bill -2017
-
నిందితులపై వేధింపులకు పాల్పడితే జైలు!
న్యూఢిల్లీ: నిందితులు, అనుమానితుల నుంచి నిజాల్ని రాబట్టడానికి వేధింపులకు పాల్పడే పోలీసులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం మూడేళ్ల జైలు శిక్ష విధించాలని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ఒక ప్రైవేట్ బిల్లులో ప్రతిపాదించారు. వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించడంతో పాలు పరిహారం కూడా వసూలు చేయాలని అందులో పేర్కొన్నారు. హింస నిరోధక బిల్లు–2017 పేరిట విజయసాయి రెడ్డి ప్రతిపాదించిన బిల్లులో...కస్టడీలో ఉన్న నిందితుడిని బలవంతంగా నేరం చేసినట్లు ఒప్పించడానికి లేదా నేరానికి సంబంధించిన సమాచారం రాబట్టడానికి హింసకు పాల్పడే వారిని శిక్షించాలని ప్రతిపాదించారు. భారత్లో హింసా వ్యతిరేక చట్టం లేకపోవడంతో ఇతర దేశాల నుంచి నేరగాళ్లను రప్పించే ప్రయత్నాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. -
పార్లమెంటు వద్ద ట్రాన్స్జెండర్ల ధర్నా
న్యూఢిల్లీ : ట్రాన్స్ జెండర్స్ బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంటు స్ట్రీట్లో ట్రాన్స్ జెండర్లు నిరసనకు దిగారు. ఏపీ, తెలంగాణ నుంచి పలువురు ట్రాన్స్ జెండర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు. పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్న ట్రాన్స్ జెండర్స్ బిల్లు తమకు ఆమోదయోగ్యం కాదని ట్రాన్స్జెండర్లు తెలిపారు. ఈ బిల్లు తమ హక్కులను రక్షించేది కాకుండా భక్షించేదిగా ఉందని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ట్రాన్స్ జెండర్స్ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. -
ఓబీసీల హక్కులను కాలరాయొద్దు
విపక్షాలపై మోదీ విమర్శలు న్యూఢిల్లీ: ఇతర వెనుకబడిన కులాల ప్రజల హక్కులను వారికి అందకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విమర్శించారు. ఓబీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పించే బిల్లు–2017 (రాజ్యాంగ సవరణ–123వ)కు సంబంధించి రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని ఈ విమర్శలు చేశారు. అన్ని పార్టీల కోరిక మేరకే కేంద్రం ఈ బిల్లు తెచ్చిందన్నారు. ‘లోక్సభలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. కానీ రాజ్యసభలో విపక్షపార్టీలు ఈ బిల్లుకు ఎందుకు అడ్డుపడుతున్నాయో అర్థం కావటం లేదు. వెనుకబడిన తరగతుల హక్కులను అడ్డుకునే వ్యతిరేక రాజకీయాలు చూసి చింతిస్తున్నాం’ అని మోదీ అన్నారు. బీజేపీ ఓబీసీ ఎంపీలు.. ఇతర పార్టీల్లోని ఓబీసీ రాజ్యసభ ఎంపీలను కలిసి వారిని ఒప్పించాలని సూచించారు.