
సాక్షి, భువనేశ్వర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కించిపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్స్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ పోలీసుశాఖ అధికారుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌పై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ ఫేస్‌బుక్‌లో కామెంట్స్ పెట్టాడు. దీనిపై యూపీ పోలీసు విభాగానికి ఫిర్యాదు అందింది. ఈ క్రమంలోనే అతని ఫేస్‌బుక్ ఖాతా వివరాలను సేకరించిన పోలీసులు ఒడిశాలోని కుసుంభీ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఒడిశా పోలీసుల అధికారుల సహాకారంతో శుక్రవారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 124ఏ (దేశద్రోహం) కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టింగులు పెడిత తప్పినిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. (ప్రధాని ట్విట్టర్ ఖాతా హ్యాక్)
Comments
Please login to add a commentAdd a comment