ఉగ్రవాద దాడులు జరగొచ్చు.. జాగ్రత్త: రాజ్నాథ్
ఉగ్రవాదులు దేశంలో దాడులు చేసే ప్రమాదం ఉందని కేంద్ర హోంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఉగ్రవాద దాడులు జరిగే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాలను ఈ విషయంలో తాము అప్రమత్తం చేస్తూనే ఉన్నామన్నారు. పండుగల సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
దేశంలోని పలు నగరాలపై ఐఎస్ఐఎస్, అల్ కాయిదా లాంటి ఉగ్రవాద సంస్థలు దాడులు చేసే ప్రమాదం ఉందంటూ ఇటీవల ఎన్ఎస్జీ చీఫ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర హోంమంత్రి కూడా ఈ విషయాన్ని నిర్ధారించడంతో ఒక్కసారిగా నిఘావర్గాలు, వివిధ రాష్ట్రాల పోలీసులు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు. గతంలో జరిగిన ముంబై తరహా దాడులు పునరావృతం కాకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నారు.