transgender activist
-
మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించే సంస్థను కొనుగోలు చేసిన తొలిమహిళ
బ్యాంకాక్: మిస్ యూనివర్స్ వంటి అందాల పోటీలను నిర్వహించే సంస్థను తొలిసారిగా ఒక థాయి మహిళ సుమారు రూ. 164 కోట్లతో కొనుగోలు చేసింది. థాయి స్థానిక మీడియా ప్రాజెక్టు రన్‌వే ఎడిషన్‌ను నిర్వహిస్తున్న ట్రాన్స్ జెండర్ హక్కుల ప్రచారకర్త అయినా జకపాంగ్ జక్రాజుతాటిప్ ఈ సంస్థను కొనుగోలు చేసినట్లు జేకేఎన్ గ్లోబల్ గ్రూప్ బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఆమె సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తారని గ్లోబల్ గ్రూప్ పేర్కొంది. అంతేగాదు 70 ఏళ్ల చరిత్రలో ఈ అందాల పోటీ సంస్థను సొంతం చేసుకున్న తొలిమహిళ జకపాంగేనని వెల్లడించింది. గతంలో ఈ సంస్థ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యజమాన్యంలో ఉన్నట్లు తెలిపింది. ఈమేరకు జకపాంగ్ మాట్లాడుతూ...తాను కొనుగోలు చేసిన బ్రాండ్‌ని అభివృద్ధి చేయడానికి దొరికిన అరుదైన అవకాశంగా పేర్కొంది. ఇది థాయ్‌లాండ్ ప్రతిష్టను మరింత పెంచుతుందని భావిస్తున్నానని చెప్పింది. ఈ సంస్థ థాయ్‌లాండ్‌కు ఒక మంచి శక్తిగా ఉపయోగపడుతుందని, పైగా ఎక్కువ మంది పర్యాటకులను తీసుకువస్తుందని విశ్వసిస్తున్నాని అని అన్నారు. ఈ సంస్థ తాను రన్ చేస్తున్న కంపెనీ ఫోర్ట్‌ఫోలియోకు బలమైన వ్యూహాత్మక శక్తిగా ఉంటుందని పేర్కొంది. అలాగే విభిన్న నేపథ్యాలు, సంస్కృతులు, సంప్రదాయాలు నుంచి వచ్చే ఉద్వేగభరితమైన వ్యక్తులకు వేదికను అందించే వారసత్వాన్ని కొనసాగిస్తూ..ఒక గొప్ప బ్రాండ్‌గా అభివృద్ధి చేసేందుకు యత్నిస్తానని జకపాంగ్ చెప్పారు. తదుపరి మిస్ యూనివర్స్ పోటీ యూఎస్‌లో న్యూ ఓర్లిన్స్‌లో జరగనుంది. (చదవండి: కళ్లు చెదిరే ఆవిష్కరణ: కన్నే ఫ్లాష్ లైట్లా వెలుగుతుంది...) -
ట్రాన్స్‌జెండర్‌గా సుష్మితా సేన్.. మద్దతుగా నిలిచిన గౌరీ సావంత్
ప్రముఖ బాలీవుడ్ నటి సుష్మితా సేన్ ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తోంది. 'తాలి' అనే వెబ్‌సిరీస్ కోసం ఆమె ప్రముఖ ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ గౌరీ సావంత్ పాత్రను పోషిస్తోంది. తాజాగా ఈ వెబ్‌సిరీస్ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల కాగా.. ఇందులో ఆమె ఆకుపచ్చని చీరలో నుదిటిపై ఎర్రటి తిలకంతో బోల్డ్లుక్లో కనిపించింది. ఆమె పాత్రపై నెగెటివ్ కామెంట్లు రావడంతో తాజాగా గౌరీ సావంత్ స్పందించింది. ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తున్న ఆమె నిర్ణయాన్ని సోషల్ మీడియాలో కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఈ విషయంలో సుస్మితా సేన్‌కు మద్దతుగా నిలిచింది. నిజమైన ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తే బాగుంటుందన్న నెటిజన్లు కామెంట్లను ఆమె తప్పబట్టింది. గౌరీ సావంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్మాత అఫీఫా నదియాడ్వాలా సయ్యద్, సుస్మితా సేన్‌తో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు. ఆమె తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మేము అసలైన స్త్రీలం… ఇప్పుడు మీరు ఇందులో నా పాత్రను పోషించబోతున్నారు. ఇది సమాజంలో మీకు గొప్ప గౌరవాన్నిఇస్తుంది. మీ ధైర్యానికి సెల్యూట్.' అంటూ సుస్మితా సేన్‌ను కొనియాడింది. ఈ పోస్ట్‌పై సుస్మితా సేన్ స్పందిస్తూ.. 'నువ్వు స్వచ్ఛమైన శక్తివి గౌరీ!!! నీవు శక్తివంతమైన ఉదాహరణగా ఉన్నందుకు ధన్యవాదాలు! మిమ్మల్ని, మీ సమాజాన్ని ఎల్లప్పుడు గౌరవిస్తాం.' అంటూ రాసుకొచ్చింది. మరాఠీ చిత్రనిర్మాత రవి జాదవ్ దర్శకత్వం వహిస్తున్న వెబ్ సిరీస్ 'తాలీ'. ఇందులో గౌరీ జీవిత ప్రయాణం, పోరాటాలను ఆరు ఎపిసోడ్లుగా తెరకెక్కిస్తున్నారు. సోహమ్ రాక్‌స్టార్ ఎంటర్టైన్మెంట్, మినీ ఫిల్మ్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. కాగా గౌరీ సావంత్ ముంబైకి చెందిన ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్. గణేష్‌గా పుట్టి ఆ తర్వాత లింగమార్పిడి చేయించుకున్న గౌరీ సావంత్ 2013లో ట్రాన్స్‌జెండర్స్‌ని కూడా పురుషులు, మహిళలు లాగే ఓ ప్రత్యేక కేటగిరి కల్పించాలని పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు ట్రాన్స్‌జెండర్స్‌ని థర్డ్‌జెండర్‌గా గుర్తిస్తూ 2014లో తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Shreegauri Sawant (@shreegaurisawant) -
ట్రాన్స్‌జెండర్ వైద్యురాలికి కీలక పదవి
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్‌కు ప్రభుత్వంలో కీలక పదవి లభించింది.అధ్యక్షుడు జోబైడెన్‌కు ఆరోగ్య రంగంలో సహాయకురాలిగా రాచెల్ లెవీన్ నియామకానికి అమెరికా సెనేట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ హక్కుల్ని పరిరక్షిస్తానని ఎన్నికల ప్రచారంలోనే మాట ఇచ్చిన బైడెన్ ఈ ఏడాది జనవరిలోనే రాచెల్‌ను అత్యున్నత పదవికి సిఫారసు చేశారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీపై వివక్ష ప్రదర్శించేవారు. ఆ వివక్ష సంకెళ్లను బద్దలు కొడుతూ బైడెన్ తీసుకున్న నిర్ణయానికి సెనేట్ మద్దతు ప్రకటించింది. ఆమె నియామకాన్ని 52–48 ఓట్లతో సెనేట్ ఖరారు చేసింది. ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు కూడా రాచెల్‌కు మద్దతు ఇచ్చారు. పెన్సిల్వేనియా స్టేట్ కాలేజీ ఆఫ్ మెడిసన్ పీడియాట్రీషన్‌గా పనిచేస్తున్న 63 ఏళ్ల రాచెల్ ఆరోగ్య రంగంలో అసిస్టెంట్ సెక్రటరీగా కరోనా వైరస్‌పై పోరాటానికి ఏర్పాటు చేసిన బృందానికి నేతృత్వం వహిస్తారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో పని చేస్తూ కరోనా కేసుల కట్టడిలో ఆమె చూపించిన ప్రతిభా పాటవాల్ని గుర్తించిన బైడెన్ రాచెల్‌ను ఈ పదవికి ఎంపిక చేశారు. -
‘నవ్వుతారు ఎక్కడికైనా వెళ్లిపో అన్నారు.. కానీ ఇప్పుడు!’
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ట్రాన్స్‌జెండర్ హక్కుల కార్యకర్త అప్సరా రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆమె కలిశారు. ఈ నేపథ్యంలో.. ‘మహిళా కాంగ్రెస్‌లోకి అప్సరారెడ్డికి స్వాగతం పలుకుతున్నాం. సామాజిక నిబంధనలను అధిగమించి, వాటిని ఆచరణలో పెట్టేందుకు, అవి ఆమోదం పొందేందుకు సుస్మితాదేవ్(కాంగ్రెస్ ఎంపీ) దారులు పరిచారు అంటూ కాంగ్రెస్ మహిళా విభాగం ట్వీట్ చేసింది. తన నియామకం గురించి అప్సరా రెడ్డి మాట్లాడుతూ.. ‘నీ(ట్రాన్స్‌జెండర్) జీవిత కాలంలో ఎటువంటి అద్భుతాలు జరగవనే జరగవు. నిన్ను చూసి నవ్వుతారు. ఎక్కడికైనా దూరంగా వెళ్లిపో అనే మాటలే నేను విన్నాను. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే నాలాంటి వారికి వెటకారాలు, వెక్కిరింపులు కొత్తేం కాదు. నాకు ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన రాహుల్‌గాంధీకి ధన్యవాదాలు. మహిళలు, పిల్లలు, ట్రాన్స్జెండర్ల తరపున నా గొంతు బలంగా వినిపిస్తాను. భారత్‌లోని అతిపెద్ద, సుదీర్ఘ చరిత్ర గల పార్టీలో నాకు ఈ పదవి దక్కడం... ఉద్వేగానికి గురిచేస్తోంది’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. కాగా 134 ఏళ్ల పార్టీ చరిత్రలో ఓ ట్రాన్స్‌జెండర్‌కు ఇటువంటి పదవి దక్కడం ఇదే తొలిసారి. గతంలో జర్నలిస్టుగా పనిచేసిన అప్సరారెడ్డి 2016లో ఏఐఏడీఎంకే(అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం) పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత్రి జయలలిత మరణం తర్వాత శశికళ అనుకూల వర్గానికి మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. Apsara Reddy has been appointed the first transgender National General Secretary of @MahilaCongress by Congress President @RahulGandhi pic.twitter.com/qDTZSgaoMH — Congress (@INCIndia) January 8, 2019 Welcoming Apsara Reddy to @MahilaCongress As @sushmitadevmp puts it the path for inclusivity comes through acceptance and compassion beyond the set societal norms.#Womenpositive https://t.co/pG3AnmPc6J — All India Mahila Congress (@MahilaCongress) January 8, 2019 -
పార్లమెంటు వద్ద ట్రాన్స్జెండర్ల ధర్నా
న్యూఢిల్లీ : ట్రాన్స్ జెండర్స్ బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంటు స్ట్రీట్‌లో ట్రాన్స్ జెండర్లు నిరసనకు దిగారు. ఏపీ, తెలంగాణ నుంచి పలువురు ట్రాన్స్ జెండర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు. పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్న ట్రాన్స్ జెండర్స్ బిల్లు తమకు ఆమోదయోగ్యం కాదని ట్రాన్స్జెండర్లు తెలిపారు. ఈ బిల్లు తమ హక్కులను రక్షించేది కాకుండా భక్షించేదిగా ఉందని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ట్రాన్స్ జెండర్స్ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. -
ఆమె ట్రాన్స్‌జెండర్ అయినందున..
పెషావర్: పాకిస్తాన్లో ఓ ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ జీవితం డాక్టర్ల నిర్లక్ష్యానికి బలైపోయింది. దుండగుల దాడిలో శరీరంలోకి ఎనిమిది తూటాలు దిగిన పరిస్థితుల్లో ఉన్న ఆమెను.. ట్రాన్స్‌జెండర్ కావడం వలన పురుష వార్డులో ఉంచాలా లేక మహిళా వార్డులో ఉంచాలా అనే సందేహంతో డాక్టర్లు సుమారు నాలుగు గంటలు చికిత్స మొదలుపెట్టలేదు. దీంతో కీలక సమయంలో వైద్యం అందకపోవడం వలనే ఆమె మృతి చెందిందని తోటి ట్రాన్స్ జెండర్లు ఆరోపిస్తున్నారు. ఖైబర్- పఖ్తున్ఖ్వ ప్రాంతంలో ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ అలీషాపై ఆదివారం రాత్రి కొందరు దుండగులు గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ట్రాన్స్జెండర్ల హక్కులకై పోరాడుతున్న అలీషా వ్యవహారం నచ్చకే సాంప్రదాయకవాదులు ఈ దాడులకు పాల్పడినట్లు అనుమానాలున్నాయి. అయితే కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అలీషాను పెషావర్‌లోని 'లేడీ రీడింగ్ హస్పిటల్'కు తరలించారు. బుల్లెట్ గాయాలతో తీవ్ర రక్తస్రావం అవుతున్న అలీషాకు ట్రీట్మెంట్ చేయడంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. అంతేకాదు ఆ సమయంలో అలీషా స్నేహితులతో హాస్పిటల్ సిబ్బంది అసభ్యంగా వ్యవహరించారనే ఆరోపనలున్నాయి. మృతి చెందడానికి ముందు సమాజంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న ట్రాన్స్జెండర్లను ప్రభుత్వం ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరింది.