Governors
-
కేంద్ర రాష్ట్రాల సయోధ్యతోనే వృద్ధి
రాజ్యాంగం ప్రవచించిన భారత సమాఖ్య విధానం కాల పరీక్షకు తట్టుకుని దృఢంగా నిలిచింది. అధికారాల విభజన, లిఖిత రాజ్యాంగం, స్వతంత్ర న్యాయవ్యవస్థవంటివి సమాఖ్య లక్షణాలు. వీటిని బల మైన కేంద్ర ప్రభుత్వం, అత్యవసర సంద ర్భాలకు అనువైన నిబంధనలు, కేంద్ర నియమిత గవర్నర్ల వ్యవస్థలతో అనుసంధానం చేశారు. ఎంతో నేర్పుగా జరిగిన ఈ మేళవింపు ఒక అద్భుతం. కాబట్టే... పలు ప్రాంతీయ అస్తిత్వాలు, మరెన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, ఇంత పెద్ద దేశ పరిపాలన సుసాధ్యమైంది. భిన్నత్వంలో ఏకత్వం సాధించగలిగాం. ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ...కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో ఉద్రిక్తతలు లేవని కాదు. ఉన్నాయి. అయితే ఏ సమాఖ్య దేశంలో ఇవి లేవు? కెనడాలో సుదీర్ఘకాలంనుంచీ క్యుబెక్ వేర్పాటు ఉద్యమం నడుస్తోంది. క్యాటలన్ స్వాతంత్య్ర ఉద్యమంతో స్పెయిన్ సతమతమవుతోంది. అమెజాన్ అడవుల నరికివేత సమస్య బ్రెజిల్ కేంద్ర–రాష్ట్ర సంబంధాలను దెబ్బతీస్తోంది. ఇక నైజీరియా, ఇథియోపియాలు అక్కడి జాతుల ఘర్షణతో అట్టుడికి పోతున్నాయి. వనరుల పంపకంలో తలెత్తిన అసంతృప్తి జ్వాలలు చివరకు ఇండోనేషియా నుంచి ఈస్ట్ తిమోర్ వేరుపడేందుకు దారి తీశాయి. వీటితో పోల్చి చూసుకుంటే, మన ఉద్రిక్తతలు అదుపు తప్ప కుండా మనం సర్దుకుపోగలుగుతున్నాం. మన రాజ్యాంగం ఏర్పర చిన ‘చెక్స్ అండ్ బ్యాలెన్సెస్’ ఇందుకు కారణం. మన సమాఖ్య విధానం కాలానుగుణ మార్పులను తనలో ఇముడ్చుకుంటూ సాగిపోతోంది. అయితే, మన సహకార సమాఖ్య విధానం... పోరాట సమాఖ్య విధానం దిశగా జరిగిపోయింది. ఇదొక అపశ్రుతి. తమ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ప్రాంతీయ పార్టీలు, జాతీయ ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు భావిస్తు న్నాయి. కేంద్ర వైఖరి పట్ల అక్కడ వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇది రాజకీయ కోణం. ఆర్థిక కోణం నుంచి చూస్తే, ఈ చీలిక మరీ తీవ్రంగా ఉంది.కేంద్ర నిధుల బదలాయింపులు తగినంతగా ఉండటం లేదని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. తమ సొంత ఆదాయాలకు తమ వ్యయ బాధ్యతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కేంద్రం భర్తీ చేయాలని కోరుతున్నాయి. అంతేకాదు, కేంద్రం ఇచ్చే నిధులను ఎలా ఖర్చు చేయాలనే అంశంలో వాటికి పూర్తి స్వయం ప్రతిపత్తి ఉండటం లేదు. దీనికి తోడు, అవి ఎంత అప్పు చేయాలో, ఎవరి నుంచి తీసుకోవాలో కూడా కేంద్రం నిర్ణయిస్తోంది. రాష్ట్రాలకు వ్యతిరేకం కాదు!ఈ వాదన చర్చనీయం. ఆర్థిక సమాఖ్య విధానం అత్యుత్తమ మైంది కాదనుకున్నా, నిధుల బదిలీ ఏర్పాట్లు రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉన్నాయనడం సరికాదు. ఎలానో ఒక ఉదాహరణ చెప్పుకుందాం. రాజ్యాంగం ఒరిజినల్‌గా నిర్దేశించిన ప్రకారం, రాష్ట్రాలకు రెండే రెండు కేంద్ర పన్నుల్లో వాటా లభించాల్సి ఉంటుంది.. ఒకటి వ్యక్తిగత ఆదాయ పన్ను, రెండు కేంద్ర ఎక్సయిజ్ సుంకాలు. 2000 సంవత్సరంలో చేసిన రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఏర్పాటును రాష్ట్రాలకు అనుకూల రీతిలో మార్చారు. దీని ప్రకారం, కేవలంరెండు పన్నుల్లోనే కాకుండా కేంద్రం వసూలు చేసే అన్ని పన్నుల్లో వాటికి వాటా దక్కింది. అలాగే, ప్రణాళికా సంఘం రద్దుతో రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తి సైతం పెరిగింది. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమల్లోకి రావడంతో మరో యుద్ధానికి తెరలేచింది. తమ ప్రయోజనాలను హరించివేయడానికి తమ మెడలు వంచి మరీ దీన్ని తీసుకు వచ్చారని రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఇది వాటి హ్రస్వదృష్టి అవుతుంది. కొత్త పన్నులు వేయడంలో వాటికి ఉన్న స్వేచ్ఛను కొంత కోల్పోయిఉండొచ్చు. కేంద్రం కూడా అలాగే కోల్పోయిందని గుర్తుంచుకోవాలి. క్రమేణా, జీఎస్టీ వల్ల పన్ను పరిధి విస్తరిస్తుంది. ఎగవేతలకు బ్రేక్ పడుతుంది. తద్వారా కేంద్రం, రాష్ట్రాలు రెండూ ప్రయోజనంపొందుతాయి. ఆర్థిక సమాఖ్య విధానం నిబంధనలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయన్న రాష్ట్రాల భావన వాస్తవం కాదు. అదే సమయంలో, రాష్ట్రాల ఆర్థిక సవాళ్ల పట్ల కూడా కేంద్రం ఎంతో సానుభూతి కనబరచాలి, వాటితో సంప్రదింపులకు ఎఫ్పుడూ సిద్ధంగా ఉండాలి. అయితే ఇలా జరుగుతోందా? ఉదాహరణకు, కేంద్రం పన్నులుపెంచడానికి బదులు సెస్సులు, సర్‌ఛార్జ్‌లు పెంచుకుంటూపోతోంది. కేంద్రం విధించే అన్ని పన్నుల నుంచీ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలంటూ 2000 సంవత్సరంలో రాజ్యాంగ సవరణ చేసినప్పుడు, కేంద్రం పరిమితంగానే సెస్సులు, సర్‌ఛార్జ్‌లు విధిస్తుందని భావించారు. అయితే అందుకు విరుద్ధంగా జరుగుతోంది. వాటిలో తమకు వాటా రాదు కాబట్టి జాతీయ పన్ను ఆదాయంలో న్యాయబద్ధంగా తమకు దక్కాల్సిన వాటా దక్కడం లేదని, ఇది తమను మోసం చేయడమేనని రాష్ట్రాలు బాధపడుతున్నాయి.2047 గేమ్ ప్లాన్?ఆర్థిక గురుత్వ కేంద్రం రాష్ట్రాల దిశగా జరిగిందని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఉజ్జాయింపు అంచనా ప్రకారం, కేంద్రం ఉమ్మడి రెవెన్యూ వసూళ్లు (కేంద్రం, రాష్ట్రాలవి కలిపి) 60 శాతంఉండగా, ఉమ్మడి వ్యయాల్లో కేంద్రం వాటా 40 శాతం మాత్రమే ఉంటోంది. రాష్ట్రాల విషయంలో ఇందుకు పూర్తి భిన్నంగా జరుగు తోంది. వాటన్నిటి ఉమ్మడి రెవెన్యూ వసూళ్లు కలిసి 40 శాతం కాగా, ఖర్చు మాత్రం 60 శాతం చేస్తున్నాయి. దీని అర్ధం ఏమిటంటే, దేశ స్థూల ఆర్థిక సుస్థిరత, తద్వారా పెట్టుబడులు పెంచే సామర్థ్యం కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి ఆర్థిక బాధ్యత మీద ఆధారపడి ఉంటుంది. 2047లో మనం వందేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకొంటాం. అప్పటికి ఇండియా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాలని ఉవ్విళ్లూరుతున్నాం. ఆ స్థాయికి చేరడానికి మన ముందున్న ఎజెండా కూడా అంత పెద్దది, సంక్లిష్టమైంది. కేంద్రం రాష్ట్రాలు ఉమ్మడి వ్యూహంతో ముందడుగు వేస్తే తప్ప మనం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించలేం. ఆర్థిక వ్యవస్థ ఉత్పా దకతను మెరుగు పరచుకోవడానికి అవసరమైన రెండో తరం సంస్క రణలను అమలు చేయడం మన గేమ్ ప్లాన్‌లో భాగం అయితీరాలి. 1990ల తొలితరం సంస్కరణలు పెట్టుబడులు, వాణిజ్యం, ఫైనాన్స్ రంగాల సరళీకరణపై దృష్టి సారించాయి. ఇవన్నీ తన పరిధిలోనివే కాబట్టి, వీటిని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్ర దించాల్సిన అవసరం లేకపోయింది. రెండో తరం సంస్కరణలు అలా కాదు. ఉత్పాదకతను పెంచడానికి అవసరమైన ఈ సంస్కరణలు భూమి, కార్మికులు, పన్నులతో ముడిపడి ఉంటాయి. వీటికి రాష్ట్రాల సమ్మతి మాత్రమే కాదు, అమలులో చురుకైన భాగస్వామ్యం కూడా కావాలి. రాజ్యాంగం ద్వారా మన కోసం మనం చేసిన ప్రతిజ్ఞ నెర వేరాలంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సయోధ్య కీలకం.» వ్యాసకర్త భారత రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్,యేల్ విశ్వవిద్యాలయంలో సీనియర్ ఫెలో(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)» 2000లో చేసిన రాజ్యాంగ సవరణ వల్ల, రెండు (వ్యక్తిగత ఆదాయ పన్ను, ఎక్సయిజ్ సుంకాలు) పన్నుల్లోనే కాకుండాకేంద్రం వసూలు చేసే అన్ని పన్నుల్లో రాష్ట్రాలకు వాటా దక్కింది.» రాజ్యాంగ సవరణ చేసినప్పుడు, కేంద్రం పరిమితంగానే సెస్సులు, సర్‌ఛార్జ్‌లు విధిస్తుందని భావించారు. అందుకు విరు ద్ధంగా జరుగుతోంది. వాటిలో తమకు వాటా రాదు కాబట్టి, ఇది తమను మోసం చేయడమేనని రాష్ట్రాలు బాధపడుతున్నాయి.» 1990ల తొలితరం సంస్కరణలు పెట్టుబడులు, వాణిజ్యం, ఫైనాన్స్ రంగాల సరళీకరణపై దృష్టి సారించాయి. వీటిని ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్రదించాల్సిన అవ సరం లేకపోయింది. కానీ రెండో తరం సంస్కరణలు అలా కాదు. ఇవి భూమి, కార్మికులు, పన్నులతో ముడిపడి ఉంటాయి. వీటికి రాష్ట్రాల సమ్మతే కాదు, వాటి చురుకైన భాగస్వామ్యం కూడా కావాల్సి ఉంటుంది.» వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం తమ ప్రయోజనా లను హరించివేయడానికి తమ మెడలు వంచి మరీ తెచ్చారని రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఇది వాటి హ్రస్వదృష్టి అవుతుంది. -
President Droupadi Murmu: మీరే సంధానకర్తలు
న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గవర్నర్లు అనుసంధానకర్తలుగా వ్యవహరించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. శనివారం ముగిసిన గవర్నర్ల రెండు రోజుల సదస్సులో ఆమె ప్రసంగించారు. శాఖల మధ్య మరింత సమన్వయానికి చర్యలపై సదస్సులో చర్చించినట్టు రాష్ట్రపతి భవన్ పేర్కొంది. మెరుగైన పనితీరుకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాచారాన్ని పొందేందుకు, నిరంతర సంప్రదింపులకు సాగించడంలో గవర్నర్లు సంశయించరాదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సూచించారు. రాజ్భవన్లలో ఆదర్శ పాలనా నమూనాను రూపొందించడానికి గవర్నర్లు కృషి చేయాలని ప్రధాని మోదీ సూచించారు. గవర్నర్లు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, డిజిటైజేషన్‌ను ప్రోత్సహించాలని కోరారు. -
ఢిల్లీ: ముగిసిన గవర్నర్ల సదస్సు
సాక్షి,ఢిల్లీ: రెండు రోజులపాటు జరిగిన గవర్నర్ల సదస్సు శనివారం(ఆగస్టు 3) ముగిసింది. సదస్సులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. కీలక అంశాలపై రెండు రోజులపాటు సదస్సులో చర్చలు కొనసాగాయి. మహిళా సాధికారత, గిరిజనుల అభివృద్ధి సహా పలు అంశాలపై చర్చించారు. నూతన నేర న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, యూనివర్సిటీల అక్రిడేషన్, గిరిజన ప్రాంతాల అభివృద్ధి , వెనుకబడిన జిల్లాలు, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి లో గవర్నర్ల పాత్రపై రాష్ట్రపతి, ప్రధాని దిశానిర్దేశం చేశారు. -
Supreme Court: బిల్లులు ఎందుకు ఆపేశారో చెప్పండి
న్యూఢిల్లీ: కేరళ, పశి్చమ బెంగాల్ శాసనసభల్లో ఆమోదించిన బిల్లులకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు అంగీకారం తెలియజేయకుండా సుదీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టడం పట్ల సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గవర్నర్ల వైఖరిని సవాలు చేస్తూ కేరళ, పశి్చమ బెంగాల్ ప్రభుత్వాలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. కేంద్ర హోం శాఖకు, కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్, బెంగాల్ గవర్నర్ ఆనందబోసు కార్యదర్శులకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. బిల్లులను ఎందుకు పెండింగ్‌లో కొనసాగిస్తున్నారో మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే పిటిషన్లో కేంద్ర హోంశాఖను సైతం ఒక పార్టీగా చేర్చాలని బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది. తమ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్ అంగీకారం తెలియజేయడం లేదంటూ కేరళ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
రామ్‌లల్లా దర్శనానికి మూడు రాష్ట్రాల గవర్నర్లు!
గుజరాత్, సిక్కిం, మేఘాలయ గవర్నర్లు రామ్‌లల్లాను దర్శించుకునేందుకు అయోధ్య చేరుకున్నారు. వారికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్వాగతం పలికింది. ఈ ముగ్గురు గవర్నర్లు వేర్వేరు సమయాల్లో రామ్‌లల్లాను దర్శించుకున్నారు. మేఘాలయ గవర్నర్ ఫాగు చౌహాన్ తమ పూర్వీకుల స్వస్థలమైన అజంగఢ్ నుండి రోడ్డు మార్గంలో ముందుగా అయోధ్య చేరుకున్నారు. అనంతరం రామజన్మభూమిలోని ఆలయంలో కొలువైన రామ్‌లల్లాను దర్శించుకున్నారు. అలాగే సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య విమానాశ్రయం నుంచి నేరుగా సర్క్యూట్ హౌస్‌కు చేరుకున్నారు. అక్కడి భద్రతా సిబ్బంది ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మహర్షి వాల్మీకి అంతర్జాతీయ శ్రీరామ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. తరువాత వారు రామ్‌లల్లాను దర్శించుని పూజలు చేశారు. సర్క్యూట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడిన సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య రామ్‌లల్లాను చూశాక ఎంతో ఆనందం కలిగిందన్నారు. -
ప్రతీకారం స్పష్టంగా కనిపిస్తోంది.. మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ల తీరుపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాజ్యాంగ పదవులు కేంద్రం చేతిలో రాజకీయ సాధనాలుగా మారాయంటూ తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేటీఆర్ తన ట్వీట్లో ప్రస్తావించారు. బీజేపీయేతర రాష్ట్రాలను చూస్తే కేంద్రం సహాయ నిరాకరణ, ప్రతీకారం స్పష్టంగా కనిపిస్తుందని ఆయన విమర్శించారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాల నేపథ్యంలో చాలాకాలం నుంచి రాజ్‌భవన్‌లో పెండింగ్ పడిన బిల్లుల వ్యవహారంలో కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. మూడు సాధారణ బిల్లులపై ఆమోదముద్ర వేశారు. కీలకమైన యూనివర్సిటీల నియామక బోర్డు, అటవీ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన రెండు బిల్లులను రాష్ట్రపతికి నివేదించడం కోసం నిలిపివేశారు. మరో రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోసం తిప్పిపంపారు. మరింత పరిశీలన అవసరమంటూ ఇంకో రెండు బిల్లులను రాజ్‌భవన్‌లోనే అట్టిపెట్టుకున్నారు. మొత్తంగా గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఇటీవలి వరకు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పది బిల్లులకు సంబంధించి.. రాజ్‌భవన్ ఇచ్చిన వివరాలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సోమవారం సుప్రీంకోర్టుకు అందజేశారు. మరోవైపు, చట్టసభల్లో ఆమోదించిన బిల్లులు, తీర్మానాలపై ఆమోదముద్ర వేసేందుకు గవర్నర్‌కు కాల పరిమితి నిర్ణయించాలని రాష్ట్రపతిని, కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ సోమవారం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. డీఎంకే ప్రభుత్వం, గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య తరచూ విభేదాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. చదవండి: తమిళనాట హైలైట్ ట్విస్ట్.. స్టాలిన్ దెబ్బకు దిగివచ్చిన గవర్నర్ Sad state of affairs where top constitutional posts have become political tools in the hands of Union Govt Have a look at all Non-BJP Governed states; you will see a similar clear pattern of Non-Cooperation & vengefulness Is this the Cooperative Federalism model and Team India… https://t.co/kHtvnCjGKm — KTR (@KTRBRS) April 11, 2023 -
గవర్నర్లకు నోరు తప్ప చెవుల్లేవు : స్టాలిన్
చెన్నై: గవర్నర్ల వ్యవహార శైలిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లకి మాట్లాడడానికి నోరు ఉందే తప్ప వినడానికి చెవుల్లేవని వ్యంగ్యస్త్రాలు విసిరారు. అందుకే గవర్నర్లందరూ ఎక్కువగా మాట్లాడుతూ తక్కువగా వింటున్నారని వ్యాఖ్యానించారు. ఆన్లైన్లో జూదం నిరోధక బిల్లుని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వెనక్కి తిప్పి పంపిన నేపథ్యంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉంగలిల్ ఒరువన్ అనే కార్యక్రమంలో గురువారం పాల్గొన్న స్టాలిన్ ప్రజలు వేసే ప్రశ్నలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాధానాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో గవర్నర్లు జోక్యం చేసుకోకూడదని ఇటీవల సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలకు గవర్నర్లు కట్టుబడి ఉన్నారా? అని ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రశ్నకు స్టాలిన్ స్పందిస్తూ కొందరు గవర్నర్ల వ్యవహార శైలి చూస్తుంటే వారికి నోరు ఉందే తప్ప చెవులు లేవని అనిపిస్తోందని అన్నారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో మనీశ్ సిసోడియా అరెస్ట్‌ను ఆయన ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీలను బీజేపీ బహిరంగంగానే ఎలా హెచ్చరిస్తుందో సిసోడియా అరెస్ట్ నిలువెత్తు నిదర్శనమని అన్నారు. రాజకీయ కారణాల కోసం దర్యాప్తు సంస్థల్ని బీజేపీ వాడుకుంటోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై ఎన్నికల్లో గెలవడానికి బదులుగా, దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించి విజయం సాధించాలని చూడడమేంటని ప్రధాని మోదీకి లేఖ రాసినట్టుగా స్టాలిన్ వెల్లడించారు. -
ఆయా రాష్ట్రాలకు కొత్త ఇంచార్జులను.. సారీ.. గవర్నర్లను నియమించడం జరిగింది!
ఆయా రాష్ట్రాలకు కొత్త ఇంచార్జులను.. సారీ.. గవర్నర్లను నియమించడం జరిగింది! -
వివాదంలో.. గవర్నర్ గిరీ..! న్యాయ నిపుణులు చెప్తున్నదేంటి?
కె.శ్రీకాంత్‌రావు, సాక్షి ప్రత్యేక ప్రతినిధి దేశంలో గవర్నర్ల వ్యవస్థ వివాదాస్పదం అవుతోంది. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోని వ్యక్తులను గవర్నర్లుగా నియమిస్తుండటంతో.. వారు తమ పూర్వాశ్రమ వాసనలు వదిలిపెట్టలేక పోతున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాలనా వ్యవహారాల్లో తలదూరుస్తుండటంతో గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమ నాయకులను గవర్నర్లుగా నియమిస్తుండటం, తద్వారా రాష్ట్రాలపై పెత్తనం ఉండేలా చూసుకోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలోని ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం ఏవీ కూడా దీనికి అతీతం కాదు. మరీ గతంలో మాదిరిగా గవర్నర్లు ఆర్టికల్ 356ను వినియోగించి ప్రభుత్వాలను రద్దు చేయకున్నా.. అడ్డంకులు సృష్టించడం, బహిరంగంగా ప్రభుత్వ విధానంపై వ్యాఖ్యానాలు చేయడం జరుగుతోంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా తాత్సారం చేయడమూ కనిపిస్తోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు గవర్నర్లు తమకు లేని అధికారాన్ని పాలనలో చూపించాలని యత్నించినప్పుడు వివాదాలు వస్తున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల నిర్ణయాలను గవర్నర్లు విచక్షణాధికారం పేరిట మోకాలడ్డుతుండటంతో అసలు గవర్నర్ల వ్యవస్థపైనే విమర్శలు వస్తున్నాయి. గవర్నర్ల వ్యవస్థ హద్దులు దాటనంత వరకు మంచిదేనని, రాజ్యాంగ పరిరక్షణకు వారు పరిమితమైతే మంచిదని న్యాయ నిపుణులు అంటున్నారు. గవర్నర్ల మితిమీరిన జోక్యమే ఆ వ్యవస్థ నష్టమని ప్రతిపక్షాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. గవర్నర్లను నియమించే వ్యవస్థలో పారదర్శకత కోసం ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఎంపిక కమిటీ ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాలూ ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, గవర్నర్ల వ్యవస్థకు సంబంధించి సర్కారియా కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేస్తే ప్రయోజనం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎప్పటి నుంచో వివాదాలు 1984లో నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను గవర్నర్ రామ్‌లాల్ అనైతికంగా పదవీచ్యుతుడిని చేసి నాదెండ్ల భాస్కర్‌రావును సీఎంగా చేసిన సందర్భంలో గవర్నర్ల వ్యవహారశైలిపై తీవ్ర దుమారం చెలరేగింది. అప్పట్లో పెద్దఎత్తున జరిగిన ఆందోళనతో దిగివచ్చిన కేంద్రం తిరిగి ఎన్టీఆర్‌ను సీఎంగా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా గవర్నర్ల వ్యవస్థపై రద్దు కోసం పోరాటం చేశారు. 2013లో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ కూడా ఆ రాష్ట్ర గవర్నర్‌ను రీకాల్ చేయాలని, ఢిల్లీ సుల్తాన్ల మనిషిగా గవర్నర్ ఇక్కడ ఉన్నారని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లపాటు ఖాళీగా ఉన్న గుజరాత్ లోకాయుక్తను అప్పటి గవర్నర్ కమలా బెనీవాల్ నియమించడంతో వివాదం రేగింది. దానితో ఆగ్రహించిన మోదీ.. లోకాయుక్త నియామకంలో గవర్నర్ పాత్ర లేకుండా ముఖ్యమంత్రి, మంత్రివర్గమే తుది నిర్ణయం తీసుకునేలా బిల్లు పాస్ చేయించారు. ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్ ఏ నిర్ణయమైనా ముఖ్యమంత్రి, మంత్రివర్గం చేసిన సలహా మేరకే తీసుకోవాలని స్పష్టం చేశారు. గవర్నర్లు ఆనవాయితీ పాటిస్తేనే మంచిది రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన అధికార కేంద్రాలు రెండు ఉండవు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే పూర్తి అధికారం. గవర్నర్‌ది రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత మాత్రమే. దానిని అర్థం చేసుకొని మెలగాలి. గవర్నర్ ప్రమాణ స్వీకార ప్రతిజ్ఞకు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ప్రతిజ్ఞకు మధ్య తేడాను గుర్తించాలి. రాజ్యాంగాన్ని, న్యాయాన్ని ప్రిజర్వింగ్, డిఫెండింగ్, ప్రొటెక్టింగ్ అన్నది మాత్రమే గవర్నర్ విధి. ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే సలహాలు ఇచ్చి సరిచేయాలి. ఏవైనా అనుమానాలుంటే ముఖ్యమంత్రిని పిలిచి క్లోజ్డ్ డోర్లో నివృత్తి చేసుకోవాలి. అనుమానాలను నివృత్తి చేయడం ముఖ్యమంత్రి బాధ్యత కూడా. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు హద్దులు దాటుతున్నారు. ఇది మంచి పరిణామం కాదు. పాలనాపరంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా మంత్రి వర్గమే అసెంబ్లీకి, ప్రజలకు జవాబుదారీ. గవర్నర్‌కు ఎలాంటి జవాబుదారీతనం లేదు. ఇటీవలికాలంలో ప్రభుత్వాలకు, గవర్నర్ వ్యవస్థకు మధ్య జరుగుతున్న వివాదాలు చూస్తుంటే.. రెండువైపులా పెద్దరికం అనేది లేకుండా పోయింది. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై గవర్నర్లు బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయడం సరికాదు. రాజ్యాంగం, సంప్రదాయాలు, ఆనవాయితీలను ఇరువైపులా పాటిస్తే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. – సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి బిల్లులు ఆపడం సరికాదు రాజ్యాంగ బద్ధమైన ఒకటి రెండు అంశాల్లో తప్ప రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. కేబినెట్ ఆమోదం తెలిపిన బిల్లులను ఆపడం, మంత్రులను పిలిచి వివరణ కోరడం సరికాదు. అసెంబ్లీ ప్రొరోగ్ అనేది స్పీకర్‌కు సంబంధించిన అంశం. గవర్నర్లు సమస్యలపై ప్రభుత్వం నుంచి నివేదిక కోరవచ్చు. అధికారులను అడిగి తెలుసుకోవచ్చు. కానీ నేరుగా అధికారులకే ఆదేశాలు జారీ చేయకూడదు. ఇది సమాంతర ప్రభుత్వాన్ని నడిపినట్లే అవుతుంది. – కె.రామకృష్ణారెడ్డి, హైకోర్టు సీనియర్ న్యాయవాది గవర్నర్ కేబినెట్ నిర్ణయాల మేరకే నడుచుకోవాలి ప్రజాస్వామ్యంలో పరిపాలనకు సంబంధించి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే తుది నిర్ణయం. కేబినెట్ నిర్ణయాలను ఆపడానికి, రద్దు చేయడానికి గవర్నర్‌కు అధికారం లేదు. నేరుగా పాలనలో కలగజేసుకోకూడదు. సభ జరగనప్పుడు మాత్రమే కొన్ని నిర్ణయాలను తీసుకోవచ్చు. అదీ అప్పుడున్న కేబినెట్ అనుమతితోనే తీసుకోవాలి. గతంలో ఏర్పాటైన ఓ కమిషన్ కూడా తన నివేదికలో ఇదే అంశాన్ని చెప్పింది. ఇక అసెంబ్లీని ప్రోరోగ్ చేయకుండా నడపడం అనేది స్పీకర్‌కు సంబంధించిన అంశం. అందులోనూ గవర్నర్ పాత్ర ఉండదు. – సత్యప్రసాద్, హైకోర్టు సీనియర్ న్యాయవాది తాజా సంఘటనలకు వస్తే.. ►కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లను మూకుమ్మడిగా తొలగించడం ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌కు ఆగ్రహం తెప్పించింది. గవర్నర్‌కు వర్సిటీల చాన్సలర్ హోదాను తొలగిస్తూ మంత్రివర్గం ఆర్డినెన్స్‌ను ఆమోదించి గవర్నర్‌కు పంపింది. చిత్రమేమిటంటే ఆర్డినెన్స్‌పై గవర్నర్ సంతకం చేస్తే తప్ప అది అమల్లోకి రాదు. తనను తాను చాన్స్‌లర్ పదవి నుంచి తొలగించుకోవడం ఇష్టం లేని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ దానిని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఆ రాష్ట్రంలో తరచూ గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య ఏదో ఒక అంశంపై వివాదం రగులుతూనే ఉంది. ►పశ్చిమబెంగాల్లో కొంతకాలం కిందటి వరకు మమత సర్కారుకు, నాటి గవర్నర్ జగదీప్ ధన్కర్కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే సాగింది. బహిరంగంగానే విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగింది. ►తమిళనాడు విషయానికి వస్తే.. అక్కడి శాసనసభ ‘నీట్’ నుంచి తమ రాష్ట్ర విద్యార్థులకు మినహాయింపు ఇవ్వాలంటూ బిల్లును పాస్ చేసింది. దానిని రాష్ట్రపతికి పంపకుండా గవర్నర్ ఆర్ఎన్ రవి ఆపి.. తిరిగి శాసనసభకు పంపారు. దీనిపై ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గవర్నర్ సనాతన ధర్మాన్ని పొగడటంపైనా స్టాలిన్, డీఎంకే పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయనను తక్షణమే రీకాల్ చేయాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు. స్టాలిన్‌కు, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ►తెలంగాణలో రాజ్‌భవన్‌కు, ప్రగతిభవన్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించకుండా గవర్నర్ తమిళిసై ఆపడంతో మొదలైన వివాదం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదని గవర్నర్ చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. గణతంత్ర వేడుకల సమయంలో రాజ్‌భవన్‌కు సీఎం, మంత్రులు రాకపోవడం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా చేయడం, అసెంబ్లీ ప్రోరోగ్ చేయకుండా కొనసాగించడం వంటివాటితో వివాదాలు కొనసాగాయి. గత వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ఆమోదిస్తే.. అందులో ఒక్క జీఎస్టీ బిల్లు మినహా మిగతా ఏడు బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియమకాలకు సంబంధించి ‘తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బిల్లు’పై గవర్నర్ అనుమానాలు వ్యక్తం చేయడంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు వెళ్లి వివరణ ఇచ్చారు. ఆ బిల్లుకు ఇంకా ఆమోదం తెలపలేదు. గవర్నర్ విలేకరుల సమావేశంలోనే ప్రగతిభవన్ (సీఎం) గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ►మహారాష్ట్రలో మహావికాస్ అగాడి (ఎంవీఏ) కూటమి అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీతో విభేదాలు కొనసాగాయి. ఆయన మంత్రివర్గం సిఫార్సు చేసిన అంశాలను ఆమోదించకుండా విచక్షణాధికారం పేరిట కాలయాపన చేశారు. ఏ సభలోనూ సభ్యుడు కాని ఉద్ధవ్‌ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనమండలికి నామినేట్ చేయాలని మంత్రివర్గం సిఫార్సు చేసింది. కానీ దీనిని నాలుగు నెలల పాటు ఆమోదించకుండా వివాదం రేపారు. -
మ్యాగజైన్ స్టోరీ : గవర్నర్స్ " వర్సెస్ " గవర్నమెంట్
-
Bharat Jodo Yatra: బీజేపీయేతర ప్రభుత్వాలపై గవర్నర్లను ప్రయోగిస్తోంది
మలప్పురం/గుడలూర్: ‘‘బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను గద్దెదించేందుకు కేంద్రం గవర్నర్లను వాడుకుంటోంది. గవర్నర్లను ప్రజలెన్నుకున్నారా? వారి పెత్తనమేమిటి?’’అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన భారత్ జోడో యాత్ర గురువారం మళ్లీ తమిళనాడులోని నీలగిరి జిల్లా అడుగుపెట్టింది. బీజేపీ ఒకే జాతి, ఒకటే భాష ఎజెండాను అమలు చేస్తోందని ఆరోపించారు. భాషలు, సంస్కృతులు, మతాలను గౌరవించుకోవాలన్నారు. మోకాలి నొప్పి కొద్దిగా ఇబ్బంది పెడుతోందని రాహుల్ చెప్పారు. అయినా ప్రజలతో మాట్లాడుతూ ముందుకు సాగుతుంటే ఆ బాధ తెలియడం లేదని అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వీడియోను విడుదల చేసింది. శుక్రవారం ఆయన యాత్ర చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట్ వద్ద కర్ణాటకలో అడుగుపెట్టనుంది. -
ప్రభుత్వాలకు మీరు మార్గదర్శకులు
న్యూఢిల్లీ: రాష్ట్రాల గవర్నర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మిత్రులుగా, మార్గదర్శకులుగా వ్యవహరించాలని మన దేశ రాజ్యాంగ రూపకర్తలు భావించారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. రాష్ట్రాల అభ్యున్నతి కోసం గవర్నర్లు సాధ్యమైనంత ఎక్కువ సమయం కేటాయించాలని, ప్రజలతో మమేకం కావాలన్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో గురువారం రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ల 51వ సదస్సులో రాష్ట్రపతి మాట్లాడారు. ప్రజా సంక్షేమానికి, వారి సేవ కోసం కట్టుబడి ఉండాలన్న విషయాన్ని సదా గుర్తుంచుకోవాలని ఉద్బోధించారు. ప్రజల్లో చైతన్యం పెంచడంలో, జాతీయ లక్ష్యాలను సాధించేగా దిశగా వారికి స్ఫూర్తినివ్వడంలో గవర్నర్ల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. గవర్నర్లు జిల్లాలకు వెళ్లాలని, జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలను సందర్శించాలని రాష్ట్రపతి చెప్పారు. ప్రజల సహకారంతో బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలని గవర్నర్లను కోరారు. కరోనాపై పోరాటంలో చురుకైన పాత్ర ప్రధాని మోదీ నాయకత్వంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా భారత్ చిరస్మరణీయ పోరాటం సాగించిందని, ఇందులో గవర్నర్లు తమ వంతు సహకారం అందించారని కోవింద్ ప్రశంసించారు. ఈ పోరాటంలో వారు చురుగ్గా వ్యవహరించారని కొనియాడారు. దేశంలో కరోనా ఉధృతి సమయంలో వైద్యులు, ఫ్రంట్‌లైన్ కార్మికులంతా అసాధారణ త్యాగం, అంకితభావంతో విధులు నిర్వర్తించారని గుర్తుచేశారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గవర్నర్ల సదస్సు దాదాపు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. తొలి సదస్సు 1949లో రాష్ట్రపతి భవన్లో జరిగింది. పథకాల అమలును పర్యవేక్షించాలి: వెంకయ్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. గవర్నర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. జాతి నిర్మాణ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని చెప్పారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటి అమలులో గవర్నర్ల పాత్ర కీలకమని తెలిపారు. గవర్నర్ పదవిని కేవలం ఒక రాజ్యాంగబద్ధమైన పదవిగా భావించకూడదని, రాష్ట్రానికి తొలి పౌరుడిగా ప్రజలకు సేవ చేయాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు సంస్కృతిని కాపాడడానికి తోడ్పాటునందించాలని గవర్నర్లకు వెంకయ్య పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వారధి: మోదీ గవర్నర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా వ్యవహరిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గవర్నర్లు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు. గవర్నర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల సందర్శనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పొరుగు రాష్ట్రాల గవర్నర్లతోనూ తరచుగా భేటీ కావాలని, దానివల్ల ప్రజల సమస్యలు తెలుస్తాయని వెల్లడించారు. రాష్ట్రాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారులతోనూ మాట్లాడుతూ ఉండాలని మోదీ వివరించారు. అన్ని రాష్ట్రాల గవర్నర్ల మధ్య అనుసంధానం కోసం ఓ సంస్థాగత యంత్రాంగం ఉండాలన్నారు. ఒక రాష్ట్రంలో గవర్నర్ అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఇతర రాష్ట్రాల గవర్నర్లు సైతం అందిపుచ్చుకోవాలని కోరారు. -
రాష్ట్రపతి భవన్ లో గవర్నర్ల సదస్సు
-
పలు రాష్ట్రాల గవర్నర్ల మార్పు
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాల గవర్నర్లను మార్చడంతో పాటు ఉత్తరాఖండ్‌కు రాష్ట్రపతి కొత్త గవర్నర్‌ను నియమించారు. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్న బన్వరిలాల్ పురోహిత్‌ను పంజాబ్ గవర్నర్‌గా నియమించారు. ఇప్పటివరకు ఆయన పంజాబ్ గవర్నర్ బాధ్యతలు అదనంగా పర్యవేక్షిస్తున్నారు. నాగాలాండ్ గవర్నర్‌గా ఉన్న మాజీ ఐపీఎస్ ఆర్ఎన్ రవిని తమిళనాడు గవర్నర్‌గా నియమించారు. అసోం గవర్నర్ జగదీశ్ ముఖికి నాగాలాండ్ బాధ్యతలు అదనంగా అప్పగించారు. ఇటీవలే ఉత్తరాఖండ్ గవర్నర్‌గా ఉన్న మౌర్య రాజీనామా చేయడంతో ఆ స్థానంలో రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ గురి్మత్ సింగ్‌ను నియమించారు. 2016లో సింగ్ ఆర్మీ నుంచి రిటైరయ్యారు. చైనాతో మిలటరీ వ్యవహారాల్లో ఆయన అనుభవజ్ఞుడు. -
అది దేశ విద్యా విధానం
న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) కేవలం ప్రభుత్వ విధానం కాదని.. అది మొత్తంగా భారత దేశ విద్యా విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం కూడా దేశ విదేశాంగ, రక్షణ విధానాలతో సమానమైన ప్రాముఖ్యత కలిగినదన్నారు. నూతన జాతీయ విద్యా విధానం అమలులో సాధ్యమైనంతగా మార్పుచేర్పులకు వీలు కల్పించాలని, ఈ విద్యా విధానానికి సంబంధించిన అన్ని అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ‘రోల్ ఆఫ్ ఎన్ఈపీ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్’అనే అంశంపై సోమవారం జరిగిన గవర్నర్ల సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ విద్యా విధానంపై సంబంధిత వర్గాలకు అనేక అనుమానాలు, ప్రశ్నలు ఉండటం సహజమేనని ప్రధాని పేర్కొన్నారు. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలిచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ‘విద్యా విధానంలో భాగమైన ప్రతీ వ్యక్తి అభిప్రాయాలను గౌరవిస్తాం. ప్రశ్నలకు జవాబిస్తాం. అనుమానాలను నివృత్తి చేస్తాం’అని స్పష్టం చేశారు. చాలా ప్రశ్నలు ఎన్ఈపీ అమలుకు సంబంధించే ఉన్నాయన్నారు. దేశ విద్యా విధానం ఆ దేశ ఆకాంక్షలను ప్రతిఫలిస్తుందని అభివర్ణించారు. ఈ విద్యా విధానాన్ని రూపొందించిన తీరు తరహాగానే.. అమలులోనూ సాధ్యమైనంత సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించాలని సూచించారు. సదస్సులో రాష్ట్రాల గవర్నర్లతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రాల విద్యా శాఖల మంత్రులు, వర్సిటీల వైస్ చాన్సెలర్లు పాల్గొన్నారు. ఎన్ఈపీ–2020పై సెప్టెంబర్ 25 లోపు యూనివర్సిటీల్లో వర్చువల్ సదస్సులు నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రధాని కోరారు. నూతన విద్యా విధానాన్ని పాఠశాల ఉపాధ్యాయుల నుంచి, ప్రఖ్యాత విద్యావేత్తల వరకు అంతా స్వాగతిస్తున్నారని గుర్తు చేశారు. అకడమిక్, వొకేషనల్, టెక్నికల్ సహా అన్ని అంశాలను, అలాగే, పాలనాపరమైన అనవసర జాప్యాలను నివారించే చర్యలను కూడా నూతన ఎన్ఈపీలో సమగ్రంగా పొందుపర్చారన్నారు. కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు దశలవారీగా స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాలనే ఆలోచన వెనుక.. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించాలి, సమర్థ్ధతకు పట్టం కట్టాలనే ఉద్దేశం ఉందని ప్రధాని మోదీ వివరించారు. ‘ఈ స్ఫూర్తిని విజయవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది’అన్నారు. చదవడం కన్నా నేర్చుకోవడంపై, విశ్లేషణాత్మక ఆలోచనాధోరణిని పెంపొందించుకోవడంపై ఈ నూతన విద్యా విధానంలో ప్రధానంగా దృష్టి పెట్టారన్నారు. విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న పుస్తకాలు, సిలబస్, పరీక్షల ఒత్తిడి భారాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు ఈ విధానంలో ఉన్నాయన్నారు. చిన్న క్లాసుల నుంచే వృత్తి విద్యకు, శిక్షణకు ప్రాధాన్యతనిచ్చి, వారిని దేశీయ, అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌కు సిద్ధ్దం చేయడం లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారని పేర్కొన్నారు. ‘స్వావలంబ భారత్’లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా ఈ నూతన ఎన్ఈపీ రూపొందిందన్నారు. గతంలో విద్యార్థులు తమకు ఆసక్తి లేని అంశాలను బలవంతంగా నేర్చుకోవాల్సి వచ్చేదని, నూతన విద్యా విధానంలో ఆ సమస్యకు పరిష్కారం చూపామని వివరించారు. 21వ శతాబ్దపు నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా భారత్‌ను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నూతన విద్యా విధాన స్థూల రూపకల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా జోక్యం చేసుకోలేదన్నారు. విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలకు ఈ విధానంలో సముచిత ప్రాధాన్యతనిచ్చారన్నారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన వర్సిటీలు భారత్‌లో తమ కేంద్రాలను ప్రారంభించేలా నూతన విధానంలో అవకాశం కల్పించామన్నారు. దీనివల్ల మేధో వలస సమస్య కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. ‘పరిశోధన’కు నిధులు పెంచాలి పరిశోధన, అభివృద్ధి’పై ప్రభుత్వ నిధులను భారీగా పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారు. ఇతర దేశాలతో పోలిస్తే...భారత్ ఈ రంగంలో అతి తక్కువ నిధులను కేటాయిస్తోందన్నారు. పరిశోధన, సృజనాత్మక ఆవిష్కరణలపై భారీగా పెట్టుబడులు పెట్టడం భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థకు అత్యావశ్యకమన్నారు. నూతన విద్యా విధానంపై సోమవారం వర్చువల్‌గా జరిగిన గవర్నర్ల సదస్సునుద్దేశించి ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ‘రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్’కు జీడీపీలో అమెరికా 2.8%, దక్షిణ కొరియా 4.2%, ఇజ్రాయెల్ 4.3% నిధులను కేటాయిస్తుండగా, భారత్ మాత్రం జీడీపీలో 0.7% నిధులను మాత్రమే కేటాయిస్తోందన్నారు. -
గవర్నర్ గిరి..ఐపీఎస్‌లపై గురి!
సాక్షి, హైదరాబాద్: త్వరలో పలు రాష్ట్రాల గవర్నర్ల పదవీ కాలం ముగిసిపోనున్న నేపథ్యంలో సమర్థమైన వారి కోసం కేంద్రం అన్వేషణ మొదలుపెట్టింది. రాజకీయ నాయకులతో పాటు ఐపీఎస్ అధికారులను ఈసారి గవర్నర్లుగా నియమించాలని భావిస్తోంది. ఇందుకోసం సరైన ఐపీఎస్ అధికారుల వేట మొదలుపెట్టింది. సాధారణంగా గవర్నర్ పోస్టులో రాజకీయ నాయకులే ఉంటారు. సీనియర్లు, పరిపాలనలో సమర్థులుగా పేరున్న వారిని వారిని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గవర్నర్లుగా నియమించడం పరిపాటే. అయితే అప్పుడప్పుడూ సివిల్ సర్వీసెస్ అధికారులను కూడా నియమిస్తూ ఉంటారు. సీనియర్ అధికారులైన ఈఎస్ఎల్ నరసింహన్ (ఏపీ), కిరణ్‌బేడీ (పుదుచ్చేరి), పీఎస్ రామ్మోహన్రావు (తమిళనాడు) గవర్నర్లుగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇటీవలే భేటీ.. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దక్షిణాది నుంచి ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను గవర్నర్లుగా నియమించాలని కేంద్రంలోని ఓ కీలక నేత ప్రయత్నాలు చేస్తున్నారు. పనిపై నిబద్ధత, విధి నిర్వహణలో సమర్థులు, ట్రబుల్ షూటర్లు అని ఆ ఇద్దరు అధికారులకు ఉన్న రికార్డే ఇందుకు కారణం. అందులో భాగంగా తెలంగాణకు చెందిన ఓ ఐపీఎస్ అధికారితో ఆ సీనియర్ నేత ఇటీవల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ పదవిని చేపట్టే విషయమై ఆయన అభిప్రాయం అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఊహించని ఈ ఆఫర్‌కు అవాక్కయిన ఆ అధికారి.. తొలుత నమ్మలేదు. కానీ, సీరియస్‌గా అడిగేసరికి.. తాను ఎటూ తేల్చుకోలేకపోతున్నానని, ఆలోచించుకునేందుకు కాస్త సమయం కావాలని కోరినట్లు తెలిసింది. ఐపీఎస్‌లే ఎందుకు? రాజకీయ సంక్షోభం, సరిహద్దు, తీవ్రవాదం, ఉగ్రవాదం, తిరుగుబాటు తదితర జఠిల సమస్యలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లుగా ఐపీఎస్‌లు రాణించేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నా యి. పరిపాలనాపరంగా ఉన్న అనుభవం, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడని మనస్తత్వం, క్లిష్ట పరిస్థితుల్లో పరిస్థితులను చేయిదాటకుండా సమన్వయం చేసుకోవడంలో వీరికి అపార అనుభవం ఉంటుంది. అందుకే ఐపీఎస్‌లను కేంద్ర ప్రభుత్వా లు గవర్నర్లుగా నియమిస్తుంటాయి. వామపక్ష తీవ్రవాదం ఉచ్ఛస్థితిలో ఉన్న 2007లో జార్ఖండ్ గవర్నర్‌గా ఐపీఎస్ అధికారి ఈఎస్ఎల్ నరసింహన్‌ను అప్పటి యూపీఏ ప్రభుత్వం పంపింది. ఆయన గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించాక అన్ని విధాలా సఫలీకృతమయ్యారు. అదే సమయంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటంతో ఆయనకు ఉమ్మడి ఏపీ బాధ్యతలను కూడా అప్పగించారు. 2014లో రాష్ట్ర విభజన నుంచి 2019 సెప్టెంబర్ వరకు ఏపీ, తెలంగాణలకు ఆయనే గవర్నర్‌గా విజయవంతంగా విధులు నిర్వహించారు. మరోవైపు కిరణ్‌బేడీ ప్రస్తుతం పుదుచ్చేరి గవర్నర్‌గా కొనసాగుతున్నారు. వీరిద్దరి కంటే ముందే.. 2002లో ఉమ్మడి ఏపీ నుంచి సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పీఎస్ రామ్మోహన్రావు తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది ఐపీఎస్ ఆఫీసర్లు దేశంలోని వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా పనిచేశారు. -
గవర్నర్లు.. కింగ్మేకర్లు!
సాక్షి, ముంబై: దేశంలో గత మూడేళ్లలో అయిదు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్లు పోషించిన పాత్ర వివాదాస్పదం అయింది. ఈ రాష్ట్రాల్లో గవర్నర్లు బీజేపీ కోసం గేమ్ చేంజర్లుగా మారారు. 2017లో... గోవాలో 2017 ఎన్నికల్లో అసెంబ్లీలోని 40 స్థానాలకు 18 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించింది. కానీ, గవర్నరు మృదులా సిన్హా ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీకే అవకాశమిచ్చారు. ఈ విషయంపై కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దీంతో గవర్నర్ పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతోపాటు, 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో 28 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీజేపీ 21 చోట్ల మాత్రమే విజయం సాధించింది. అయినప్పటికీ, గవర్నర్ కాంగ్రెస్‌ను కాదని, బీజేపీకి చాన్సివ్వడంతో కమలదళం ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. 2018లో... కర్ణాటకలో 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం గవర్నర్ వజూభాయ్ వాలా అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానించారు. అయితే, బలపరీక్షలో బీజేపీ ఓడిపోయింది. సీఎం యడియూరప్పరాజీనామా చేయడంతో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి అధికారంలోకి వచ్చింది. అనంతర పరిణామాల్లో అధికార కూటమిలోని 17 మంది ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించారు. ఆపై మళ్లీ యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్– జేడీఎస్ వాదనలను గవర్నర్ వినిపించుకోలేదన్న ఆరోపణలున్నాయి. మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 సీట్లకు గాను 21 స్థానాలతో కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించింది. గవర్నర్ మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీని, దాని మిత్రపక్షం 19 సభ్యులున్న ఎన్పీపీని ఆహ్వానించడం వివాదాస్పదమైంది. -
గవర్నర్ చర్యలకు రాజ్యాంగ రక్షణ ఉందా?
న్యూఢిల్లీ: రాజ్యాంగం ఆర్టికల్ 361 ద్వారా రాష్ట్రపతి, గవర్నర్లకు రక్షణ కల్పించింది. తమ అధికారాలు, విధుల నిర్వహణలో రాష్ట్రపతి, గవర్నర్లు తీసుకునే నిర్ణయాలు, చర్యలను ప్రశ్నించే అధికారం ఏ న్యాయస్థానానికీ లేదని ఆర్టికల్ 361(1) చెబుతోంది. అయితే, ఆర్టికల్ 361 నిబంధనల మేరకు రాష్ట్రపతి, గవర్నర్ల చర్యలకు మినహాయింపులున్నప్పటికీ.. వారి చర్యలు దురుద్దేశపూరితంగా, ఏకపక్షంగా, అసంబద్ధంగా ఉన్నాయని భావించిన పక్షంలో జోక్యం చేసుకోవచ్చని గతంలో పలు సంద ర్భాల్లో కోర్టులు తీర్పులు చెప్పాయి. 2006లో సుప్రీంకోర్టు ఈ మేరకు స్పష్టం చేసింది. ఎస్ఆర్ బొమ్మై కేసు ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మైకు అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం ఇవ్వకుండా 1989లో అప్పటి కర్ణాటక గవర్నర్ పి.వెంకటసుబ్బయ్య ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అధికార పార్టీలోని పలువురు నేతలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడటంతో బొమ్మై మెజారిటీ కోల్పోయారని భావించినట్లు గవర్నర్ కారణంగా చూపారు. అనంతరం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గవర్నర్ నిర్ణయం చెల్లదంటూ 1994లో కీలక తీర్పు వెలువరిం చింది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసేందుకు రాష్ట్రపతికి తిరుగులేని అధికారాలు మాత్రం లేవని స్పష్టం చేసింది. అవసరమైన పరిస్థితుల్లో మాత్రమే ఆయన అసెంబ్లీని రద్దు చేయాలని తెలిపింది. 2018నాటి కర్ణాటక పరిణామాలు 2018 ఎన్నికల్లో కర్ణాటక అసెంబ్లీలోని 225 సీట్లకు గాను బీజేపీ 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో గవర్నర్ వజూభాయ్ ఆహ్వానం మేరకు యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేడీఎస్‌ల కూటమి తమకు మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని చెప్పినా గవర్నర్ పట్టించుకోలేదు. దీంతో ఈ రెండు పార్టీలు అర్ధరాత్రి సమయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తక్షణమే విచారణ జరిపిన కోర్టు.. గవర్నర్‌కు యడియూరప్ప సమర్పించిన లేఖను తమకు అందజేయాల్సిందిగా ఆదేశించింది. కానీ, యడ్యూరప్పకు కేవలం మెజారిటీ సభ్యుల మద్దతుందని మాత్రమే ఆ లేఖలో ఉంది. మద్దతు పలికే ఎమ్మెల్యేల పేర్లు లేవు. దీంతో అత్యున్నత న్యాయస్థానం.. గవర్నర్ ఇచ్చిన 15 రోజుల గడువుకు బదులుగా మరుసటి రోజే శాసనసభలో బల పరీక్ష జరపాలని యడియూరప్పను ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. -
మైనారిటీల అభ్యున్నతికి కృషి చేయండి
న్యూఢిల్లీ: రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని, సమాజంలో వెనుకబడ్డ తరగతులు, మైనార్టీల అభ్యున్నతికి కృషి చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. శనివారం ఢిల్లీలో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సదస్సుల్లో మోదీ మాట్లాడారు. ఆరోగ్య, విద్య, పర్యాటక రంగాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవడం ద్వారా పేద, అణగారిన వర్గాల స్థితిగతులను మెరుగుపరచడంతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చునని ప్రధాని తెలిపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం శనివారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది. రాజ్యాంగ విధులు నిర్వర్తించే గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు సామాన్యుల సమస్యలను పట్టించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూ షెడ్యూల్డ్ తెగలు, మైనార్టీ, మహిళ, యువజన వర్గాలకు ప్రభుత్వ పథకాల లబ్ది అందేలా చూడాలని కోరారు. పరస్పర సహకారం, పోటీతత్వంతో కూడిన సమాఖ్య వ్యవస్థ సాకారానికి గవర్నర్ల వ్యవస్థ ఎంతో కీలకమైందని ప్రధాని పేర్కొన్నారు. ‘భారత రాజ్యాంగ రచన 70 ఏళ్ల వేడుకలు జరుపుకుంటున్న ఈ తరుణంలో గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాలు పౌరుల విధులు, బాధ్యతలపై అవగాహన పెంచేందుకు కలిసి పనిచేయాలి’ అన్నారు. ఢిల్లీలో జరిగిన 50వ గవర్నర్ల వార్షిక సమావేశంలో తొలిసారి గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లుగా నియమితులైన 17 మంది పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణే కాదు!రాష్ట్రపతి గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల పాత్ర కేవలం రాజ్యాంగ పరిరక్షణకు మాత్రమే పరిమితం కారాదని, ప్రజా జీవితంలో వీరికున్న అపార అనుభవం ప్రజలకు పూర్తిగా ఉపయోగపడాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. ఢిల్లీలో శనివారం ప్రారంభమైన 50వ గవర్నర్ల వార్షిక సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. గవర్నర్లు ఆయా రాష్ట్రాల ప్రజల సేవకు, సంక్షేమానికి నిత్యం పనిచేయాలని అన్నారు. కొత్తగా ఏర్పడ్డ కేంద్ర పాలిత ప్రాంతాలు లడాఖ్, జమ్మూ కశ్మీర్‌ల లెఫ్టినెంట్ గవర్నర్లు ఆర్.కె.మాథుర్, జి.సి.మర్మూల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించిన రాష్ట్రపతి గిరిజనుల అభివృద్ధి, సాధికారత సమీకృత అభివృద్ధికి, దేశ భద్రతలకూ కీలకమని వ్యాఖ్యానించారు. ‘వెనుకబడిన వర్గాల వారి అభివృద్ధికి సంబంధించి గవర్నర్లు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలతో ప్రభుత్వాలకు తగిన సూచనలు చేయవచ్చు’ అని సూచించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య గవర్నర్లను ఉద్దేశించి మాట్లాడారు. -
గవర్నర్లకు ఉపరాష్ట్రపతి ప్రత్యేక విందు
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయు డు ఢిల్లీలో రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. శనివారం నుంచి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో 50వ గవర్నర్ల సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఉపరాష్ట్రపతి శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. గవర్నర్ల సదస్సులో ఉపరాష్ట్రపతి, ప్రధాని కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. -
గవర్నర్ల మార్పుపై ఊహాగానాలు..
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తర్వాత ప్రస్తుతం వివిధ రాష్ట్రాల గవర్నర్ల మార్పుపై ఊహాగానాలు సాగుతున్నాయి. పరిపాలన, రాజకీయ పరమైన కారణాల దృష్ట్యా పలు రాష్ట్రాల్లో కొత్త గవర్నర్లు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. చాలామంది గవర్నర్లు మోదీ మొదటిసారిగా ప్రధాని అయిన 2014లో నియమితులైనవారు కావడంతో తాజా పరిస్థితిని కేంద్ర హోం శాఖ సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు గవర్నర్లు చాలాకాలంగా కొనసాగుతున్నారు. కొందరు ఇతర రాష్ట్రాలకు ఇన్చార్జిలుగా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఛత్తీస్‌గఢ్ ఇన్చార్జిగా ఉన్నారు. ఈఎస్ఎల్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా అలాగే తెలంగాణ గవర్నర్‌గా పదేళ్లుగా కొనసాగుతున్నారు. కాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న అనిల్ బైజాల్ ప్రధానమంత్రి కార్యాలయానికి బదిలీ కావచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే గవర్నర్లను ఎప్పుడు మార్చేదీ, ఎందరిని మార్చేదీ తెలియరాలేదు. సోమవారం నాటి పరిణామాల తర్వాత ప్రభుత్వం ఈ వ్యవహారం గోప్యంగా ఉండాలని భావిస్తోంది. మరోవైపు అయిదు రాష్ట్రాల గవర్నర్లు...కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీ నాథ్ త్రిపాఠీ, తమిళనాడు గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్, జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము, అరుణాచల్ గవర్నర్ బీడీ మిశ్రా తదితరులు కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు. -
ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బిహార్ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్‌ను జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా నియమించారు. బిహార్ కొత్త గవర్నర్‌గా లాల్జీ టాండన్ నియమితులయ్యారు. మేఘాలయ గవర్నర్‌గా తథాగత రాయ్, త్రిపుర గవర్నర్‌గా కప్తాన్ సింగ్ సోలంకి, సిక్కిం గవర్నర్‌గా గంగా ప్రసాద్, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా బేబీ రాణి మౌర్య, హరియాణ గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్ ఆర్యహాస్‌లను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. -
సమాఖ్యలో గవర్నర్ కీలకం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలితాలు వీలైనంత ఎక్కువమంది లబ్ధిదారులకు చేరడంలో గవర్నర్లు సహాయం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రెండ్రోజులపాటు జరగనున్న 49వ గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సదస్సులో ప్రధాని సోమవారం ప్రారంభోపన్యాసం చేశారు. ఆదివాసీ జనాభా చెప్పుకోదగినంత ఉన్న రాష్ట్రాల గవర్నర్లు విద్య, క్రీడ తదితర రంగాలతోపాటు సమ్మిళిత ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలుపరుస్తున్న కార్యక్రమాల ప్రయోజనాలు ఈ వర్గాలకు అందేట్లు చూడటంలో చేయూతను అందించాలని ప్రధాని కోరారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఆదివాసీల పాత్ర కీలకమని.. దీనిని గుర్తించి, భావితరాల వారికి అందించేందుకుగాను డిజిటల్ మ్యూజియమ్లు మొదలైన పద్ధతుల్లో వీటిని భద్రపరచాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ అంశాల్లో గవర్నర్లు తమ అధికారాన్ని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందేవారి సంఖ్యను పెంచాలన్నారు. ‘భారతదేశ సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగ పరిధిలో గవర్నర్ పాత్ర చాలా కీలకం’ అని మోదీ పేర్కొన్నారు. గవర్నర్లు తమ పరిధిలోని యూనివర్సిటీలకు చాన్స్లర్లన్న విషయాన్ని మోదీ గుర్తుచేస్తూ.. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం వేదిక ద్వారా యువతలో యోగాపై అవగాహన పెంచేందుకు కృషిచేయాలని కోరారు. వర్సిటీలు మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలకు కేంద్రాలు కావాలన్నారు. 65వేల పల్లెలకు గ్రామస్వరాజ్ వెనుకబడిన జిల్లాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తిచేసిన జాతీయ పౌష్టికాహార మిషన్, గ్రామాల విద్యుదీకరణ ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. ఇటీవలే విద్యుదీకరణ పూర్తయిన గ్రామాలను గవర్నర్లు సందర్శించి అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 14 నుంచి మే 5 వరకు ప్రభుత్వం చేపట్టిన గ్రామ్ స్వరాజ్ అభియాన్ ద్వారా ఏడు ముఖ్యమైన ప్రభుత్వ పథకాలను 16వేల గ్రామాల్లోని ప్రజలకు అందజేసిన విషయాన్ని ప్రధాని వెల్లడించారు. ఆగస్టు 15 వరకు గడువు నిర్దేశించుకుని ఈసారి 65వేల గ్రామాలకు చేరాలని సంకల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరిగే 50వ గవర్నర్ల సదస్సుకు ఇప్పటినుంచే ప్రణాళికలు ప్రారంభించాలని కోరారు. తద్వారా ఈ వార్షిక సదస్సు ఫలప్రదమయ్యేలా ప్రయత్నిం చాలన్నారు. మార్పుకు వారధులవ్వాలి: రాష్ట్రపతి పేదలు, అణగారిన వర్గాల విద్యాప్రమాణాలను పెంచడం, వీరి జీవితాల్లో మార్పు తీసుకురావడంలో గవర్నర్లు వారధుల్లా నిలవాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారు. సమాఖ్య వ్యవస్థలో కీలకమైన గవర్నర్లు.. రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకుడిగా, సంరక్షకుడిగా ఉండాలన్నారు. రాజ్భవన్లు విలువలు, సిద్ధాంతాలకు కేంద్ర స్థానాలుగా ప్రజలు భావిస్తారన్నారు. ‘భారత్‌లో 10 కోట్ల మంది ఆదివాసీలున్నారు. స్వాతంత్య్రం సిద్ధించినప్పటినుంచి నేటి వరకు ఈ వర్గం, మిగిలిన వారిలాగా సంక్షేమ పథకాల లబ్ధిని పొందలేకపోయింది. వీరి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు గవర్నర్లు చురుకైన పాత్ర పోషించాలి’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ‘గవర్నర్లు అంటే యువతకు గార్డియన్లు. మీరు యువత సరైన నైతికవిలువలతో ముందుకెళ్లేలా ప్రభావితం చేయగలరు. దేశంలోని 69 శాతం యూనివర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నాయి. యువతలో భారత సంస్కృతి సంప్రదాయాలతో పాటు ఆధునిక విద్యను అందుకునేలా మీరు స్ఫూర్తిని పెంచండి. ఈ వర్సిటీలు జాతీయ సమగ్రతను పెంచాలి. మహాత్ముని జయంతి సందర్భంగా ఆయన బోధనలు ఎక్కువగా ప్రసారమయ్యేలా చూడాలి’ అని కోవింద్ సూచించారు. -
గవర్నర్ల అలవెన్సులపై నూతన మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: గవర్నర్ల పర్యటనలు, బస, వినోదం, గృహసామగ్రికి చెల్లిస్తున్న భత్యాలపై కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం.. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసిహన్ పర్యటనలు, వసతి, వినోదం, ఇతర ఖర్చులకు రూ.53 లక్షలు, రాజ్‌భవన్ నిర్వహణకు రూ.18.3 లక్షలు, గృహ సామగ్రికి రూ.6 లక్షల భత్యం(మొత్తం రూ.77.3 లక్షలు) పొందుతారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠికి అత్యధికంగా రూ.1.81 కోట్లు దక్కనుంది. తమిళనాడు గవర్నర్‌కు రూ.1.66 కోట్లు, బిహార్ గవర్నర్‌కు రూ.1.62 కోట్లు, మహారాష్ట్ర గవర్నర్‌కు రూ.1.14 కోట్ల భత్యాలు ఇవ్వనున్నారు. గవర్నర్ల జీతభత్యాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. -
అంతా గవర్నర్ల విచక్షణేనా?
గోవా ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోయినా గవర్నర్ మృదులా సిన్హా.. బీజేపీ నేత పరీకర్‌ను సీఎంగా నియమించడం వివాదానికి దారితీసింది. గోవాలో మాదిరే మణిపూర్ ఎన్నికల్లోనూ రెండో స్థానంలో నిలిచిన బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ నజ్మా హెప్తుల్లా ఆహ్వానం పలకడంతో ఈ వ్యవహారంపై దుమారం రేగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పక్షానికీ మెజారిటీ రాకపోతే.. ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. దీన్ని ఉల్లంఘించిన సందర్భాలూ ఉన్నాయి. హరియాణాలో.. 1982 మేలో జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 సీట్లకు గాను పాలక కాంగ్రెస్ 36, విపక్ష లోక్‌దళ్ 31 సాధించాయి. లోక్‌దళ్ పొత్తు పెట్టుకున్న బీజేపీకి 6 సీట్లు రావడంతో ఆ పార్టీ బలం 37కు చేరింది. 24వ తేదీన లోక్‌దళ్–బీజేపీ ఎమ్మెల్యేలతో కలసి రాజ్‌భవన్‌కు రావాలని కూటమి నేత, మాజీ సీఎం దేవీలాల్‌ను గవర్నర్ జీడీ తపాసే ఆదేశించారు. ఇందిర ప్రధానిగా ఉన్న ఆ సమయంలో ఏం జరిగిందోగానీ, కాంగ్రెస్ శాసనసభా పక్షనేతగా ఎన్నికైన సీఎం భజన్‌లాల్‌తో 23 సాయంత్రమే సీఎంగా తపాసే ప్రమాణం చేయించారు. వెంటనే దేవీలాల్ రాజ్‌భవన్‌కు వెళ్లి.. భజన్ సర్కారును రద్దుచేసి, తనతో సీఎంగా ప్రమాణం చేయించాలని గవర్నర్‌ను డిమాండ్ చేశారు. మెజారిటీ రాకున్నా అత్యధిక సీట్లు గెలిచిన పార్టీ(కాంగ్రెస్) నేతతో ప్రమాణం చేయించడం ఆనవాయితీగా వస్తోందని, తాను అదే చేశానని, గవర్నర్‌కు ఇలాంటి విచక్షణాధికారాలు ఉన్నాయని తపాసే వాదించారు. మైనారిటీని మెజారిటీగా మార్చడంలో ఆరితేరిన భజన్ రెండు రోజులకే మెజారిటీ కూడగట్టారు. లాల్ కోర్టుకెక్కినా ఫలితం లేకపోయింది. కేరళలో.. పొత్తు పెట్టుకున్న పార్టీలకొచ్చిన సీట్లన్నీ ఒకే పార్టీ సీట్లుగా పరిగణించిన సందర్భాలూ ఉన్నాయి. 1982 మేలోనే కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్‌కి మెజారిటీ వచ్చింది. తర్వాతి స్థానంలో సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ నిలిచింది. కాంగ్రెస్‌కు విడిగా 20 , సీపీఎంకు విడిగా 26 సీట్లు వచ్చాయి. పెద్ద పార్టీని ఆహ్వానించే సంప్రదాయాన్ని పాటించాల్సి వస్తే.. గవర్నర్ సీపీఎం నేతతో సీఎంగా ప్రమాణం చేయించాలి. అయితే, గవర్నర్ యూడీఎఫ్ సారథి అయిన కాంగ్రెస్ నేతనే(సీఎల్పీ) సీఎంని చేశారు. మేఘాలయలో.. 1983 ఫిబ్రవరిలో 60 సీట్ల మేఘాలయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ 25 సీట్లతో పెద్ద పార్టీగా అవతరించింది. విపక్షాలైన ఆల్ పార్టీ హిల్‌లీడర్స్ కాన్ఫరెన్స్(ఏపీహెచ్చెల్సీ)కు 15, హిల్‌స్టేట్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(హెచ్చెస్పీడీపీ)కి 15, పబ్లిక్ డిమాండ్స్ ఇంప్లిమెంటేషన్ కన్వెన్షెన్(పీడీఐసీ)కి 2 సీట్లు వచ్చాయి. పెద్ద పార్టీ నేతగా తననే సర్కారు ఏర్పాటుకు ఆహ్వానించాలని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కెప్టెన్ విలియంసన్ సంగ్మా గవర్నర్‌ను కోరారు. మెజారిటీకి అవసరమైన 32 మంది మద్దతు తనకుందంటూ ఏపీహెచ్చెల్సీ, హెచ్చెస్పీడీపీ, పీడీఐసీల కూటమి(యూఎంపీపీ) నేత లింగ్డో గవర్నర్‌కు జాబితా సమర్పించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లింగ్డోను గవర్నర్ ఆహ్వానించారు. పెద్ద పార్టీని సర్కారు ఏర్పాటుకు పిలవలేదు. సందర్భాన్నిబట్టి పెద్ద పార్టీని పిలవాలా? మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతున్న నేతను సీఎంను చేయాలా? అనే విషయంలో గవర్నర్‌కు ‘విచక్షణాధికారాలు’ ఉన్నాయని, అర్థమౌతుంది. 1990 ఫిబ్రవరి నాటి మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అతిపెద్ద పార్టీగా అవతరించిన కా>ంగ్రెస్‌కు గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వలేదు.అప్పుడు కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ సర్కారు అధికారంలో ఉంది. ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమి ప్రభావం, గవర్నర్ల వ్యక్తిత్వం వివిధ సందర్భాల్లో భిన్న సంప్రదాయాల అమలుకు దారితీస్తున్నాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఇద్దరు గవర్నర్లను డిస్మిస్ చేయాలి
సురవరం డిమాండ్ బీజేపీ దుర్మార్గాలపై పోరాడాలి దేశ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించాలి సాక్షి, హైదరాబాద్: అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ గవర్నర్లను కేంద్రప్రభుత్వం వెంటనే డిస్మిస్ చేయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అసలు గవర్నర్ పదవే వృథా అని, కేంద్రానికి ఏజెంట్‌గా వ్యవహరించేందుకే ఆ పదవి పనికొస్తోందని అన్నారు. సంఘ్‌పరివార్‌కు అనుకూలంగా వ్యవహరించే వారిని గవర్నర్లుగా నియమిస్తుండడంతో వారు తమ పాతకాలం నాటి బూజుపట్టిన భావాలతో నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. బుధవారం పార్టీ నాయకులు చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా, పల్లా వెంకటరెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమకు అనుకూలంగా లేని రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ సర్కార్ ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వంపై కక్షసాధింపునకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించాలని సురవరం డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశ ఆర్థికస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. బీజేపీ పాలనలో దళితులపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని, విద్య, సాంస్కృతిక, సామాజిక రంగాలపై దాడి జరుగుతోందని విమర్శించారు. ఈ దాడులకు నిరసనగా లెఫ్ట్, రాజకీయేతర సంస్థలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని తమ జాతీయ సమితి పిలుపునిచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ సహా అన్ని వర్గాలు సమైక్యంగా ప్రతిఘటిస్తే తప్ప బీజేపీ దుర్మార్గాలను ఎదుర్కొనలేమని ఆయన పేర్కొన్నారు. గాంధీజీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ ఉత్సవాలు.. మహాత్మాగాంధీ హత్యకు గురికావడం వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం ఉందో లేదో తెలియదు కానీ ఆయన మరణం తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ ఉత్సవాలు జరుపుకుందని సురవరం వ్యాఖ్యానించారు. ఈ విషయాన్నే ఆర్ఎస్ఎస్కు రాసిన లేఖలో వల్లభాయ్‌పటేల్ పేర్కొన్నారన్నారు. అంతేకాకుండా అప్పట్లో విజయవాడలో ఈ ఉత్సవాల విషయంలో సీపీఐ-ఆర్ఎస్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ కూడా జరిగిందన్నారు. కశ్మీర్ పరిణామాలపై అఖిలపక్షాన్ని పిలవాలి.. కశ్మీర్లో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని సురవరం డిమాండ్ చేశారు. బుర్హన్ అనే టైస్టు హతం కావడంపై వ్యాఖ్యానిస్తూ, గతంలో ఒక టైస్టు ఎన్‌కౌంటర్‌పై ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కాలేదన్నారు. దీంట్లో ఏదో తప్పు జరిగిందని (సమ్‌థింగ్ ఈజ్ రాంగ్) వ్యాఖ్యానించారు. -
జీవించే హక్కుపై కాలుష్యం కాటు
ప్రజాభాగస్వామ్యంతో దీన్ని అరికట్టాలి ♦ గవర్నర్ల సదస్సులో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపు న్యూఢిల్లీ: నగరాల్లో మితిమీరుతున్న కాలుష్యం.. ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా జీవించే హక్కును కాలరాస్తోందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని నియంత్రించేందుకు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల రెండురోజుల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రణబ్ మాట్లాడుతూ విధాన నిర్ణయంలో వాతావరణ మార్పు కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇటీవలి కాలంలో దీని విపరిణామాలు ప్రకృతి విలయతాండవం రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ప్రజలు ఉత్సాహంగా భాగస్వాములైతే కాలుష్యాన్ని, వాతావరణ విపరిణామాల్ని నివారించ వచ్చన్నారు. ఈ దిశగా గవర్నర్లు ప్రజల్ని ప్రోత్సహించాలని ప్రణబ్ కోరారు. 2015 అత్యధిక ఉష్ణోగ్రతగల సంవత్సరంగా రికార్డుల్లోకి ఎక్కిందని.. ఇలాంటి వాతావరణ మార్పులు విధాన నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. మరింత శాస్త్రీయంగా విపత్తు నిర్వహణ విపత్తు నిర్వహణ విధానాలను మరింత శాస్త్రీయంగా రూపొందించుకోవాలని.. తద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చని రాష్ట్రపతి అన్నారు. రైతులు తీవ్ర కరువుతో ఇబ్బంది పడుతున్నారని, వాళ్ల సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని అన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు గవర్నర్లు కీలక పాత్ర పోషించాలని అన్నారు. రాజ్యాంగ పవిత్రతను రక్షించాలి గవర్నర్ల మీద రాజ్యాంగ బాధ్యతలు ఉంటాయని, ఆ బాధ్యతలు ఉన్నవాళ్లందరూ రాజ్యాంగ పవిత్రతను కాపాడాలని రాష్ట్రపతి కోరారు. రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఉండాలని అన్నారు. ఫసల్ బీమాను వినియోగించుకోవాలి రైతుల సంక్షేమం కోసం తెచ్చిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్మార్ట్ సిటీ మిషన్, స్వచ్ఛభారత్ మిషన్లను రాష్ట్రాల్లో సక్రమంగా అమలుచేయాలని కోరారు. సదస్సుకు 23 రాష్ట్రాల గవర్నర్లు, ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. -
శంకుస్థాపన’కు మహామహులు
- 1,500 మందిని ఆహ్వానించాలని ప్రభుత్వ నిర్ణయం - ప్రధాని చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి 1,500 మంది వీవీఐపీలను, వీఐపీలను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 22వ తేదీ విజయదశమి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీనికి అన్ని రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పార్లమెంటు సభ్యులందరినీ ఆహ్వానించనుంది. సుప్రీంకోర్టు సీజేతోపాటు రాష్ట్రానికి చెందిన సుప్రీం న్యాయమూర్తులను, హైకోర్టుసీజేతో పాటు, న్యాయమూర్తులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ ఆహ్వానాలు పంపనున్నారు. రాజధాని శంకుస్థాపనను పెద్ద ఎత్తున నిర్వహించడంతోపాటు సినిమా చిత్రీకరించాలని నిర్ణయించారు. దీన్ని నేషనల్ జియోగ్రఫీ చానల్‌కు అప్పగించాలని సీఆర్డీఏ నిర్ణయించడం తెలిసిందే. సింగపూర్, జపాన్ ప్రధానులు వచ్చే అవకాశం లేదు! ఇదిలా ఉంటే.. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి సింగపూర్, జపాన్ ప్రధానమంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆహ్వానించినప్పటికీ వారు వచ్చే అవకాశం లేదని సీనియర్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర దేశాల ప్రధానమంత్రులను ఆహ్వానిస్తే రారని, దీనికి ఒక విధానం ఉంటుందని ఆ అధికారి తెలిపారు. విదేశాంగ మంత్రిత్వశాఖ లేదా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇతర దేశాల ప్రధానమంత్రులకు ఆహ్వానాలు వెళ్లాలని, అలాగాక సీఎం ఆహ్వానించడం చెల్లదని ఆ అధికారి అన్నారు. అయితే సింగపూర్, జపాన్ ప్రధానులు రాకపోయినా ఆ దేశాలకు చెందిన కన్సల్టెంట్లు, ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. -
గవర్నర్ల పై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు
-
రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. బీహార్ గవర్నర్‌గా రామ్‌నాథ్ కోవింద్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఆచార్య దేవ్ వ్రత్లను నియమించారు. కేంద్ర ప్రభుత్వ సిఫారసు మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నియామకాలకు ఆమోదముద్ర వేశారు. శనివారం రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేసింది. -
292 రోజుల హాజరు తప్పనిసరి!
ఉద్యోగస్తులు ఏ చల్లటి దేశానికో.. సహారా ఎడారులకో పోవాలంటే అన్నింటికన్నా ముందు కావాల్సింది.. బాస్ పర్మిషన్! గ్రూప్ 4 నుంచి గ్రూప్ 1 సహా ప్రైవేటు ఉద్యోగులందరికీ ఈ రూల్ సహజమే! అయితే కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన నిబంధనల ప్రకారం గవర్నర్లు కూడా ఇకమీదట పర్మిషన్ దొరికితేగానీ వారు పనిచేస్తున్న రాష్ట్రం విడిచి వెళ్లడానికి వీల్లేదు! విదేశీయానమైనా.. స్వదేశంలోని మరో రాష్ట్రానికైనా.. ఎందుకు వెళుతున్నారో, ఎన్ని రోజులు పర్యటిస్తారో గౌరవ రాష్ట్రపతికి తప్పనిసరిగా చెప్పాల్సిందే. ఆయన ఓకే అంటే తప్ప కాలు కదపకూడదు! ఇప్పటికే గవర్నర్ల తొలిగింపు, నియామకాల్లో ఇష్టారీతిగా వ్యవహరిస్తోందనే అపవాదును మూటగట్టుకున్న మోదీ సర్కార్ తాజాగా గవర్నర్ల పర్యటనలపై ఆక్షలు విధించిడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 18 నిబంధనలతో కూడిన ఉత్తర్వులను జారీచేసింది, వాటి ప్రకారం గవర్లర్లు వారు పనిచేస్తోన్న రాష్ట్రాల్లో కనీసం 292 రోజులు ఉండాల్సిందే. స్వదేశంలోగానీ, విదేశాల్లోగానీ పర్యటించదల్చుకుంటే రాష్ట్రపతి భవన్ ఆమోదం ఉండాల్సిందే. పర్యటనకు ముందు గరిష్ఠంగా నాలుగు వారాల నుంచి ఒక వారంలోపు సమాచారం అందించాలి. కొన్నిసార్లు అత్యవసర పర్యటనలు చేయాల్సి వస్తుందికదా.. వాటికి కూడా రాష్ట్రపతి అనుమతిని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంత కచ్చితంగా కాకున్నప్పటికీ గవర్నర్ కు సంబంధించి కొన్ని నిబంధనలు ఇప్పటికే ఉన్నాయి. అయితే కొందరు వాటిని ఉల్లంఘిస్తూ నెలల తరబడి తాము పనిచేస్తోన్న రాష్ట్రాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని హోంశాఖ వర్గాలు తెలిపాయి. -
నాగాలాండ్ గవర్నర్ గా ఆచార్య ప్రమాణ స్వీకారం
కోహిమా: నాగాలాండ్ నూతన గవర్నర్ గా పీ బీ ఆచార్య శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ల సంఖ్య 19 కు చేరింది. నాగాలాండ్ కు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన ఆచార్య.. త్రిపుర గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం తలపెట్టిన గవర్నర్ల నియామకం ఎపిసోడ్ తో కొన్ని రాష్ట్రాల్లో పని చేస్తున్న వారికి స్థానం చలనం కలగగా, మరి కొందరు కొత్తగా గవర్నర్లగా నియమితులైయ్యారు.ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ గా ఉన్న 1995-2000 కాలంలో ఆచార్య పార్టీ జాతీయ కార్యదర్శిగా పని చేశారు. 1948 లో ఆర్ఎస్ఎస్ లో చేరిన ఆచార్య ఆరు నెలల పాటు జైలు శిక్షకూడా అనుభవించారు. ఆర్ఎస్ఎస్ ను ప్రభుత్వం నిషేధించిన అనంతరం ఆయన ముంబై యూనివర్శిటీ పాలక సభ్యునిగా 30 సంవత్సారాలు పాటు సేవలు అందించారు.తదుపరి ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన ఆచార్యను జూలై 14 న నాగాలాండ్ గవర్నర్ గా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నియమించారు. -
పుదుచ్చేరి గవర్నర్ తొలగింపు!
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో నియమితులైన రాష్ట్ర గవర్నర్లను మార్చే ప్రయత్నంలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ సర్కారు ఆ పనిలో వేగం పెంచింది. ఇందులో భాగంగా శుక్రవారం తొలిసారిగా ఓ గవర్నరుపై వేటు వేసింది. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీరేంద్ర కటారియాను తొలగించి, ఆ స్థానంలో అండమాన్, నికోబార్ దీవుల లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అజయ్‌కుమార్‌కు అదనంగా బాధ్యతలను అప్పగించింది. గవర్నర్ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని వీరేంద్రను ఆదేశిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారని రాష్ట్రపతి భవన్ వర్గాలు శుక్రవారం రాత్రి ప్రకటించాయి. గవర్నర్ తొలగింపు అనేది.. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లకు హెచ్చరికలాంటిదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలాఉండగా.. తనను సంప్రదించకుండా మిజోరం నుంచి నాగాలాండ్‌కు బదిలీ చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ గవర్నర్ వక్కొం బి. పురుషోత్తమన్ శుక్రవారం రాజీనామా చేశారు. గవర్నర్లను, ప్రభుత్వ అధికారుల మాదిరిగా బదిలీ చేయడం అవమానించడమేనన్నారు. రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ అల్వా శనివారం సాయంత్రం(నేడు) గోవా గవర్నర్‌గా ప్రమాణం చేయనున్నారు. -
మోడీ వచ్చాక ఆరో వికెట్!!
నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కారణాలు ఏవైనా ఇప్పటికి వరుసపెట్టి ఆరుగురు గవర్నర్లు రాజీనామా చేశారు. మరికొందరు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. తాజాగా.. తనను నాగాలాండ్ గవర్నర్‌గా బదిలీ చేసినందుకు తీవ్రంగా అసంతృప్తి చెందిన మిజొరాం గవర్నర్ పురుషోత్తమన్ తన పదవికి రాజీనామా చేసిపారేశారు. ఈయనతో కలిపి రాజీనామా చేసిన గవర్నర్ల సంఖ్య ఆరుకు చేరుకుంది. వీళ్లంతా యూపీఏ హయాంలో నియమితులైనవాళ్లే. తనను ఏమాత్రం సంప్రదించకుండానే, తన అభిప్రాయం తెలుసుకోకుండానే తనను బదిలీ చేశారన్నది పురుషోత్తమన్ ఆక్రోశం. కేరళలలో ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన ఈ 86 ఏళ్ల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు 2011లో గవర్నర్ అయ్యారు. వాస్తవానికి మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి నుంచి చాలామంది గవర్నర్లకు ఇక చాలు.. దిగిపొండి అంటూ ఫోన్లు వెళ్లాయి. పదవీకాలం చివరకు వచ్చేసినవాళ్లను మాత్రం ఉండమన్నారు. ఈ జాబితాలో గుజరాత్ గవర్నర్ కమలా బేణీవాల్ ఒకరు. మోడీ సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు, గవర్నర్‌కు చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఆమెకు పదవీకాలం కేవలం నాలుగు నెలలే ఉన్నా, ఆమెను మిజొరాం గవర్నర్‌గా బదిలీ చేశారు. ఇక కేరళ గవర్నర్‌గా ఉన్న షీలా దీక్షిత్.. రాజీనామా చేసేందుకు నిరాకరించారు. ప్రధాన మంత్రిని, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన తర్వాత.. వాళ్లెవరూ తనను రాజీనామా చేయాలని కోరలేదని షీలా అన్నారు. ఇక గోవా, పశ్చిమబెంగాల్ గవర్నర్లు వాంఛూ, ఎంకే నారాయణన్ మాత్రం అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణంలో సీబీఐ ప్రశ్నించడంతో వాళ్లిద్దరూ టపటపా రాజీనామాలు చేసి పారేశారు. కానీ ఇదే కేసులో సీబీఐ ప్రశ్నించిన మరో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మాత్రం ఇంకా రాజీనామా నిర్ణయం ఏమీ తీసుకోలేదు. ఆయన ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇక, వీళ్లందరికంటే ముందు ఉత్తరప్రదేశ్ గవర్నర్ బీఎల్ జోషి, ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శేఖర్ దత్, నాగాలాండ్ గవర్నర్ అశ్వనీకుమార్ రాజీనామాలు చేశారు. కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్, త్రిపుర గవర్నర్ దేవానంద్ కొన్వర్ మాత్రం వాళ్ల పదవీకాలం ముగిసేవరకు ఉన్నారు. -
వృద్ధులకు చాన్స్!
బీజేపీకి చెందిన కొందరు వృద్ధనేతలు త్వరలో వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమితులు కాబోతున్నారు. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లలో కొందరు తమ పదవుల నుంచి తప్పుకోగానే వారి స్థానంలో బీజేపీ వృద్ధనేతలను నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రం ఆదేశాలమేరకు చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్లు ఇప్పటికే తప్పుకున్నారు. ఇక మిగిలిన వారిలో పలువురిచేత రాజీనామా చేయించే అవకాశాలున్నాయని పాలకపక్ష వర్గాలు తెలిపాయి. గవర్నర్లుగా నియమించేందుకు, పాలకపక్షానికి చెందిన నేతల జాబితా ఖరారు కాగానే, మిగిలిన గవర్నర్ల రాజీనామాలను కూడా కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలకు ముందుగానే కొత్త గవర్నర్ల నియామకం జరగవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. పది మందికిపైగా గవర్నర్లను మార్చే అవకాశం ఉందంటున్నారు. గోవా గవర్నర్ బీవీ వాంఛూ లక్ష్యంగా గోవా బీజేపీ ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో, వాంఛూ మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్‌ను కలుసుకున్నారు. అయితే, ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. హర్యానా గవర్నర్ జగన్నాథ్ పహాడియా కూడా రాజనాథ్‌ను కలుసుకున్నారు. నాగాలాండ్ గవర్నర్ అశ్వినీ కుమార్, పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ కూడా పదవి నుంచి తప్పుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా, గవర్నర్‌గా నియమితుడు కావచ్చని భావిస్తున్న బీజేపీ సీనియర్ నేత లాల్జీటాండన్ నిన్న రాజనాథ్‌తో భేటీ అయ్యారు. -
అందరూ రాజీనామా చేయాల్సిందే
బెంగళూరు: యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమించిన గవర్నర్లను తొలగించాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించడాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సమర్థించారు. యూపీఏ ప్రభుత్వంలో చేపట్టిన రాజకీయ నియామకాలు పొందిన వారందరూ స్వచ్చందంగా తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యవస్థ ప్రయోజనాల రీత్యా ఇలా చేయడం సబబేనని వెంకయ్య చెప్పారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి గవర్నర్లకు ఫోన్లు చేసి రాజీనామా చేయాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. తాను గవర్నర్ల స్థానంలో ఉంటే వెంటనే రాజీనామా చేసేవాడినని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా వ్యాఖ్యానించారు. కొందరు గవర్నర్లు రాజీనామా చేయగా, మరి కొందరు గవర్నర్లు అదే బాటలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ చర్యలను ప్రతిపక్షాలు విమర్శించగా, కొందరు గవర్నర్లు విముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వెంకయ్ మాట్లాడుతూ.. యూపీఏ రాజకీయ పదవులు పొందినవారిని కొనసాగించాల్సిన అవసరం లేదని చెప్పారు. -
రాజీనామాకు గవర్నర్లు ససేమిరా
* తగిన సంస్థ కోరితేనే ఆలోచిస్తానన్న మహారాష్ట్ర గవర్నర్ * కేంద్రంపై కర్ణాటక, నాగాలాండ్ గవర్నర్ల మండిపాటు న్యూఢిల్లీ/ముంబై: రాజీనామా చేయాలని కేంద్రం తమపై తెస్తున్న ఒత్తిడిని మహారాష్ట్ర గవర్నర్ కె.శంకరనారాయణన్ సహా పలువురు గవర్నర్లు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులైన గవర్నర్లలో కొందరిని పదవులను నుంచి తప్పుకోవాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి కోరడం తెలిసిందే. అయితే కేంద్రం ఒత్తిడి పెంచుతున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. తగిన నిర్ణయాత్మక సంస్థ కోరితేనే రాజీనామా అంశాన్ని పరిశీలిస్తానని శంకరనారాయణన్ బుధవారం ఓ టీవీ చానల్‌తో అన్నారు. అనిల్ గోస్వామి గత వారం తనతో రెండు సార్లు మాట్లాడారని, తాను జవాబు చెప్పలేదని వెల్లడించారు. ‘గవర్నర్ పదవి రాజ్యాంగ పదవి. ఆయన రాష్ట్రపతి ప్రతినిధి.. పదవి నుంచి తప్పుకోవాలని బాధ్యతాయుత వ్యక్తులెవరూ నన్ను రాతపూర్వకంగా అడగలేదు’ అని చెప్పారు. రాజీనామా చేస్తారని భావిస్తున్న నాగాలాండ్ గవర్నర్ అశ్వనీ కుమార్ కేంద్రం యత్నాన్ని రాజకీయ కక్షగా అభివర్ణించారు. ఎన్డీఏ ప్రభుత్వం తనకిష్టమైన వారే గవర్నర్లుగా ఉండాలని కోరుకుంటోందా అని ప్రశ్నించారు. తన రాజీనామా అంశాన్ని కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ తోసిపుచ్చారు. ‘రాజ్యాంగం ప్రకారం గవర్నర్లు రాజీనామా చేయరు. తమ స్థానంలో కొత్తవారు వచ్చేంతవరకు పదవుల్లో కొనసాగుతారు. ఈ విషయంలో బాధ్యతారహితంగా ఎలా వ్యవహరిస్తారు?’ అని మండిపడ్డారు. భరద్వాజ్ బుధవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలుసుకుని రాజీనామాలోని సమస్యల గురించి మాట్లాడారు. ఆయన గురువారం ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి అపాయింట్మెంట్ కోరారు. కాగా, తాను రాజీనామా చేయలేదని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ స్పష్టం చేశారు. -
గవర్నర్ల ‘తిరుగుబాటు’
రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తులను గవర్నర్లుగా నియమిం చడమే ఉత్తమమని చాన్నాళ్ల క్రితం సుప్రీంకోర్టు వ్యక్తంచేసిన అభిప్రా యాన్ని పెడచెవినబెట్టిన పర్యవసానంగా మరోసారి గవర్నర్ల వ్యవస్థ రచ్చకెక్కింది. అధికార పగ్గాలు చేపట్టిన నెల్లాళ్లలోనే ఎన్డీఏ ప్రభుత్వం జూలు విదిల్చి యూపీఏ హయాంలో నియమితులైన గవ ర్నర్లకు నిష్ర్కమించాలంటూ సంకేతాలు పంపింది. ఈ సంకేతాలను అందుకుని మర్యాదగా రాజీనామాలు సమర్పించింది ఇప్పటికైతే యూపీ గవర్నర్ బీఎల్ జోషి ఒక్కరు మాత్రమే. మిగిలిన వారంతా ‘చెప్పదగినవారు’ చెబితే తప్పుకుంటామని, లిఖితపూర్వ కంగా ఇస్తే తప్పుకుంటామని లౌక్యం ప్రదర్శిస్తున్నారు. మరో రకంగా చెప్పాలంటే వారు కేంద్రంతో ఘర్షణకు సిద్ధపడుతున్నారు. దేశంలో గవర్నర్ల వ్యవస్థ వివాదాస్పదం అయినంతగా మరేదీ కాలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాజ్భవన్లను బ్రాంచ్ ఆఫీసులుగా మార్చడం, కేంద్రం ఏజెంట్లుగా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం తప్ప గవర్నర్లు చేస్తున్నదేమీ లేదన్న విమర్శలు తరచు వినబడుతుంటాయి. రాజ్యాంగాన్ని చూపించి, రాజ్యాంగ నిర్మాతల అభిప్రాయాలను ఉటంకించి గవర్నర్ల వ్యవస్థకుండే పవిత్రతను ఎంతైనా చెప్పవచ్చు. కానీ ఆచరణకొచ్చేసరికి అవి కలికానికి కూడా కనబడకపోవడంవల్లే ఈ దుస్థితి. రాజ్యాంగం ప్రకారం భారత పౌరులై 35 ఏళ్ల వయసు నిండివుండటం, ఆదాయం లభించే ఏ పదవిలోనూ లేకపోవడం, ఏ చట్టసభలోనూ సభ్యుడుకాకపోవడం గవర్నర్‌గా నియామకానికి ప్రాథమిక అర్హతలు. కానీ, ఈ అర్హతల ప్రాతిపదికనే గవ ర్నర్గా నియమితులైనవారు ఇన్ని దశాబ్దాల్లో ఎవరైనా ఉన్నారా? తమ నాయకశ్రేణిలో అసంతృప్తులుగా ఉన్నవారిని చల్లార్చడానికో, అవసరార్ధం కీలక పదవులనుంచి తప్పించినవారికి పునరావాసం కోసమో, సీబీఐవంటి సంస్థలకు డెరైక్టర్లుగా పనిచేస్తూ తమ తాబేదార్లుగా వ్యవహరించి రిటైరైనవారికో గవర్నర్ పదవుల్ని కట్టబెట్టడం కేంద్రంలో ఉండే అధికార పక్షానికి రివాజైంది. రోశయ్య, షీలా దీక్షిత్, హెచ్.ఆర్. భరద్వాజ్, జేబీ పట్నాయక్, మార్గరెట్ ఆల్వా, కమలాబేణీవాల్... ఇలా అందరూ సీఎంలుగా, కేంద్రమంత్రులుగా పనిచేసి పునరావాసంలో భాగంగా గవర్నర్లయి నవారే. తమను నియమించినవారి ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టినవారు ఇందులో చాలామంది ఉన్నారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటైన సర్కారియా కమిషన్ గవర్నర్ల నియామకానికి సంబంధించి కొన్ని సూచనలు చేసింది. ఆ పదవికి ఎంపికయ్యే వ్యక్తులు ప్రముఖులు లేదా ఏదో ఒక రంగంలో నిష్ణాతులు అయివుండాలని, రాజకీ యాలకు సంబంధం ఉండరాదని అభిప్రాయపడింది. యూపీఏ సర్కారు నియమించిన వీరప్ప మొయిలీ నేతృత్వంలోని పాలనా సంస్కరణల కమిషన్ సైతం ఇలాంటి సూచనలే ఇచ్చింది. ఎస్ఆర్ బొమ్మైకేసులో సుప్రీంకోర్టు కూడా రాజకీయ నేతలకు గవర్నర్ పదవులు పునరావాసంగా మారవద్దని సూచించింది. ఇందరు ఇన్నివిధాల చెప్పినా గవర్నర్ల వ్యవస్థ ఏ కొంచెమైనా మారింది లేదు. ఇప్పుడు రాజ్యాంగాన్ని చూపించి, నైతికతను ఏకరువుపెట్టి ఎన్డీఏ సర్కారును తప్పుబట్టేవారు దీన్ని గుర్తించవలసి ఉంది. ఇష్టానుసారంగా గవర్నర్ పదవులు పంచిపెట్టే సంప్రదాయం కొనసాగుతున్నప్పుడు ఇలా తీసేయడంలో తప్పున్నదని ఎవరూ భావించలేరు. కేంద్రంలో అధికారపక్షం మారగానే గవర్నర్లపై కొరడా ఝళి పించడం సర్వసాధారణమైంది. 1977లో ఇందిరాగాంధీ ప్రభుత్వం పతనమయ్యాక అధికారంలోకొచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం తొలి సారి గవర్నర్ల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అంతకు ముందు ఇలాంటి సంప్రదాయం లేదు గనుక కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా, పద్ధతిప్రకారం వ్యవహరించిందని అనలేం. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడటం అదే ప్రథమం. జనతా ప్రభుత్వం నెలకొల్పిన సంప్రదాయాన్ని కేంద్రంలో అధికారంలో కొచ్చిన ప్రతి ప్రభుత్వమూ అనుసరించింది. 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక అంతక్రితం ఎన్డీఏ సర్కారు నియమించిన గవర్నర్లు విష్ణుకాంత్ శాస్త్రి(యూపీ), కైలాసపతి మిశ్రా(గుజరాత్), బాబూ పరమానంద్(హర్యానా), కేదార్నాథ్ సాహ్ని(గోవా)లను తొలగించింది. ఈ తొలగింపును సవాలుచేస్తూ బీపీ సింఘాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన రాజ్యాంగ ధర్మాసనం 2010లో తీర్పు వెలువరించింది. గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఏజెంటు లేదా ఉద్యోగి కాదని... ప్రభుత్వం మారగానే గవర్నర్‌ను తొలగించడం చెల్లదని స్పష్టంచేసింది. తమ విధానాలకూ లేదా సిద్ధాంతాలకూ అనుగు ణంగా లేరన్న కారణంతో తొలగించడం కుదరదని రాజ్యాంగంలోని 156(1) అధికరణాన్ని ఉటంకిస్తూ చెప్పింది. తొలగించవలసివచ్చిన పక్షంలో అందుకు ప్రత్యేకమైన, తప్పనిసరి పరిస్థితులుండాలని నొక్కి చెప్పింది. ఇప్పుడు కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న గవర్నర్లు తమది రాజ్యాంగబద్ధమైన పదవి అంటున్నారు. అది నిజమే కావొచ్చు. కానీ నియామకానికి ఎలాంటి కొలమానాలూ పాటించనప్పుడు... అధికా రంలో ఉన్నవారికి సన్నిహితులు కావడమే పదవికి ఏకైక అర్హత అయి నప్పుడు తొలగించడంలోనూ అలాంటివే పని చేస్తాయని వారు గుర్తించాలి. గవర్నర్ పదవిపై చర్చ వచ్చింది గనుక కనీసం ఇప్పుడైనా రాజకీయేతర వ్యక్తులను నియమించగలిగితే ఎన్డీఏ సర్కారు ఒక కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పినట్టవుతుంది. కానీ, వర్తమాన రాజ కీయ పరిస్థితుల్లో అలాంటి పరిణామాన్ని ఆశించడం కష్టమే. -
గవర్నర్లుగా బీజేపీ సీనియర్ నేతలు!
న్యూఢిల్లీ : కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల గవర్నర్ల మీద దృష్టి కేంద్రీకరించింది. యూపీఏ హయంలో నియమితులైన గవర్నర్లను సాగనంపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు గవర్నర్ల వ్యవహారంపై కేంద్ర హోంశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వంలో లేని బీజేపీ సీనియర్ నేతలను గవర్నర్లుగా నియమించే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్ర గవర్నర్‌గా మురళీ మనోహర్ జోషీని నియమించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు 15 రాష్ట్రాల్లో కొత్త గవర్నర్ల నియామకం జరగనుంది. అప్పట్లో యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాగానే అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వం నియమించిన గవర్నర్లను తొలగించింది. తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నియమించారనే అపవాదును యూపీఏ ప్రభుత్వం మూటగట్టుకుంది. బీజేపీ ప్రభుత్వాలను ఇరుకున పెట్టేలా అప్పుడు యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాటలోనే మోడీ ప్రభుత్వం నడిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ గవర్నర్ల జాబితాలో తమిళనాడు గవర్నర్ రోశయ్య కూడా ఉన్నారు. ఆయన స్థానంలో గవర్నర్‌గా బీజేపీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్‌ను నియమించనున్నట్టు ప్రచారం సాగుతోంది. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లను తొలగించే ప్రక్రియను చేపడతారన్న సమాచారంతో ప్రస్తుత గవర్నర్ల పరిస్థితి డోలాయమానంలో పడిపోయింది. -
గవర్నర్లను కొనసాగించాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: తమ హయాంలో నియమించిన గవర్నర్లను ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తుందన్న నమ్మకాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేసింది. తాము నియమించిన గవర్నర్లను రాజీనామా చేయమని కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ సంకీర్ణ సర్కారు కోరబోదని కాంగ్రెస్ భావిస్తోంది. గవర్నర్ పదవి రాజ్యాంబద్దమైందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుజ్రీవాలా తెలిపారు. రాజ్యాంగ పదవుల విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొత్త ప్రభుత్వం గౌరవించడం సంప్రదాయంగా వస్తోందన్నారు. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లను రాజీనామా చేయాలని కాంగ్రెస్ కోరతుందా అన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. అయితే పలువురు గవర్నర్లను మోడీ సర్కారు తొలగించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.