గవర్నర్ల సదస్సులో రాష్ట్రపతి
న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గవర్నర్లు అనుసంధానకర్తలుగా వ్యవహరించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. శనివారం ముగిసిన గవర్నర్ల రెండు రోజుల సదస్సులో ఆమె ప్రసంగించారు. శాఖల మధ్య మరింత సమన్వయానికి చర్యలపై సదస్సులో చర్చించినట్టు రాష్ట్రపతి భవన్ పేర్కొంది.
మెరుగైన పనితీరుకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాచారాన్ని పొందేందుకు, నిరంతర సంప్రదింపులకు సాగించడంలో గవర్నర్లు సంశయించరాదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సూచించారు. రాజ్‌భవన్‌లలో ఆదర్శ పాలనా నమూనాను రూపొందించడానికి గవర్నర్లు కృషి చేయాలని ప్రధాని మోదీ సూచించారు. గవర్నర్లు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, డిజిటైజేషన్‌ను ప్రోత్సహించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment