విశాఖపట్టణం(రోలుగుంట): కారులో తరలిస్తున్న 575 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రోలుగుంట మండలం కోసర్లపుడి వద్ద స్పెషల్ పార్టీ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి తరలింపు విషయం బయటపడింది. దీంతో సదరు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కారును సీజ్‌చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.1.15లక్షల విలువ చేస్తుందని సమాచారం.