దేశంలో శాంతి భద్రతలను ప్రశ్నించే విధంగా తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను శుక్రవారం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హుంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే దసర, దీపావళీ పండగల లక్ష్యంగా దాడులు చేయవచ్చని ఆ తీవ్రవాద సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నిఘా వర్గాలు తమకు సమాచారం అందించాయని తెలిపింది.
భారత్లో శాంతి భద్రతలను కాలరాయాడమే పనిగా ఇండియన్ ముజాహిదీన్ కంకణం కట్టుకుందని హోం మంత్రిత్వ శాఖ ఈ సందర్బంగా వ్యాఖ్యానించింది. తీవ్రవాదుల దాడులకు తిప్పికొట్టే విధంగా సమాయత్తం కావలని రాష్ట్రాలను కోరింది. ప్రజలు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అందులోభాగంగా దేవాలయాలు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్సు స్టాండ్లు, వంతెనల వద్ద పోలీసుల పహారా పెంచాలని హోం మంత్రిత్వశాఖను కోరింది.
అలాగే తీవ్రవాద సంస్థలతో అనుబంధం అనుకున్న అనుమానితులను ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగిన ఉన్నత అధికారుల హుటాహుటిన సంఘటన స్థలానికి తరలివెళ్లాలని, స్థానికంగా ఎటువంటి ఆందోళనలు చెలరేగకుండా శాంతి భద్రతలను సమీకించే విధంగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయాలని హోం మంత్రిత్వశాఖ కోరింది.