ఏవోబీలో మళ్లీ తుపాకుల మోత | Firing Between Police And Maoist In AOB Area | Sakshi
Sakshi News home page

ఏవోబీలో మళ్లీ తుపాకుల మోత

Published Thu, Jul 16 2020 8:33 PM | Last Updated on Thu, Jul 16 2020 8:33 PM

Firing Between Police And Maoist In AOB Area - Sakshi

ఫైల్‌ఫోటో

సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దుల్లో (ఏవోబీ) మరోసారి తుపాకుల మోత మోగింది. ఒరిస్సాలోని ముకుడుపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు చోటుచుసుకున్నాయి. సిబ్బంది రాకను ముందే పసిగట్టిన మావోయిస్టులు చాకచాక్యంగా తప్పించుకోగలిగారు. వారి కోసం అటవీ ప్రాంతంలో కూబింగ్‌ కొనసాగుతోంది. ఘటనా స్థలంలో మావోయిస్టులకు చెందిన కిట్‌బ్యాగ్స్‌, తుపాకీలు, బాంబుల తయారీకి ఉపయోగించి సామాగ్రీ లభ్యమయ్యాయి. తప్పించుకున్న మావోయిస్టుల కోసం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపు గాలింపు చేపడుతున్నారు. కాగా ప్రశాంతంగా ఉన్న  ఏవోబీ సరిహద్దుల్లో గతకొంత కాలం నుంచి మావోయిస్టుల అలజడి  వినిపిస్తోంది. దీంతో ఎజెన్సీ గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement