
న్యూఢిల్లీ : ట్రాన్స్ జెండర్స్ బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంటు స్ట్రీట్లో ట్రాన్స్ జెండర్లు నిరసనకు దిగారు. ఏపీ, తెలంగాణ నుంచి పలువురు ట్రాన్స్ జెండర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు. పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్న ట్రాన్స్ జెండర్స్ బిల్లు తమకు ఆమోదయోగ్యం కాదని ట్రాన్స్‌జెండర్లు తెలిపారు. ఈ బిల్లు తమ హక్కులను రక్షించేది కాకుండా భక్షించేదిగా ఉందని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ట్రాన్స్ జెండర్స్ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment