టీఎంసీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో తృణవుూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్‌పాల్ మహిళల విషయుంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రగడ ఇంకా సద్దుమణగకముదే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే దీపక్ హల్దార్ నోరుజారారు. ప్రపంచం ఉన్నంతవరకు అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయని ఆయున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర దుమారం సృష్టించాయి. మహిళా హక్కుల సంఘాలు, విపక్షాలు ఆయునపై తీవ్రస్థారుులో విరుచుకుపడ్డాయి. బుధవారం ఆయున డైవుండ్ హార్బర్ వద్ద జరిగిన ఓ సమవేశంలో మాట్లాడుతూ, ‘గతంలో అత్యాచారాలు జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి.
ప్రపంచం ఉన్నంతవరకు అవి జరుగుతూనే ఉంటారు’ అని అన్నారు. అత్యాచారాలు సావూజిక రుగ్మత వంటివని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కరే ఈ సవుస్యను పరిష్కరించలేరని ఆయున పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై వివిధ వర్గాలు భగ్గుమనడంతో ఆయున క్షవూపణలు చెప్పాల్సి వచ్చింది. హల్దార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయుడం దురదృష్టకరమని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అన్నారు.
ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నాయుకత్వంలోని టీఎంసీ నేతలు పదేపదే ఇటువంటి వ్యాఖ్యలు చేయుడం దురదృష్టకరమని మహిళా హక్కుల నేత మమతా శర్మ అన్నారు. వుుఖ్యవుంత్రి ఇటువంటి విషయూలను పట్టించుకోవడం లేదని, ఇలాంటి ప్రజాప్రతినిధులను పార్టీనుంచి సస్పెండ్ చేయూలని డివూండ్ చేశారు. టీఎంసీ లో కూడా ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయుని సీపీఎం నేత రీతుబ్రాతా బెనర్జీ వివుర్శించారు.
ప్రపంచం ఉన్నంతకాలం రేప్‌లు జరుగుతాయి
Published Fri, Aug 29 2014 2:10 AM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
Advertisement
Advertisement