Tapas Paul
-
చిట్‌ఫండ్ మోసం కేసులో ఎంపీకి బెయిల్
భువనేశ్వర్ : రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణంలో ఒడిశా హైకోర్టు గురువారం బెంగాలీ నటుడు, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ తపాస్ పాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. అలాగే బ్యాంక్‌లో రూ. కోటి జమ చేయాలని ఎంపీకి ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు వ్యక్తులు రెండు లక్షల రూపాయల బాండుతో పూచీకత్తు సమర్పించాలని తెలిపింది. పాస్‌పోర్టును దర్యాప్తు చేస్తున్న అధికారికి సరెండర్ చేయాలని సూచించింది. చిట్ ఫండ్ కుంభకోణం 2016లో వెలుగులోకి రావడంతో తపాస్ పాల్‌ను డిసెంబర్ 30, 2016న సీబీఐ అరెస్ట్ చేసింది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు విచారణకు సహకరించాలని కోర్టు కోరింది. కోల్‌కత్తాలో తపాస్ పాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన అనంతరం మరింత లోతుగా విచారించడానికి భువనేశ్వర్‌లోని జార్పార జైలుకు తరలించారు. అక్కడకు తీసుకెళ్లిన తర్వాత తపాస్ పాల్ ఆరోగ్యం క్షీణించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తపాస్ పాల్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అంతకు ముందు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. -
ప్రపంచం ఉన్నంతకాలం రేప్‌లు జరుగుతాయి
టీఎంసీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో తృణవుూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్‌పాల్ మహిళల విషయుంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రగడ ఇంకా సద్దుమణగకముదే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే దీపక్ హల్దార్ నోరుజారారు. ప్రపంచం ఉన్నంతవరకు అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయని ఆయున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో తీవ్ర దుమారం సృష్టించాయి. మహిళా హక్కుల సంఘాలు, విపక్షాలు ఆయునపై తీవ్రస్థారుులో విరుచుకుపడ్డాయి. బుధవారం ఆయున డైవుండ్ హార్బర్ వద్ద జరిగిన ఓ సమవేశంలో మాట్లాడుతూ, ‘గతంలో అత్యాచారాలు జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి. ప్రపంచం ఉన్నంతవరకు అవి జరుగుతూనే ఉంటారు’ అని అన్నారు. అత్యాచారాలు సావూజిక రుగ్మత వంటివని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కరే ఈ సవుస్యను పరిష్కరించలేరని ఆయున పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై వివిధ వర్గాలు భగ్గుమనడంతో ఆయున క్షవూపణలు చెప్పాల్సి వచ్చింది. హల్దార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయుడం దురదృష్టకరమని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అన్నారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నాయుకత్వంలోని టీఎంసీ నేతలు పదేపదే ఇటువంటి వ్యాఖ్యలు చేయుడం దురదృష్టకరమని మహిళా హక్కుల నేత మమతా శర్మ అన్నారు. వుుఖ్యవుంత్రి ఇటువంటి విషయూలను పట్టించుకోవడం లేదని, ఇలాంటి ప్రజాప్రతినిధులను పార్టీనుంచి సస్పెండ్ చేయూలని డివూండ్ చేశారు. టీఎంసీ లో కూడా ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయుని సీపీఎం నేత రీతుబ్రాతా బెనర్జీ వివుర్శించారు. -
సీపీఎంవాళ్ల గొంతులు కోయండి!
తృణమూల్ ఎంపీ తపస్ పాల్ మరో వివాదాస్పద వ్యాఖ్య ‘రేప్’ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన రోజే మరో వీడియో బహిర్గతం అరెస్టుకు సీపీఎం, బీజేపీ డిమాండ్ కోల్‌కతా: తమ పార్టీ కార్యకర్తల జోలికొస్తే సీపీఎం కార్యకర్తలను హత్య చేయిస్తానని...వారి మహిళలపై అత్యాచారాలు చే యిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటుడు తపస్ పాల్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయన ‘రేప్’ వ్యాఖ్యలపై ఓవైపు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగడం, దీనిపై ఆయన మంగళవారం బేషరతు క్షమాపణ చెప్పిన కొంతసేపటికే ఆయన చేసిన మరో వివాదాస్పద వ్యాఖ్యల వీడియో బహిర్గతమైంది. ప్రతిపక్ష సీపీఎం కార్యకర్తల గొంతులు కోయాలంటూ నాదియా జిల్లాలోని ఓ గ్రామంలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోను బెంగాలీ చానళ్లు మంగళవారం ప్రసారం చేశాయి. ‘‘ప్రజలను చంపేవారు మనుషులే కాదు. నేను మీతో ఉన్నంత వరకూ ఏ సీపీఎం కార్యకర్తను వదిలిపెట్టొద్దు. ఇదే విషయాన్ని మహిళలకూ చెబుతున్నా. ఇంట్లో కూరలు కోసే కత్తులతో వారి గొంతులు కోయండి’’ అంటూ ఆ వీడియోలో ఆయన వ్యాఖ్యానించారు. రేప్ వ్యాఖ్యలు చేసిన రోజే తపస్ ఈ వ్యాఖ్యలు కూడా చేసినట్లు చానళ్లు పేర్కొన్నాయి. అంతకుముందు తపస్ పాల్ తన ‘రేప్’ వ్యాఖ్యలపై బేషరతు క్షమాపణ చెప్పారు. తపస్ వ్యాఖ్యలపై కలత చెందిన పార్టీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ ఆయన్ను బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందిగా ఆదేశించడంతో పాల్ ఈ మేరకు పార్టీకి, మీడియాకు లేఖ రాశారు. ఎన్నికల ప్రచార వేడిలో చేసిన వ్యాఖ్యల ద్వారా బెంగాల్వాసులను, నియోజకవర్గ ప్రజలను, కుటుంబాన్ని తీవ్ర అసంతృప్తికి గురిచేశానన్నారు. ఇందుకుగానూ సమాజంలోని ప్రతిఒక్కరికీ ప్రత్యేకించి మహిళలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. కాగా, ఈ వివాదంపై భర్త తరఫున క్షమాపణ చెబుతున్నట్లు తపస్ భార్య అంతకుముందు పేర్కొన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలి.. సీపీఎం: తమ పార్టీ కార్యకర్తలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తపస్ పాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరింది. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ తెలిపారు. మరోవైపు తపస్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేయడంతోపాటు దీనిపై సీఎం మమత వివరణ ఇవ్వాలంటూ తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ బెంగాల్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం వాకౌట్ చేశారు. తపస్‌ను అరెస్టు చేయాలంటూ బీజేపీ మహిళా మోర్చా నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం కోల్‌కతాలో తపస్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఇంట్లోకి చొరబడితే నరికేయండి.. పేట్రేగిన మరో తృణమూల్ నేత తపస్ వ్యవహారం సద్దుమణగక ముందే మరో తృణమూల్ నేత సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంట్లోకి అపరిచితులు చొరబడితే నరికి చంపి బలి ఇవ్వాలంటూ బంకూరా జిల్లా తృణమూల్ చీఫ్ అరూప్ చక్రవర్తి పార్టీ కార్యకర్తలకు మంగళవారం సూచించారు. ‘‘మీ ఇంట్లోకి ఒకవేళ బయటి వ్యక్తులు చొరబడితే నరికి పారేయండి. బలివ్వండి. దీనిపై మీరు ఆందోళన చెందనక్కర్లేదు. ఆ సంగతి నేను చూసుకుంటా’’ అంటూ బంకూరాలో పేర్కొన్నారు. ఇంకేం చేయమంటారు.. చంపనా?: మమత తపస్ పాల్ అనుచిత వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెద్ద తప్పిదంగా అభివర్ణించారు. ఇందుకుగానూ ఆయన్ను పార్టీ మందలించిందని మంగళవారం కోల్‌కతాలో విలేకరుల సమావేశంలో చెప్పారు. పాల్ పంపిన క్షమాపణ లేఖ సరిపోదని...ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. అయితే ఆయనపై పార్టీ చర్యలు తీసుకుంటుందా? అని విలేకరులు ప్రశ్నించిగా మమత మండిపడ్డారు. ‘‘నన్ను ఇంకేం చేయమంటారు..ఆయన్ను చంపమంటారా?’’ అని ఆవేశంగా వ్యాఖ్యానించారు. -
మీ మహిళలను రేప్ చేయమంటా
-
మీ మహిళలను రేప్ చేయమంటా
సీపీఎంకు తృణమూల్ ఎంపీ తపస్ పాల్ బెదిరింపు కోల్‌కతా: తమ పార్టీకి చెందిన ఒక్క కార్యకర్తపై దాడి జరిగినా.. ప్రతిపక్ష సీపీఎం కార్యకర్తలను హతమారుస్తామని, వారి మహిళలపై అత్యాచారాలు చేయాలని తమ కార్యకర్తలకు పురికొల్పుతానని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘‘ఒక్క తృణమూల్ కార్యకర్తపై దాడి జరిగినా మిమ్మల్ని కాల్చిచంపుతా. మీరు తృణమూల్ కార్యకర్తల తల్లి, కూతుర్లను అవమానిస్తే.. నేను ఊరుకోను. అవసరమైతే మా మనుషులను మీ ఇంటికి పంపి.. మీ మహిళలపై అత్యాచారం చేయాలని చెపుతా’’ అని సీపీఎం నేతలను హెచ్చరిస్తూ తపస్ పాల్ చేసిన ప్రసంగం తాలూకూ వీడియోను ఓ స్థానిక టీవీ చానల్ ప్రసారం చేసింది. తపస్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఆయన వ్యాఖ్యలను లోక్‌సభ స్పీకర్ సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని, అనర్హుడిగా ప్రకటించాలని కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు డిమాండ్ చేశాయి. తపస్ వ్యాఖ్యలు దేశంలోని మహిళలందరినీ అవమానించడమే అని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకుంటామని, తపస్‌ను అరెస్ట్ చేయాలని, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ మమతా శర్మ డిమాండ్ చేశారు. కాగా, తృణమూల్ అధికార ప్రతినిధి డెరిక్ ఒబ్రయాన్ ఈ అంశంపై స్పందిస్తూ.. రెచ్చగొట్టేలా ఉన్న తపస్ వ్యాఖ్యలను తమ పార్టీ సమర్థించబోదని, ఆయన 48 గంటలలోపు వివరణ ఇవ్వాలని పార్టీ ఆదేశించినట్టు చెప్పారు.