేక రాష్ట్రాలను కోరుతున్నారు. ఇతర రాష్ట్రాల డిమాండ్తో తెలంగాణను పోల్చలేమని చెప్పారు. 60 ఏళ్ల నుంచే తెలంగాణ ఉద్యమం సాగుతోందన్నారు.
Published Thu, Aug 1 2013 4:38 PM | Last Updated on Fri, Mar 22 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement