ఒడిశా రాష్ట్రం నుంచి తెలగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు తరలిస్తున్న రూ.8 లక్షల విలువైన 160 కిలోల గంజాయిని మోతుగూడెం పోలీసులు ఆదివారం ఉదయం పట్టుకున్నారు. చింతూరు సీఐ‡కె.దుర్గాప్రసాద్, ఎస్సై ఎం.పండుదొర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గంజాయి రవాణా చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు పొల్లూరు వై.జంక్షన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు.
160 కిలోల గంజాయి పట్టివేత
Sep 11 2016 11:26 PM | Updated on Aug 21 2018 5:54 PM
మోతుగూడెం : ఒడిశా రాష్ట్రం నుంచి తెలగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు తరలిస్తున్న రూ.8 లక్షల విలువైన 160 కిలోల గంజాయిని మోతుగూడెం పోలీసులు ఆదివారం ఉదయం పట్టుకున్నారు. చింతూరు సీఐ‡కె.దుర్గాప్రసాద్, ఎస్సై ఎం.పండుదొర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గంజాయి రవాణా చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు పొల్లూరు వై.జంక్షన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. సీలేరు నుంచి వచ్చిన కారు క్షుణ్ణంగా పరిశీలించగా, అందులో 160 కిలోల గంజాయి లభ్యమైంది. దీనిని తరలిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన మరిసె నూకరాజు, తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా జుజ్జూరు తండాకు చెందిన జాటోతు ఆశోక్, జాటోతు వెంకన్న దారవతు ప్రసాద్, విశాఖ జిల్లా సీలేరు చెందిన మహ్మద్ నయా్మద్, ఆలీని అరెస్టు చేశారు.
Advertisement
Advertisement