న్యూఢిల్లీ: లైంగిక దాడికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేశ్ కుమార్ పై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మృతి ఇరానీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు సిగ్గు చేటని, అసలు మహిళ సాధికారత గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ తమ నేతపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. రాజకీయ నాయకుడై మహిళలను కించపరిచేలా మాట్లాడటం నిజంగా సిగ్గుచేటని ఆమె ఆక్షేపించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కర్ణాటక మాజీ స్పీకర్, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్‌కుమార్ రైతుల సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీలో సమయం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుండగా స్పీకర్‌ను ఉద్దేశించి ఆయన ఓ వ్యాఖ్య చేశారు.. ‘ఒక సామెత ఉంది, లైంగిక దాడి అనివార్యమైనప్పుడు ,పడుకుని ఎంజాయ్ చేయాలని అన్నారు. అసెంబ్లీ అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. దీంతో దిగివచ్చిన ఎమ్మెల్యే రమేశ్‌కుమార్ ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు.
చదవండి: వైరల్: అసెంబ్లీలో నోరు జారిన ఎమ్మెల్యే, ఏదో చెప్పబోయి మరేదో..
Comments
Please login to add a commentAdd a comment