
జే పాండా (ఫైల్ ఫోటో)
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడతున్నారంటూా ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు..
భువనేశ్వర్ : బీజూ జనతాదళ్ మాజీ ఎంపీ జే పాండా హెలికాప్టర్‌ను అధికారులు సీజ్ చేశారు. గగనతల నిబంధనలు ఉల్లఘించారన్న ఆరోపణలతో ఆయన హెలికాప్టర్‌ను మంగళవారం సీజ్ చేసినట్లు పూరి పోలీసులు వెల్లడించారు. భువనేశ్వర్ సమీపంలోని చిలికా సరస్సు వద్ద నిషేధిత వాతవరణ జోన్‌లో ఆయన చాపర్‌ను నడిపారని పోలీసులు తెలిపారు. చిలికా సరస్సు ప్రాంతంలో అతి తక్కువ ఎత్తులో హెలికాఫ్టర్ ప్రయాణించిందని ఫారెస్ట్ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారించి సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
చాపర్ సీజ్ చేయడంతో పాటు అతనిపై కేసు కూడా నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కాగా బీజూ జనతాదళ్‌కు చెందిన జే పాండా ఇటీవల పార్టీకి, ఎంపీ పదవికి రాజనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడతున్నారంటూ పాండాను అంతకు ముందే పార్టీ నుంచి బహిష్కరించారు.