మొర్సపూడి(నూజివీడు రూరల్), న్యూస్‌లైన్ : ఉపాధి కోసం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి విద్యుదాఘతానికి గురై దుర్మరణం చెందాడు. మండలంలోని మోర్సపూడిలో శనివారం ఈ ఘటన జరిగింది. రూరల్ ఎస్సై బోనం ఆదిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో జరుగుతున్న రోడ్డు అభివృద్ధి పనుల్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన భీమా(33) పాల్గొంటున్నాడు. మొర్సపూడిలో జరుగుతున్న పనుల్లో భాగంగా శనివారం కర్రకు కట్టిన స్కేలు తో ఎత్తుపల్లంగా ఉన్న చోట్ల కొలుస్తున్నాడు.
ఆ సమయంలో పైనున్న విద్యుత్‌వైరు తగల డంతో షాక్‌కు గురయ్యాడు. తోటి పనివారు అతడిని హుటాహుటిన నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొం దుతూ కొంతసేపటికి మృతి చెందాడు. ఈ ఘ ట నపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై పే ర్కొన్నారు. పొట్ట కూ టి కోసం భీమా దూ రప్రాంతం నుంచి వచ్చి ప్రాణాలు కోల్పో యాడంటూ తోటి పనివారు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాం తంలో విషాదం నెలకొంది.