ganjayi
-
గంజాయి స్మగ్లింగ్ చేశాను.. పోలీసులకు దొరక్కుండా బోర్డర్ దాటించా: కోన వెంకట్
ప్రముఖ రచయిత కోన వెంకట్‌కి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. నిన్నుకోరి, జై లవకుశ సహా ఎన్నో హిట్ సినిమాలకు ఆయన పనిచేశారు. ఓ వైపు రైటర్‌గా పనిచేస్తూనే, మరోవైపే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. కాలేజీ రోజుల్లో గంజాయి స్మగ్లింగ్ చేశానంటూ రివీల్ చేశారు. ''ఆర్థికసమస్యల వల్ల అప్పుల్లో కూరుకుపోయిన నా ఫ్రెండ్ ఒకడు దాన్నుంచి బయటపడేందుకు గంజాయి పండించాడు. ఆ మొత్తాన్ని గోవాకి తరలించి అప్పులన్నీ తీర్చేద్దామనుకున్నాడు. కానీ దారిలో పోలీసులకు దొరికిపోయాడు. ఇంక అంతా అయిపోందనుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. చావుబతుకుల్లో ఉన్నప్పుడు మాకు విషయం తెలిసి ఎలాగైనా వాడి అప్పులు తీర్చాలని డిసైడ్ అయ్యాం. మా నాన్న అప్పుడు డీఎస్పీ కావడంతో ఆయన కారులోనే గంజాయి అమ్మేందుకు గోవా వెళ్లాం. మహబూబ్‌నగర్, కర్ణాటక, గోవా ఇలా 3 చెక్ పోస్టులు పగడ్బందీగా దాటించి గంజాయి అమ్మి డబ్బులు తీసుకొచ్చాం. దాంతో నా స్నేహితుడి అప్పులన్నీ తీర్చేశాం. కానీ ఒకవేళ దొరికిపోతే మా పరిస్థితి ఏంటి అని చాలాసార్లు ఆలోచిస్తుంటాను. మా రియల్ లైఫ్‌లో జరిగిన ఈ స్టోరీనే సినిమాగా తీయాలని అనుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు.. స్నేహితుడికి సహాయం చేయడం మంచిదే కానీ ఇలా గంజాయి స్మగ్లింగ్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. -
నల్గొండ జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం
-
160 కిలోల గంజాయి పట్టివేత
మోతుగూడెం : ఒడిశా రాష్ట్రం నుంచి తెలగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు తరలిస్తున్న రూ.8 లక్షల విలువైన 160 కిలోల గంజాయిని మోతుగూడెం పోలీసులు ఆదివారం ఉదయం పట్టుకున్నారు. చింతూరు సీఐ‡కె.దుర్గాప్రసాద్, ఎస్సై ఎం.పండుదొర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గంజాయి రవాణా చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు పొల్లూరు వై.జంక్షన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. సీలేరు నుంచి వచ్చిన కారు క్షుణ్ణంగా పరిశీలించగా, అందులో 160 కిలోల గంజాయి లభ్యమైంది. దీనిని తరలిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన మరిసె నూకరాజు, తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా జుజ్జూరు తండాకు చెందిన జాటోతు ఆశోక్, జాటోతు వెంకన్న దారవతు ప్రసాద్, విశాఖ జిల్లా సీలేరు చెందిన మహ్మద్ నయా్మద్, ఆలీని అరెస్టు చేశారు. -
గంజాయితో ఇద్దరి అరెస్టు
పలాస : ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కొనమర్రి గ్రామానికి చెందిన తళియాడు పవిత్రదొర, అతని భార్య తళియాడు ఈశ్వరిదొరలను 10 కిలోల గంజాయితో అరెస్టు చేశామని పలాస జీఆర్పీ ఎస్ఐ కె.మధుసూదనరావు బుధవారం చెప్పారు. వీరు గంజాయిని ముంబై తీసుకు వెళ్లేందుకు పలాస రైల్వేస్టేషన్లో నిరీక్షిస్తుండగా పట్టుకున్నామని ఆయన చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు. వీరిని విశాఖపట్నం కోర్టులో హాజరుపరుస్తామని ఎస్ఐ చెప్పారు. పర్లాఖిముండికి చెందిన విజయమండల్ను నాలుగు కిలోల గంజాయితో బుధవారం అరెస్టు చేశామని కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్ చెప్పారు. నిందితుడు కాశీబుగ్గ సాయిబాబా గుడి దగ్గర ఒక సూట్ కేసు పట్టుకొని నిల్చుని ఉండగా అటుగా వెళ్తున్న కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్, ఎస్ఐ కె.వి.సురేష్, సిబ్బంది అనుమానంతో ఆ సూట్æకేసును తనిఖీ చేశారు. దీంతో సూట్‌కేసులో నాలుగు కిలోల గంజాయి దొరికిందని సీఐ చెప్పారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి, గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీఐ చెప్పారు. -
575 కేజీల గంజాయి పట్టివేత
విశాఖపట్టణం(రోలుగుంట): కారులో తరలిస్తున్న 575 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రోలుగుంట మండలం కోసర్లపుడి వద్ద స్పెషల్ పార్టీ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి తరలింపు విషయం బయటపడింది. దీంతో సదరు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కారును సీజ్‌చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.1.15లక్షల విలువ చేస్తుందని సమాచారం.