అందరూ రాజీనామా చేయాల్సిందే | Political appointees must resign, says Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

అందరూ రాజీనామా చేయాల్సిందే

Published Fri, Jun 20 2014 4:22 PM | Last Updated on Mon, Sep 17 2018 5:32 PM

అందరూ రాజీనామా చేయాల్సిందే - Sakshi

అందరూ రాజీనామా చేయాల్సిందే

బెంగళూరు: యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమించిన గవర్నర్లను తొలగించాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించడాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సమర్థించారు. యూపీఏ ప్రభుత్వంలో చేపట్టిన రాజకీయ నియామకాలు పొందిన వారందరూ స్వచ్చందంగా తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యవస్థ ప్రయోజనాల రీత్యా ఇలా చేయడం సబబేనని వెంకయ్య చెప్పారు.

కేంద్ర హోం శాఖ కార్యదర్శి గవర్నర్లకు ఫోన్లు చేసి రాజీనామా చేయాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే.  తాను గవర్నర్ల స్థానంలో ఉంటే వెంటనే రాజీనామా చేసేవాడినని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా వ్యాఖ్యానించారు. కొందరు గవర్నర్లు రాజీనామా చేయగా, మరి కొందరు గవర్నర్లు అదే బాటలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ చర్యలను ప్రతిపక్షాలు విమర్శించగా, కొందరు గవర్నర్లు విముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వెంకయ్ మాట్లాడుతూ.. యూపీఏ రాజకీయ పదవులు పొందినవారిని కొనసాగించాల్సిన అవసరం లేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement