కొరాపుట్(ఒడిశా): ఒడిశాలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ చెరువు వద్దకు వెళ్లిన నలుగురు చిన్నారులు నీట మునిగి మృతిచెందారు. కొరాపుట్ జిల్లా పరాజ ఖుడుపి గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మి, సుశాంత, సంజయ్, సబితా అనే చిన్నారులు( అంతా తొమ్మిదేళ్లలోపు వారే) ఆడుకుంటూ చెరువు జారి పడిపోయారు.
చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో వారు నీట మునిగి చనిపోయారు. మంగళవారం ఉదయం వారి మృతదేహాలను వెలికితీశారు. అయితే, చిన్నారులు ప్రమాదవశాత్తు చనిపోయారా లేక కావాలనే ఎవరైనా వారిని చంపారా అనే దానిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు కొరాపుట్ ఏఎస్పీ వీఆర్ రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment