భువనేశ్వర్: ఐదోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. అలాగే మంత్రులందరూ ప్రతినెల అమలు చేసిన పథకాల గురించి తనకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. ప్రతినెల ఏడు తేదీన మంత్రులందరూ రిపోర్టు పత్రాలను సీఎంవో కార్యాలయానికి పంపాలన్నారు. ఈమేరకు ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఏర్పాటు చేసిన తొలి మంత్రిమండలి సమావేశంలో మంత్రులకు దిశానిర్ధేశం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలు (మేనిఫెస్టో)ను ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ నేతృత్వంలోని బీజూజనతాదళ్ అద్బుత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే .రాష్ట్రంలోని 142 స్థానాలకు గాను 112 స్థానాలను గెలుపొంది.. వరుసగా ఐదోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయంలో ఆయనకెంతో దోహదం చేసిన సంక్షేమ పథకాలను పకడ్భందీగా అమలుచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను, అధికారులను నవీన్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment