
భువనేశ్వర్: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన కలహండి జిల్లా భవానీపాట్నా సమీపంలో జాతీయ రహదారి 26పై బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment