New Governors
-
గవర్నర్ గా నియమించినందుకు ధన్యవాదాలు : హరిబాబు
-
న్యూఢిల్లీ: 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం 8 మంది కొత్త గవర్నర్ పేర్లను ప్రకటించింది. మిజోరాం గవర్నర్‌గా విశాఖపట్నం మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. హిమాచల్ నుంచి హర్యానాకు దత్తాత్రేయ బదిలీ అయ్యారు. కర్ణాటక గవర్నర్‌గా థావర్‌చంద్ గెహ్లాట్(ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు), గోవా గవర్నర్‌గా శ్రీధరన్ పిళ్లై (మిజోరాం ప్రస్తుత గవర్నర్), హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా రాజేంద్రన్ విశ్వనాథ్‌ను కేంద్రం ప్రకటించింది. మధ్యప్రదేశ్ గవర్నర్‌గా మంగూబాయి చగన్‌భాయ్ పటేల్, త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య, జార్ఖండ్ గవర్నర్‌గా రమేష్ బయాస్ నియమితులయ్యారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు ముందే కేంద్రం.. గవర్నర్ల నియామకాలను జరిపింది. రేపు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరిగే అవకాశం ఉంది. హిమాచల్ నుంచి హర్యానాకు దత్తాత్రేయ బదిలీ త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య మిజోరాం గవర్నర్‌గా విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు కర్ణాటక గవర్నర్‌గా థావర్‌చంద్ గెహ్లాట్ గోవా గవర్నర్‌గా శ్రీధరన్ పిళ్లై (మిజోరాం ప్రస్తుత గవర్నర్) -
చిన్నా, పెద్దా ఇద్దరూ మనోళ్లే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాయి. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షురాలైన తమిళిసై సౌందరరాజన్(58) సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ప్రస్తుతం దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన గవర్నర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. తెలంగాణ గవర్నర్‌గా నరసింహన్ పదవీకాలం ముగియడంతో తమిళి సై కొత్తగవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్(85) మరో రికార్డు సాధించారు. దేశంలోనే అత్యంత పెద్దవయస్కుడైన గవర్నర్‌గా హరిచందన్ నిలిచారు. ప్రస్తుతం దేశంలోని 29 రాష్ట్రాలకు నియమితులైన 28 గవర్నర్లలో ఒక్క తమిళి సై మాత్రమే 60 ఏళ్లలోపు వయసువారు కావడం గమనార్హం. ప్రస్తుతం గుజరాత్ గవర్నర్‌గా పనిచేస్తున్న ఆచార్య దేవవ్రత్(60) పిన్న వయస్కుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఆయన్ను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో గుజరాత్ గవర్నర్‌గా నియమించింది. ఇక హరిచందన్ తర్వాత మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్(84) రెండో స్థానంలో నిలిచారు. మొత్తం 28 మంది గవర్నర్లలో చాలామంది 70–79 ఏళ్ల వయసువారే ఉన్నారు. ఈ జాబితాలో ఏడుగురు గవర్నర్లకు 60 ఏళ్లు ఉండగా, మరో 14 మంది గవర్నర్లకు 70 సంవత్సరాలు నిండాయి. ఇక ఆరుగురు గవర్నర్ల వయసు 80 ఏళ్లకు చేరుకుంది. ఈ 28 మంది గవర్నర్లలో 19 మంది రాజ్‌భవన్‌లో తొలిసారి అడుగుపెట్టారు. -
ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ నూతన గవర్నర్‌గా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్(58)ను కేంద్రం నియమించింది. ఆదివారం ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు వెలువరించారు. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ(72)ను హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది. మొత్తం ఐదు రాష్ట్రాలకు రాష్ట్రపతి కొత్త గవర్నర్లను నియమించారు. తెలంగాణకు ఈఎస్ఎల్ నరసింహన్ స్థానంలో తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ కల్రాజ్ మిశ్రా(78)ను రాజస్తాన్ గవర్నర్‌గా, హిమాచల్ ప్రదేశ్‌కు నూతన గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ, కేరళ గవర్నర్‌గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగర్‌రావు స్థానంలో భగత్ సింగ్ కోశ్యారీ(77)ని నియమించింది. కొత్త గవర్నర్ల నియామకాలు వారు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవనం తెలిపింది. రాజస్తాన్ గవర్నర్‌గా ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేస్తున్న యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ స్థానంలో మిశ్రా బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజీవ్ కేబినెట్లో మంత్రికి గవర్నర్ గిరీ కేరళ గవర్నర్‌గా నియమితులైన ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్(68) సొంతరాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆయన గతంలో కేంద్రంలో రాజీవ్ గాంధీ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాబానో కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా 1985లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటాన్ని మంత్రిగా ఉన్న ఆరిఫ్ తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముస్లిం పర్సనల్ లా సంస్కరణలు చేపట్టాలని, ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హం చేయాలని ఆరిఫ్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆయన..2007 వరకు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హం చేస్తూ చట్టం చేసిన మోదీ ప్రభుత్వానికి ఆయన మద్దతు తెలిపారు. ప్రస్తుతం కేరళ గవర్నర్‌గా ఉన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పళనిస్వామి సదాశివం స్థానంలో ఆరిఫ్ బాధ్యతలు చేపట్టనున్నారు. దక్షిణాదిలో బలపడేందుకేనా? న్యూఢిల్లీ: తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారిని గవర్నర్లుగా నియమించడం దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో భాగమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతల్ని మచ్చిక చేసుకునేందుకు, కొత్త నాయకత్వంతో సంస్థాగతంగా బలం కూడదీసుకునేందుకు ఇటీవలి కాలంలో బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ద్రవిడ రాష్ట్రంలో కొత్త నాయకత్వాన్ని తీసుకురావడానికి మార్గం సుగమమయ్యేలా తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళిసై సౌందరరాజన్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమించిందని పరిశీలకులు భావిస్తున్నారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో టీడీపీ శ్రేణులను చేర్చుకోవడం ద్వారా బీజేపీని విస్తరించుకోవాలనే యోచనలో ఉందని అంటున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో దేశమంతటా బీజేపీ సత్తా చాటినప్పటికీ, ఇప్పటికే బలంగా ఉన్న కర్ణాటక మినహా ప్రభావం చూపలేకపోయింది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక్క సీటూ దక్కించుకోలేకపోయింది. అయితే, 2014 ఎన్నికల్లో ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించిన బీజేపీ ఈసారి నాలుగు సీట్లు గెలుచుకుంది. అధికార టీఆర్ఎస్కు దీటుగా ఎదిగేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలను చేర్చుకోవడం వంటి చర్యలను వేగవంతం చేసింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్, వామపక్ష పార్టీల ప్రాభవం తగ్గడంతో కేరళ వంటి రాష్ట్రాల్లో బలం పుంజుకునేందుకు తమ పార్టీకి మంచి అవకాశాలున్నాయని సీనియర్ నేత ఒకరు అన్నారు. అదేవిధంగా, తమిళనాడులో దిగ్గజ నేతలు జయలలిత, కరుణానిధిల మరణంతో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేయాలని కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. కర్ణాటకకు చెందిన బీఎల్ సంతోష్‌ను జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి(సంస్థాగత)గా నియమించడం కూడా దక్షిణాదిన బలపడేందుకు దోహదం చేస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. -
నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
న్యూఢిల్లీ: కేంద్రం నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంతోపాటు ఉత్తరప్రదేశ్, బిహార్ గవర్నర్లకు స్థానచలనం కలిగించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా మాజీ ఎంపీ, ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది జగ్దీప్ ధంకర్(68)ను నియమిస్తూ శనివారం రాష్ట్రపతి భవన్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. వచ్చే వారం పదవీ విరమణ చేయనున్న కేసరీనాథ్ త్రిపాఠీ స్థానంలో ధంకర్ బాధ్యతలు చేపడతారని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. బెంగాల్లో రాజకీయ ఆధిపత్యం కోసం బీజేపీ, మమతా బెనర్జీల మధ్య పోరు కొనసాగుతున్న సమయంలో ఈ నియామకం చేపట్టడం గమనార్హం. ధంకర్ 1990–91 సంవత్సరాల మధ్య పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు. 2003లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరి ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే, 2018 జనవరి నుంచి మధ్యప్రదేశ్ గవర్నర్‌గా పనిచేస్తున్న ఆనందీబెన్ పటేల్‌ను కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు గవర్నర్‌గా నియమించింది. ఆనందీ బెన్ స్థానంలో బీజేపీ కురువృద్ధ నేత, బిహార్ గవర్నర్ లాల్జీ టాండన్‌ను మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమించినట్లు రాష్ట్రపతి భవన్ పేర్కొంది. టాండన్ స్థానంలో బిహార్ గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత ఫగు చౌహాన్ బాధ్యతలు చేపడతారని ఆ సర్క్యులర్ వెల్లడించింది. త్రిపుర గవర్నర్‌గా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత రమేశ్ బైస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి పదవీ కాలం 27న ముగియనుంది. నాగాలాండ్ గవర్నర్‌గా ఇంటెలిజెన్స్ బ్యూరో రిటైర్డు స్పెషల్ డైరెక్టర్ ఎన్.రవి నియమితులయ్యారు. 1976 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రవి నాగా వేర్పాటువాదులతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకోవడంలో కీలకపాత్ర పోషించారు. వీరు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ తెలిపింది. 1950లో యూపీ ఏర్పడిన తర్వాత మొదటి మహిళా గవర్నర్ ఆనందీబెన్. అంతకుముందు ఉన్న యునైటెడ్ ప్రావిన్సుకు 1947లో సరోజినీ నాయుడు గవర్నర్‌గా నియమితులయ్యారు. -
ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బిహార్ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్‌ను జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా నియమించారు. బిహార్ కొత్త గవర్నర్‌గా లాల్జీ టాండన్ నియమితులయ్యారు. మేఘాలయ గవర్నర్‌గా తథాగత రాయ్, త్రిపుర గవర్నర్‌గా కప్తాన్ సింగ్ సోలంకి, సిక్కిం గవర్నర్‌గా గంగా ప్రసాద్, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా బేబీ రాణి మౌర్య, హరియాణ గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్ ఆర్యహాస్‌లను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. -
రెండు రాష్ట్రాలకు నూతన గవర్నర్లు
సాక్షి,న్యూఢిల్లీ: ఒడిషా, మిజోరం రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. ఒడిషా గవర్నర్‌గా హర్యానా బీజేపీ చీఫ్ గణేష్ లాల్‌ను నియమితులైయ్యారు. ఒడిషా గవర్నర్ ఎస్.టీ జామీర్ మార్చితో పదవి గడవు ముగియడంతో బిహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అదనపు బాధ్యతులు నిర్వహిస్తున్నారు. గణేష్ లాల్‌ను ఒడిషా గవర్నర్‌గా నియమిస్తున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ వర్గాలు ప్రకటించాయి. మిజోరం నూతన గవర్నర్‌గా కేరళ బీజేపీ చీఫ్ ప్రొఫెసర్ కుమ్మమానం రాజశేఖరన్ నియమితులైయ్యారు. మిజోరం గవర్నర్ నిర్బయ్ శర్మ పదవి కాలం మే 28తో ముగియనుండడంతో నూతన గవర్నర్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు ప్రకటించాయి. ప్రొఫెసర్ రాజశేఖరన్ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2015లో కేరళ బీజేపీ చీఫ్‌గా నియమితులైయ్యారు. కాగా నూతన గవర్నర్లుగా నియమితులైన ఇద్దరూ ఆర్ఎస్ఎస్, బీజేపీ నుంచి వచ్చిన వారే కావడం విశేషం. -
త్వరలోనే కొత్త గవర్నర్లు!
- నరసింహన్‌కు కేంద్రంలో కీలక బాధ్యతలు - తెలంగాణకు కొత్త గవర్నర్‌గా శంకర్మూర్తి? - ఉప రాష్ట్రపతి ఎన్నికలయ్యాక మార్పులకు నిర్ణయం - ప్రతిపాదనలు సిద్ధం చేసిన కేంద్ర హోం శాఖ సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను త్వరలోనే మార్చే అవకాశాలున్నాయి. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ముగియగానే కొత్త గవర్నర్‌ను నియమించాలని కేంద్రం యోచిస్తోంది. ఇటీవల గవర్నర్ ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో కేంద్ర హోం శాఖ వర్గాలు సూచనప్రాయంగా ఈ సంకేతాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మే నెలలో ముగిసిన పదవీకాలాన్ని పొడిగించటంతో మరికొంత కాలం తనను ఇక్కడే కొనసాగిస్తారని గవర్నర్ ఆశించారు. అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ మొదలవటంతో పాటు ఉప రాష్ట్రపతి రేసులో ఎన్డీఏ పక్షాన నరసింహన్ పేరు ప్రధానంగానే వినిపించింది. కానీ మారిన రాజకీయ సమీకరణాలతో కేంద్రం నరసింహన్‌కు మరో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు సమాచారం. గతంలో ఇంటెలిజెన్స్‌లో పని చేసిన అనుభవముండటంతో సెక్యూరిటీ వింగ్ లేదా ఇంటెలిజెన్స్ వ్యవహారాల్లో ఆయనకు ఏదో ముఖ్యమైన పదవి ఇవ్వనున్నట్లు తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ముగియగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్లు: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్ స్థానంలో ఏపీకి, తెలంగాణకు వేర్వేరుగా ఇద్దరు గవర్నర్లను నియమించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు హోంశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కర్నాటకకు చెందిన సీనియర్ నాయకుడు శంకర్‌మూర్తిని తెలంగాణ గవర్నర్‌గా నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. 2010 జనవరిలో నరసింహన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా పనిచేసిన ఆయన.. తెలంగాణ ఉద్యమ సమయంలో గవర్నర్ బాధ్యతలను నిక్కచ్చిగా నిర్వర్తించారు. అదే సందర్భంలో.. 2012 మే 3న మరో ఐదేళ్లపాటు పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మే 3వ తేదీతో నరసింహన్ పదవీకాలం ముగిసింది. కానీ.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు గవర్నర్‌గా కొనసాగాలని కేంద్రం హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గవర్నర్‌కు మౌఖిక అదేశాలు జారీ చేశారు. దీంతో తదుపరి ఉత్తర్వులెప్పుడొస్తాయి.. ఎంతకాలం నరసింహన్ గవర్నర్‌గా కొనసాగుతారనే ఉత్కంఠ కొనసాగింది. గవర్నర్‌గా ఉండేందుకు మొగ్గు ఇటీవల ఉప రాష్ట్రపతి ఎన్నికల రేసులో తన పేరు వినిపించటంతో నరసింహన్ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా కేంద్ర పెద్దల వద్ద తనకున్న పరిచయాలతో మరోసారి గవర్నర్ ఛాన్స్‌కు నరసింహన్ ఆసక్తి చూపినట్లు తెలిసింది. కానీ.. కొత్త గవర్నర్ వచ్చేంత వరకు పదవిలో కొనసాగాలని సూచించాలని .. అంతకు మించి కీలక బాధ్యతలు అప్పగిస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు గవర్నర్‌ను తిప్పి పంపినట్లు తెలిసింది. -
పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 75 సంవత్సరాల వయసు రావడంతో కేంద్ర మంత్రి పదవి నుంచి ఇటీవలే తప్పుకొన్న సీనియర్ నాయకురాలు డాక్టర్ నజ్మాహెప్తుల్లాను మణిపూర్ గవర్నర్‌గా నియమించారు. ఆమె ఈ రాష్ట్రానికి 18వ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2015 సెప్టెంబర్ 30వ తేదీ నుంచి మణిపూర్ బాధ్యతలను కూడా మేఘాలయ గవర్నర్ వి. షణ్ముగనాథన్ చూస్తున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో మణిపూర్ రాష్ట్రానికి గవర్నర్ వచ్చారు. ఈ రాష్ట్రానికి వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఆమెతో పాటు అసోం గవర్నర్‌గా బన్వారీలాల్ పురోహిత్, పంజాబ్ గవర్నర్‌గా వీపీ సింగ్ బద్నోర్లను నియమించారు. అలాగే, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ గా జగదీష్ ముఖిని నియమించారు. -
త్వరలో కొత్త గవర్నర్లు
న్యూఢిల్లీ: రానున్న రెండు, మూడు వారాల్లో బీహార్, పంజాబ్, అస్సాం సహా దాదాపు ఆరు రాష్ట్రాల్లో కొత్త గవర్నర్లను నియమించనున్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం బీహార్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, త్రిపురల్లో గవర్నర్ పదవి ఖాళీగా ఉంది. పంజాబ్ గవర్నర్ శివరాజ్ పాటిల్ ఈ నెల 21న రిటైర్ అవుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ ఊర్మిళ సింగ్ పదవీకాలం జనవరి 24తో ముగుస్తోంది. తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య, ఒడిశా గవర్నర్ ఎస్సీ జమీర్ కూడా త్వరలో రిటైర్ కానున్నారు. వారిద్దరినీ యూపీఏ ప్రభుత్వం నియమించింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్డీఏ ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, హరియాణా, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, నాగాలాండ్, గోవాలకు కొత్త గవర్నర్లను నియమించింది. మోదీ సీఎంగా ఉండగా గుజరాత్ గవర్నర్‌గా ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించిన కమల బేణివాల్‌ను మిజోరంకు బదిలీ చేసి, అనంతరం ఆ పదవి నుంచి తొలగించారు. అలాగే, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీరేంద్ర కటారియాను కూడా తొలగించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని వారాల తరువాత యూపీఏ హయాంలో గవర్నర్లుగా నియమితులైన పలువురిని రాజీనామా చేయాల్సిందిగా కేంద్ర హోంశాఖ సెక్రటరీ అనిల్ గోస్వామి కోరడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత యూపీఏ నియమించిన గవర్నర్లు షీలా దీక్షిత్(కేరళ), ఎంకే నారాయణన్(పశ్చిమబెంగాల్), అశ్వని కుమార్(నాగాలాండ్), బీఎల్ జోషి(యూపీ), బీవీ వాంఛూ(గోవా), శేఖర్ దత్(ఛత్తీస్‌గఢ్), వీకే దుగ్గల్(మణిపూర్) రాజీనామా చేశారు. -
మహారాష్ట్ర గవర్నర్‌గా చెన్నమనేని
మరో మూడు రాష్ట్రాలకూ కొత్త గవర్నర్లు న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మంళవారం ఆదేశాలు జారీచేసింది. మహారాష్ట్ర గవర్నర్‌గా సీహెచ్ విద్యాసాగర్‌రావును, రాజస్థాన్ గవర్నర్‌గా కల్యాణ్ సింగ్‌ను, కర్ణాటక గవర్నర్‌గా వజూభాయ్ వాలాను, గోవా గవర్నర్‌గా మృదు లా సిన్హా నియమితులయ్యారు. గవర్నర్ల నియామకానికి కేంద్రం ప్రతిపాదించిన పేర్లకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితుడైన తెలంగాణ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు కరీంనగర్ జిల్లా కు చెందిన నేత. గత ఎన్డీఏ హయాంలో వాజ్‌పేయి కేబినెట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రాజస్థాన్ గవర్నర్‌గా నియమితుడైన సీనియర్ బీజేపీ నేత 82 సంవత్సరాల కల్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేశారు. కర్ణాటక కొత్త గవర్నర్ 76ఏళ్ల వజూభాయ్ వాలా గుజరాత్ బీజేపీ సీనియర్ నేత. ఇక గోవా గవర్నర్‌గా నియమితురాలైన మృదుల సిన్హా బీజేపీ మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు. మహారాష్ట్ర గవర్నర్ శంకర నారాయణన్ రాజీనామా, రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ ఆల్వా కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ పదవీ విరమణ కావటం, గోవా గవర్నర్ పదవినుంచి వైదొలగిన వీబీ వాంచూల స్థానాల్లో వీరు నియమితులయ్యారు. షీలా దీక్షిత్ రాజీనామా కేరళ గవర్నర్ పదవికి షీలా దీక్షిత్ రాజీనామా చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను ఢిల్లీలో కలుసుకున్న మరుసటిరోజునే షీలా దీక్షిత్ రాజీనామా సమర్పించారు. ఆమె రాజీనామా లేఖను రాష్ట్రపతి సచివాలయం కేంద్ర హోం మంత్రిత్వశాఖకు పంపించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. తాను సోమవారమే రాజీనామాచేశానని, దీనిపై ఇంతకు మించి మాట్లాడదలుచుకోలేదని షీలా దీక్షిత్ అన్నారు. అంచెలంచెలుగా గవర్నర్ స్థాయికి.. సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్న చెన్నమనేని విద్యాసాగర్ రావు తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నేత. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆయన,.. బీజేపీలోఅంచెలంచెలుగా ఎదిగారు. 69ఏళ్ల విద్యాసాగర్ రావు వృత్తిరీత్యా న్యాయవాది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఉన్నారు. 1985, 1989, 1994లో కరీంనగర్ జిల్లా మెట్పల్లి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. 1985 నుంచి 1998 వరకు ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో ఆయన బీజేపీ పక్షనేతగా వ్యవహరించారు. కరీంనగర్ లోక్‌సభ స్థానంనుంచి 1998, 1999లో ఎన్నికై, వాజ్‌పేయి కేబినెట్లో స్థానం సాధించారు. 1999లో ఉమ్మడి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యుడుగా పనిచేసిన విద్యాసాగర్ రావు, 1972లో హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కాలేజీలో ఏబీవీపీ విభాగం అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1975లో ఎమర్జెన్సీ కాలంలో అంతర్గత భద్రతా నిర్వహణా చట్టం(మీసా)కింద ఆయన అరెస్టయ్యారు. ఆ తర్వాత జనసంఘ్‌లో, బీజేపీలో కీలకపాత్ర పోషించారు. గోదావరిలో నీటి వృధాను అరికట్టేందుకు సేద్యపునీటి ప్రాజెక్టు నిర్మించాలంటూ 1998లో పాదయాత్ర నిర్వహించారు.