deepak haldar
-
ప్రపంచం ఉన్నంతకాలం రేప్‌లు జరుగుతాయి
టీఎంసీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో తృణవుూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్‌పాల్ మహిళల విషయుంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రగడ ఇంకా సద్దుమణగకముదే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే దీపక్ హల్దార్ నోరుజారారు. ప్రపంచం ఉన్నంతవరకు అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయని ఆయున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో తీవ్ర దుమారం సృష్టించాయి. మహిళా హక్కుల సంఘాలు, విపక్షాలు ఆయునపై తీవ్రస్థారుులో విరుచుకుపడ్డాయి. బుధవారం ఆయున డైవుండ్ హార్బర్ వద్ద జరిగిన ఓ సమవేశంలో మాట్లాడుతూ, ‘గతంలో అత్యాచారాలు జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి. ప్రపంచం ఉన్నంతవరకు అవి జరుగుతూనే ఉంటారు’ అని అన్నారు. అత్యాచారాలు సావూజిక రుగ్మత వంటివని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కరే ఈ సవుస్యను పరిష్కరించలేరని ఆయున పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై వివిధ వర్గాలు భగ్గుమనడంతో ఆయున క్షవూపణలు చెప్పాల్సి వచ్చింది. హల్దార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయుడం దురదృష్టకరమని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అన్నారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నాయుకత్వంలోని టీఎంసీ నేతలు పదేపదే ఇటువంటి వ్యాఖ్యలు చేయుడం దురదృష్టకరమని మహిళా హక్కుల నేత మమతా శర్మ అన్నారు. వుుఖ్యవుంత్రి ఇటువంటి విషయూలను పట్టించుకోవడం లేదని, ఇలాంటి ప్రజాప్రతినిధులను పార్టీనుంచి సస్పెండ్ చేయూలని డివూండ్ చేశారు. టీఎంసీ లో కూడా ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయుని సీపీఎం నేత రీతుబ్రాతా బెనర్జీ వివుర్శించారు. -
'భూమి ఉన్నన్నాళ్లు రేప్‌లు ఉంటాయి'
'అత్యాచారాలు ఇంతకు ముందు ఉన్నాయి, ఈరోజు ఉన్నాయి.. గట్టిగా చెప్పాలంటే భూమి ఉన్నన్నాళ్లు ఉంటూనే ఉంటాయి'.. ఇదీ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి ఉవాచ. డైమండ్ హార్బర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దీపక్ హల్దర్ ఓ బహిరంగ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే.. ప్రజల్లో అవగాహన కల్పించలన్నది మాత్రమే తన ఉద్దేశం తప్ప వేరేది కాదంటూ నాలుక కొరుక్కునే ప్రయత్నం చేశాడు. ''దయచేసి పాత్రికేయులు నా వ్యాఖ్యలను సందర్భరహితంగా తీసుకోవద్దు. నేనేమన్నాను? అత్యాచారాలను నేను సమర్థించలేదు. ఇది సామాజిక సమస్య అని, కేవలం ఒక్క మమతా బెనర్జీ మాత్రమే దీన్ని పరిష్కరించలేరని చెప్పాను. మనమంతా సమష్టిగా కృషిచేసి ఇలాంటివ జరగకుండా అడ్డుకోవాలి. మీరంతా దానిపై నిరసన తెలపాలి'' అని వివరించాడు. అయితే.. హల్దర్ వ్యాఖ్యలపై మాత్రం విపరీతమైన దుమారం రేగింది. తృణమూల్ నాయకులు పదే పదే అత్యాచారాలపై వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని, వాళ్ల మనస్తత్వాన్ని ఇది సూచిస్తుందని సీపీఎం నాయకుడు సుజన్ చక్రవర్తి విమర్శించారు. అసలు వాళ్లకు మాట్లాడటం ఎలాగో రాదని కాంగ్రెస్ నేత అబ్దుల్ మన్నన్ మండిపడ్డారు. ఇంతకుముందు కూడా అత్యాచారాలపై తృణమూల్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'సీపీఎం వాళ్లు మా కార్యర్తల వెంట్రుక మీద చెయ్యేసిన సరే.. వాళ్ల ఆడాళ్లను రేప్ చేయాలని మావాళ్లకు చెబుతాను' అని ఎంపీ తపస్ పాల్ ఇంతకుముందు అన్నారు.