మీ మహిళలను రేప్ చేయమంటా | Trying to rape your women says to congtrss mp | Sakshi
Sakshi News home page

మీ మహిళలను రేప్ చేయమంటా

Published Tue, Jul 1 2014 2:58 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

మీ మహిళలను రేప్ చేయమంటా - Sakshi

మీ మహిళలను రేప్ చేయమంటా

సీపీఎంకు తృణమూల్ ఎంపీ తపస్ పాల్ బెదిరింపు
 

కోల్‌కతా: తమ పార్టీకి చెందిన ఒక్క కార్యకర్తపై దాడి జరిగినా.. ప్రతిపక్ష సీపీఎం కార్యకర్తలను హతమారుస్తామని, వారి మహిళలపై అత్యాచారాలు చేయాలని తమ కార్యకర్తలకు పురికొల్పుతానని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘‘ఒక్క తృణమూల్ కార్యకర్తపై దాడి జరిగినా మిమ్మల్ని కాల్చిచంపుతా. మీరు తృణమూల్ కార్యకర్తల తల్లి, కూతుర్లను అవమానిస్తే.. నేను ఊరుకోను. అవసరమైతే మా మనుషులను మీ ఇంటికి పంపి.. మీ మహిళలపై అత్యాచారం చేయాలని చెపుతా’’ అని సీపీఎం నేతలను హెచ్చరిస్తూ తపస్ పాల్ చేసిన ప్రసంగం తాలూకూ వీడియోను ఓ స్థానిక టీవీ చానల్ ప్రసారం చేసింది. తపస్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి.

ఆయన వ్యాఖ్యలను లోక్‌సభ స్పీకర్ సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని, అనర్హుడిగా ప్రకటించాలని కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు డిమాండ్ చేశాయి. తపస్ వ్యాఖ్యలు దేశంలోని మహిళలందరినీ అవమానించడమే అని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకుంటామని, తపస్‌ను అరెస్ట్ చేయాలని, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ మమతా శర్మ డిమాండ్ చేశారు. కాగా, తృణమూల్ అధికార ప్రతినిధి డెరిక్ ఒబ్రయాన్ ఈ అంశంపై స్పందిస్తూ.. రెచ్చగొట్టేలా ఉన్న తపస్ వ్యాఖ్యలను తమ పార్టీ సమర్థించబోదని, ఆయన 48 గంటలలోపు వివరణ ఇవ్వాలని పార్టీ ఆదేశించినట్టు చెప్పారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement