సింగపూర్ అధ్యక్షుడు 'థర్మన్ షణ్ముగరత్నం' భారతదేశ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగానే భువనేశ్వర్‌లోని అంధరువాలోని ఒడిశా బయోటెక్ పార్క్‌లో భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ.. ప్రపంచంలోనే అతిపెద్దదిదైన వ్యాక్సిన్ తయారీ ప్లాంట్ సాపిజెన్ బయోలాజిక్స్‌ను సందర్శించారు. ఆయనతో పాటు మంత్రివర్గ నాయకులు, వ్యాపార వేత్తలు, ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది.
భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ ఎల్లా.. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుచిత్ర ఎల్లా, సాపిజెన్ బయోలాజిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాచెస్ ఎల్లా, డైరెక్టర్ డాక్టర్ జలచారి ఎల్లా, సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు అందరూ థర్మన్ షణ్ముగరత్నంను స్వాగతించారు.
సింగపూర్ అధ్యక్షులు వ్యాక్సిన్ తయారీ ప్లాంట్‌ను సందర్శించడం మాకు చాలా గౌరవంగా ఉంది. వ్యాక్సిన్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి.. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సుకు దోహదపడటానికి ఈ విశాలమైన మల్టీ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రంలో జరుగుతున్న వినూత్న పనిని ప్రదర్శించడానికి మేము గర్విస్తున్నామని డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు. ఈ సందర్భంగా ఒడిశా ప్రభుత్వం, భారత ప్రభుత్వం, నియంత్రణ సంస్థలతో పాటు వారి బృందాలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రూ. 1500 కోట్ల పెట్టుబడితో స్థాపించిన ఈ ప్లాంట్ సంవత్సరానికి 8 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ 10 వేర్వేరు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సదుపాయం ద్వారా 2,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు & 1,500 పరోక్ష ఉపాధి అవకాశాలను పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment