terror strikes
-
స్వాతంత్య్ర వేడుకలపై ఉగ్రకన్ను.. హై అలర్ట్..
ఢిల్లీ: స్వాతంత్య్ర వేడుకల్లో ఉగ్రదాడులు జరగనున్నాయనే సమాచారం అందడంతో ఢిల్లీలో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ప్రధాన రహదారులే లక్ష్యంగా దాడి చేయనున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. లష్కరే-ఈ-తోయిబా(ఎల్ఈటీ), జైషే-ఈ-మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులే ఈ దాడులకు ప్లాన్ వేశారని ఇంటెలిజెన్స్ బృందాలు తెలిపాయి. దేశ రాజధానితో పాటు ప్రధాన నగరాల్లో దాడులకు పాల్పడే సూచనలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. దేశంలో భద్రతా వైఫల్యాన్ని సృష్టించాలని ప్రణాళికలు వేసినట్లు తెలుస్తోంది. దీంతో భద్రతా బలగాలు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాయి. గత ఫిబ్రవరిలోనే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని ప్రధాన ప్రదేశాల్లో ఉగ్రదాడులు జరగనున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చింది. ఢిల్లీలో ప్రధాన ప్రదేశాల్లో, రద్దీగా ఉండే స్థలాల్లో దాడులు చేపట్టాలని ఎల్ఈటీ తన సభ్యులకు సమాచారం పంపించినట్లు ఇంటెలిజెన్స్‌కు తెలిసింది. నేషనల్ ఇన్వెష్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ప్రధానం కేంద్రంపై దాడి చేసి భద్రతా వైఫల్యాన్ని సృష్టించాలని కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలిసింది. భారత్‌లో ప్రధాన నగరాల్లో దాడులు జరపాలని 2023 మేలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జైషే-ఈ-మహ్మద్‌కు చెందిన ఓ వీడియో విడుదలైంది. పాక్ ఆధారిత ఉగ్రవాదులు, గ్లోబల్ జిహాదీలు స్వాతంత్య్ర వేడుకలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భద్రత కట్టుదిట్టం.. ఉగ్రదాడుల సమాచారంతో స్వాతంత్య్ర వేడుకలకు భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. పెట్రోలింగ్ వ్యవస్థలను పెంచారు. ఢిల్లీలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వేడుకల్లో భద్రత కోసం దాదాపు 10,000 పోలీసులను మోహరించారు. 1000 ఫేస్ రికగ్నీషన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ సిస్టమ్, సర్వెలెన్స్‌ను పెంచారు. కాగా.. ఆగష్టు 15న ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ ఉపన్యాసం ఇస్తారు. ఇదీ చదవండి: సీమా హైదర్ తిరంగ జెండా ఎత్తితే అట్లుంటది..! జేజేలు కొడుతూ.. దృశ్యాలు వైరల్.. -
దేశ రాజధానిని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు
-
ఉగ్రవాద దాడులు జరగొచ్చు.. జాగ్రత్త: రాజ్‌నాథ్
ఉగ్రవాదులు దేశంలో దాడులు చేసే ప్రమాదం ఉందని కేంద్ర హోంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. ఉగ్రవాద దాడులు జరిగే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాలను ఈ విషయంలో తాము అప్రమత్తం చేస్తూనే ఉన్నామన్నారు. పండుగల సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దేశంలోని పలు నగరాలపై ఐఎస్ఐఎస్, అల్ కాయిదా లాంటి ఉగ్రవాద సంస్థలు దాడులు చేసే ప్రమాదం ఉందంటూ ఇటీవల ఎన్ఎస్జీ చీఫ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర హోంమంత్రి కూడా ఈ విషయాన్ని నిర్ధారించడంతో ఒక్కసారిగా నిఘావర్గాలు, వివిధ రాష్ట్రాల పోలీసులు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు. గతంలో జరిగిన ముంబై తరహా దాడులు పునరావృతం కాకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నారు. -
దేశంలో ఇండియన్ ముజాహిదీన్ మరిన్ని దాడులు!
దేశంలో శాంతి భద్రతలను ప్రశ్నించే విధంగా తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను శుక్రవారం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హుంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే దసర, దీపావళీ పండగల లక్ష్యంగా దాడులు చేయవచ్చని ఆ తీవ్రవాద సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నిఘా వర్గాలు తమకు సమాచారం అందించాయని తెలిపింది. భారత్‌లో శాంతి భద్రతలను కాలరాయాడమే పనిగా ఇండియన్ ముజాహిదీన్ కంకణం కట్టుకుందని హోం మంత్రిత్వ శాఖ ఈ సందర్బంగా వ్యాఖ్యానించింది. తీవ్రవాదుల దాడులకు తిప్పికొట్టే విధంగా సమాయత్తం కావలని రాష్ట్రాలను కోరింది. ప్రజలు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అందులోభాగంగా దేవాలయాలు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్సు స్టాండ్లు, వంతెనల వద్ద పోలీసుల పహారా పెంచాలని హోం మంత్రిత్వశాఖను కోరింది. అలాగే తీవ్రవాద సంస్థలతో అనుబంధం అనుకున్న అనుమానితులను ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగిన ఉన్నత అధికారుల హుటాహుటిన సంఘటన స్థలానికి తరలివెళ్లాలని, స్థానికంగా ఎటువంటి ఆందోళనలు చెలరేగకుండా శాంతి భద్రతలను సమీకించే విధంగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయాలని హోం మంత్రిత్వశాఖ కోరింది.