భువనేశ్వర్: వారంతా ఒడిశాలోని గంజామ్ జిల్లా జగన్నాథ్ ప్రసాద్ సమితికి చెందిన మహిళలు. వారు నిజంగా విజిల్ బ్లోవర్స్. తమ సమితి పరిధిలోని ఏ గ్రామంలోను 'బహిర్భూమికి'వెళ్లేందుకు ఎవరిని అనుమతించరు. ఎవరైనా చెంబు పట్టుకుని బహిర్భూమి కోసం 30 మందికి పైగా ఉన్న ఆ మహిళ విజిల్ బ్లోవర్స్ ప్రతి రోజు తెల్లవారుజామున 4 గంటలకు నుంచి 6 గంటల వరకూ, మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి 8గంటల వరకూ బహిర్భూమికి అవకాశం ఉన్న ప్రతి రోడ్డుపై ముగ్గురేసి నిఘావేస్తారు. తమ విజిల్స్ తో బెదరగొడతారు. తమ ఇంట్లో మరుగు దొడ్డి లేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే మరుగుదొడ్డి నిర్మాణానికి అవసరమైన సహాయం కూడా చేస్తారు. ఈ మధ్య వారికి ఓ కొత్త ఐడియా వచ్చి బహిర్భూమికి అవకాశం ఉన్న చోటల్లా వారు ప్రజలు పవిత్రంగా భావించే 'తులసి మొక్కలు'నాటుతున్నారు. వాటికి వారు తమ కాపల సందర్భంగా నీళ్లు పోస్తున్నారు. అవి పెరిగేందుకు తోడ్పడుతున్నారు. ఇప్పుడు వారి కొత్త స్కీమ్ బాగా పనిచేస్తోంది. ఇప్పుడు ఎవరూ బహిర్భూమికి వచ్చేందుకు సాహించడం లేదు. వారు ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం ఆశించకుండా పనిచేయడం సమితి ప్రాంతంలోని అన్ని గ్రామాల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది.
స్వచ్ఛ భారత్ పేరిట ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్భాటంగా పిలుపు ఇవ్వడానికి ముందు ఆ మహిళలు మేల్కొన్నారు. ఆరతి బెహార, అనసూయ సాహు, రాజ్యలక్ష్మి సేథి, అంబు బెహరా కలిసి'విజిల్ బాహినీ' పేరిట ఓ మహిళా దండును ఏర్పాటు చేశారు. ఇంతటితో పాటు ఇళ్ల పరిసరాలను, మొత్తం గ్రామం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. నలుగురైదుగురితో ప్రారంభమైన వారి ఉద్యమం సమితి ప్రాంతమంతి విస్తరించడంతో గ్రామస్థులు కూడా వారికి సహకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. విజిల్ బాహినీ దండు వివిధ స్వయం ఉపాధి కేంద్రాలను నుంచి మహిళలను చేర్చుకోవడం ప్రారంభించడంతో ఇప్పుడు వారి సంఖ్య30 ని దాటింది.
జగన్నాథ్ ప్రసాద్ సమితి గ్రామం ప్రధాన రోడ్డులో కూడా బహిర్భూమికి వెళ్లడం వల్ల ఆ వీధి గుండా ముక్కుమూసుకొనొ వెళ్లలంటే కష్టమయ్యేది. తమ ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లడం అతి సాధారణ విషయంగానే పంచాయతీ పరిగణించిందని, డీడీటి పౌడర్లు చల్లటం మినహా వారు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీని వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతున్న విషయాన్ని గ్రహిందచి తామే ఎందుకు చర్యలు తీసుకోకుడదనే ఆలోచనతోనే ఓ మహిళా దండును ఏర్పాటు చేశామని ఆరతి బెహార' విజిల్ బాహిని'పుట్టుక గురించి మీడియాకు వివరించారు. ఇందులో టాయ్ లెట్లు లేనివారి కోసం తాము వివిధ గ్రామాల్లో సామాజిక మరుగుదొడ్లను కట్టించామని ఆమె తెలిపారు. ఈ విషయంలో కేంద్ర పథకాలను కూడా ఉపయోగించుకుంటున్నామని ఆమె చెప్పారు.
యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారంలో భారత గ్రామీణ ప్రాంతాల్లో 88 శాతం మంది అతిసార వ్యాధి వల్ల మరణిస్తున్నారు.కలుషితమైన నీరు, పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం వల్లనే అతిసారం వ్యాధి వ్యాపిస్తుందన్నది తెల్సిందే.
ఆ మహిళలు నిజంగా 'విజిల్ బ్లోవర్స్'
Published Fri, Aug 14 2015 8:35 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM
Advertisement
Advertisement