బెంగాలీ సినీ నటుడు, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ తపాస్ పాల్
భువనేశ్వర్ : రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణంలో ఒడిశా హైకోర్టు గురువారం బెంగాలీ నటుడు, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ తపాస్ పాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. అలాగే బ్యాంక్‌లో రూ. కోటి జమ చేయాలని ఎంపీకి ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు వ్యక్తులు రెండు లక్షల రూపాయల బాండుతో పూచీకత్తు సమర్పించాలని తెలిపింది. పాస్‌పోర్టును దర్యాప్తు చేస్తున్న అధికారికి సరెండర్ చేయాలని సూచించింది. చిట్ ఫండ్ కుంభకోణం 2016లో వెలుగులోకి రావడంతో తపాస్ పాల్‌ను డిసెంబర్ 30, 2016న సీబీఐ అరెస్ట్ చేసింది.
ఎప్పుడు అవసరమైతే అప్పుడు విచారణకు సహకరించాలని కోర్టు కోరింది. కోల్‌కత్తాలో తపాస్ పాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన అనంతరం మరింత లోతుగా విచారించడానికి భువనేశ్వర్‌లోని జార్‌పార జైలుకు తరలించారు. అక్కడకు తీసుకెళ్లిన తర్వాత తపాస్ పాల్ ఆరోగ్యం క్షీణించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తపాస్ పాల్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అంతకు ముందు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment