
రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. బీహార్ గవర్నర్గా రామ్నాథ్ కోవింద్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఆచార్య దేవ్ వ్రత్లను నియమించారు.
కేంద్ర ప్రభుత్వ సిఫారసు మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నియామకాలకు ఆమోదముద్ర వేశారు. శనివారం రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేసింది.