రామ్‌లల్లా దర్శనానికి మూడు రాష్ట్రాల గవర్నర్లు! | Gujarat, Sikkim, And Meghalaya Governor Reached Ayodhya - Sakshi
Sakshi News home page

Ayodhya: రామ్‌లల్లా దర్శనానికి మూడు రాష్ట్రాల గవర్నర్లు!

Published Mon, Apr 1 2024 12:47 PM | Last Updated on Mon, Apr 1 2024 1:35 PM

Gujarat Sikkim and Meghalaya Governors Reached Ayodhya - Sakshi

గుజరాత్, సిక్కిం, మేఘాలయ గవర్నర్లు  రామ్‌లల్లాను దర్శించుకునేందుకు అయోధ్య  చేరుకున్నారు. వారికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్వాగతం పలికింది. ఈ ముగ్గురు గవర్నర్లు వేర్వేరు సమయాల్లో రామ్‌లల్లాను దర్శించుకున్నారు. 

మేఘాలయ గవర్నర్ ఫాగు చౌహాన్ తమ పూర్వీకుల స్వస్థలమైన అజంగఢ్ నుండి రోడ్డు మార్గంలో ముందుగా అయోధ్య చేరుకున్నారు. అనంతరం రామజన్మభూమిలోని ఆలయంలో కొలువైన రామ్‌లల్లాను దర్శించుకున్నారు. అలాగే సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య విమానాశ్రయం నుంచి నేరుగా సర్క్యూట్ హౌస్‌కు చేరుకున్నారు. అక్కడి భద్రతా సిబ్బంది ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. 

అనంతరం గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మహర్షి వాల్మీకి అంతర్జాతీయ శ్రీరామ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. తరువాత వారు రామ్‌లల్లాను దర్శించుని పూజలు చేశారు. సర్క్యూట్‌ హౌస్‌లో మీడియాతో మాట్లాడిన సిక్కిం గవర్నర్‌ లక్ష్మణ్‌ ఆచార్య రామ్‌లల్లాను చూశాక ఎంతో ఆనందం కలిగిందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement