న్యూఢిల్లీ: తమ హయాంలో నియమించిన గవర్నర్లను ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తుందన్న నమ్మకాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేసింది. తాము నియమించిన గవర్నర్లను రాజీనామా చేయమని కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ సంకీర్ణ సర్కారు కోరబోదని కాంగ్రెస్ భావిస్తోంది. గవర్నర్ పదవి రాజ్యాంబద్దమైందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుజ్రీవాలా తెలిపారు.
రాజ్యాంగ పదవుల విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొత్త ప్రభుత్వం గౌరవించడం సంప్రదాయంగా వస్తోందన్నారు. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లను రాజీనామా చేయాలని కాంగ్రెస్ కోరతుందా అన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. అయితే పలువురు గవర్నర్లను మోడీ సర్కారు తొలగించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.
గవర్నర్లను కొనసాగించాలి: కాంగ్రెస్
Published Thu, May 29 2014 9:28 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM
Advertisement
Advertisement