భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ సమాధిని తొలగించాని నిర్ణయించారు. సీఎం నిర్ణయం వెలువడిన గంటల వ్యవధిలోనే ఆదేశాలను జారీ చేశారు. బిజూ పట్నాయక్ సమాధి సహా, ఆయన జ్ఞాపకార్థం కోసం ఏర్పాటు చేసిన స్మారక కేంద్రాన్ని కూడా తొలగించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన పూరి పుణ్యక్షేత్రంలో బిజూ పట్నాయక్ సమాధి ఉంది. స్వర్గద్వార్ అనే పేరుతో బిజూ స్మారక కేంద్రం, శ్మశాన వాటికను అక్కడ ఏర్పాటు చేశారు.
అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలంటూ గత కొంత కాలంగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బిజూ పట్నాయక్ సమాధి ఉండటం వల్ల దాన్ని తొలగించడం అసాధ్యమని, శ్మశాన వాటికను అభివృద్ధి చేయడం దాదాపు అసాధ్యమంటూ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అధికారులతో సమావేశమైన సీఎం.. సమస్య పరిష్కారం కోసం ఏమైనా చేయాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా తన తండ్రి సమాధిని, స్మారక కేంద్రాన్ని తొలగించాలని ఆదేశించారు. పట్నాయక్ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment