
సత్యపాల్ మాలిక్
ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సాక్షి, న్యూఢిల్లీ : ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బిహార్ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్‌ను జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా నియమించారు. బిహార్ కొత్త గవర్నర్‌గా లాల్జీ టాండన్ నియమితులయ్యారు. మేఘాలయ గవర్నర్‌గా తథాగత రాయ్, త్రిపుర గవర్నర్‌గా కప్తాన్ సింగ్ సోలంకి, సిక్కిం గవర్నర్‌గా గంగా ప్రసాద్, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా బేబీ రాణి మౌర్య, హరియాణ గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్ ఆర్యహాస్‌లను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది.