బ్యాంకాక్: మిస్ యూనివర్స్ వంటి అందాల పోటీలను నిర్వహించే సంస్థను తొలిసారిగా ఒక థాయి మహిళ సుమారు రూ. 164 కోట్లతో కొనుగోలు చేసింది. థాయి స్థానిక మీడియా ప్రాజెక్టు రన్‌వే ఎడిషన్‌ను నిర్వహిస్తున్న ట్రాన్స్ జెండర్ హక్కుల ప్రచారకర్త అయినా జకపాంగ్ జక్రాజుతాటిప్ ఈ సంస్థను కొనుగోలు చేసినట్లు జేకేఎన్ గ్లోబల్ గ్రూప్ బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఆమె సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తారని గ్లోబల్ గ్రూప్ పేర్కొంది.
అంతేగాదు 70 ఏళ్ల చరిత్రలో ఈ అందాల పోటీ సంస్థను సొంతం చేసుకున్న తొలిమహిళ జకపాంగేనని వెల్లడించింది. గతంలో ఈ సంస్థ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యజమాన్యంలో ఉన్నట్లు తెలిపింది. ఈమేరకు జకపాంగ్ మాట్లాడుతూ...తాను కొనుగోలు చేసిన బ్రాండ్‌ని అభివృద్ధి చేయడానికి దొరికిన అరుదైన అవకాశంగా పేర్కొంది. ఇది థాయ్‌లాండ్ ప్రతిష్టను మరింత పెంచుతుందని భావిస్తున్నానని చెప్పింది.
ఈ సంస్థ థాయ్‌లాండ్‌కు ఒక మంచి శక్తిగా ఉపయోగపడుతుందని, పైగా ఎక్కువ మంది పర్యాటకులను తీసుకువస్తుందని విశ్వసిస్తున్నాని అని అన్నారు. ఈ సంస్థ తాను రన్ చేస్తున్న కంపెనీ ఫోర్ట్‌ఫోలియోకు బలమైన వ్యూహాత్మక శక్తిగా ఉంటుందని పేర్కొంది. అలాగే విభిన్న నేపథ్యాలు, సంస్కృతులు, సంప్రదాయాలు నుంచి వచ్చే ఉద్వేగభరితమైన వ్యక్తులకు వేదికను అందించే వారసత్వాన్ని కొనసాగిస్తూ..ఒక గొప్ప బ్రాండ్‌గా అభివృద్ధి చేసేందుకు యత్నిస్తానని జకపాంగ్ చెప్పారు. తదుపరి మిస్ యూనివర్స్ పోటీ యూఎస్‌లో న్యూ ఓర్లిన్స్‌లో జరగనుంది.
(చదవండి: కళ్లు చెదిరే ఆవిష్కరణ: కన్నే ఫ్లాష్ లైట్‌లా వెలుగుతుంది...)
Comments
Please login to add a commentAdd a comment