Jay Panda
-
మాజీ ఎంపీ హెలికాప్టర్ సీజ్..!
భువనేశ్వర్ : బీజూ జనతాదళ్ మాజీ ఎంపీ జే పాండా హెలికాప్టర్‌ను అధికారులు సీజ్ చేశారు. గగనతల నిబంధనలు ఉల్లఘించారన్న ఆరోపణలతో ఆయన హెలికాప్టర్‌ను మంగళవారం సీజ్ చేసినట్లు పూరి పోలీసులు వెల్లడించారు. భువనేశ్వర్ సమీపంలోని చిలికా సరస్సు వద్ద నిషేధిత వాతవరణ జోన్లో ఆయన చాపర్‌ను నడిపారని పోలీసులు తెలిపారు. చిలికా సరస్సు ప్రాంతంలో అతి తక్కువ ఎత్తులో హెలికాఫ్టర్ ప్రయాణించిందని ఫారెస్ట్ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారించి సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. చాపర్ సీజ్ చేయడంతో పాటు అతనిపై కేసు కూడా నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కాగా బీజూ జనతాదళ్‌కు చెందిన జే పాండా ఇటీవల పార్టీకి, ఎంపీ పదవికి రాజనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడతున్నారంటూ పాండాను అంతకు ముందే పార్టీ నుంచి బహిష్కరించారు. -
‘పార్టీ నుంచి శాశ్వతంగా తొలగిపోతున్నా’
భువనేశ్వర్: పార్టీనుంచి శాశ్వతంగా తొలగిపోతున్నట్లు బీజ్ జనతాదళ్ ఎంపీ జే పాండా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌కు బావోద్వేగంతో లేఖ రాశారు. సీఎంతో విభేదాల కారణంగా పాండాను జనవరిలోనే పార్టీ నుంచి డిస్మిస్ చేస్తున్నట్లు బీజేడీ ప్రకటించింది. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న పాండా సోమవారం పార్టీ నుంచి శాస్వతంగా తొలగిపోతున్నట్లు నవీన్ పట్నాయక్‌కు లేఖ ద్వారా తెలియజేశారు. తనకు ఇష్టం లేకున్నా బరువైన హృదయంతో్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారే ముఖ్యమైన స్థానంలో ఉన్నారని, వారి నుంచి పార్టీని కాపాడాలని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బీజేపీతో సంబందాలు ఉన్నాయన్న కారణంతో పాండాను పార్టీని నుంచి బహిష్కరించామని బీజేడీ పేర్కొంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా పాండా బీజేపీ మద్దతు తెలిపారని, కనీసం తన నియోజకవర్గంలో కూడా పార్టీ తరుఫున ప్రచారం చేయలేదని బీజేడీ విమర్శిస్తోంది. -
బీజేడీ నేత జే పాండా పార్టీకి రాజీనామ
-
‘బుల్లెట్లు కూడా నన్ను పడగొట్టలేవ్’
న్యూఢిల్లీ: ‘గుడ్లు, రాళ్లు మర్చిపోండి.. వాళ్లు బుల్లెట్లు నాపై ప్రయోగించినా కూడా ఏమీ చేయలేరు’అనే బిజు జనతాదల్ పార్టీ నేత, పార్లమెంటు సభ్యుడు జై పాండా (53)అన్నారు. మంగళవారం తన నియోజకవర్గంలో ఓ నీటి శుద్ధి ప్లాంటును ప్రారంభించేందుకు వచ్చిన ఆయనపై అదే పార్టీకి చెందిన కొంతమంది ఆయన వ్యతిరేక వర్గానికి చెందినవారు రాళ్లు, గుడ్లతో దాడులు చేశారు. దీంతో పాండా వర్గం వాళ్లు కూడా ప్రత్యర్థులపై దాడులకు దిగారు. ఈ నేపథ్యంలోనే ‘రాళ్లు, కోడిగుడ్లు ప్రత్యర్థులపై విసరడం మర్చిపోవాలి. వారు తనపై బుల్లెట్లు ప్రయోగించినా ఏం కాదు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. బీజేపీతో చేతులు కలిపి సొంత పార్టీని చీల్చే కుట్రలు చేస్తున్నారంటూ పాండాపై బీజేడీ నాయకుడు తథాగత సత్పతి తీవ్ర ఆరోపణలు చేశారు. పరిణామాలు కూడా అలాగే కనిపించడంతో ఆయనను పార్టీ అధికారిక ప్రతినిథి బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో నేరుగా సొంతపార్టీపైనా, పార్టీ అధినాయకుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌పై కూడా పాండా రెచ్చిపోయి మాటలన్నారు. నిజనిజాలు తెలుసుకోకుండా తనపై చర్యలు తీసుకున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్పటి నుంచి బీజేడీలోనే రెండు అనుకూల వ్యతిరేక వర్గాలు ఏర్పడి నిత్యం వార్తల్లో ఉండేలా చేస్తున్నాయి. -
‘ఎందుకు తప్పించారో తెలియదు’
భువనేశ్వర్: బిజూ జనతాదళ్(బీజేడీ) పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి ఎందుకు తొలగించారో తనకు తెలియదని ఆ పార్టీ ఎంపీ బైజయంత్ పాండా తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడి నిర్ణయాన్ని గౌరవిస్తానని అన్నారు. అధికార ప్రతినిధి పదవి నుంచి పాండాను శుక్రవారం ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ తొలగించారు. పార్టీని ఇబ్బంది పెట్టేవిధంగా పత్రికల్లో ఆయన రాసిన వ్యాసాలు రాసినందుకు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఆయనపై చర్య తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. సీనియర్ నాయకుల్లో కొంత మంది బీజేపీ తరపున పనిచేస్తున్నారని, పార్టీని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని పాండా పేర్కొనడంతో కలకలం రేగింది. దీంతో పార్టీ పదవి నుంచి పాండాను నవీన్ పట్నాయక్ తొలగించారు.