![Government issues fresh guidelines on allowances of governors - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/4/CASH.jpg.webp?itok=s3iTJe0_)
న్యూఢిల్లీ: గవర్నర్ల పర్యటనలు, బస, వినోదం, గృహసామగ్రికి చెల్లిస్తున్న భత్యాలపై కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం.. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసిహన్ పర్యటనలు, వసతి, వినోదం, ఇతర ఖర్చులకు రూ.53 లక్షలు, రాజ్‌భవన్ నిర్వహణకు రూ.18.3 లక్షలు, గృహ సామగ్రికి రూ.6 లక్షల భత్యం(మొత్తం రూ.77.3 లక్షలు) పొందుతారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠికి అత్యధికంగా రూ.1.81 కోట్లు దక్కనుంది. తమిళనాడు గవర్నర్‌కు రూ.1.66 కోట్లు, బిహార్ గవర్నర్‌కు రూ.1.62 కోట్లు, మహారాష్ట్ర గవర్నర్‌కు రూ.1.14 కోట్ల భత్యాలు ఇవ్వనున్నారు. గవర్నర్ల జీతభత్యాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment