
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభం అయ్యాయి. మంగళవారం సమావేశాలు ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ సభాపతి తమ్మినేని సీతారాం దిశ చట్టాన్ని అమోదించిన సభకు అభినందనలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయన్నారు. దిశ చట్టం ప్రతులను పంపాలని ఒడిశా ప్రభుత్వం తమను కోరినట్లు స్పీకర్ తెలిపారు. చట్టాన్ని యధాతథంగా అమలు చేస్తామని ఆ ప్రభుత్వం చెప్పినట్టు సభలో వెల్లడించారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం కూడా చట్టం గురించి తమను సంప్రదించిందని స్పీకర్ తెలిపారు. దిశ చట్టం ఆమోదించడం అసెంబ్లీకి గర్వకారణమన్నారు. ఈ చట్టంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోందన్నారు. అనంతరం చట్టంపై పలువురు సభ్యులు ప్రసంగించారు. మహిళలకు భద్రత కల్పించేందుకు దిశ చట్టాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌హన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాగా అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment