కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ రాజ్‌భవన్‌లో ఓ కాంట్రాక్టు మహిళా ఉద్యోగిని వేధించినట్లు గత వారం పోలీసులకు ఫిర్యాదు అందింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. తనపై ఇలాంటి ఆరోపణలు వచ్చిన తర్వాత ఎందుకు రాజీనామా చేయకూడదో బోస్ వివరించాలి కోరారు.
టీఎంసీ హుగ్లీ అభ్యర్థి రచనా బెనర్జీకి మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. గవర్నర్ సివి ఆనంద బోస్‌ను నిందించారు. బోస్ గవర్నర్‌గా కొనసాగే వరకు రాజ్‌భవన్‌లోకి అడుగు పెట్టనని కూడా ఆమె తేల్చిచెప్పారు. గవర్నర్ దాదాగిరి ఇక చెల్లదని పేర్కొన్నారు.
గవర్నర్ మీద ఆరోపణలు వచ్చిన తరువాత రాజ్‌భవన్‌లోని పలు సీసీటీవీ ఫుటేజీలను పరీక్షించారు. అవన్నీ గవర్నర్ ఎడిట్ చేసిన వీడియోను విడుదల చేశారని, నేను మొత్తం ఫుటేజీని చూశాను. అవన్నీ షాకింగ్‌గా ఉన్నాయని అన్నారు. మీ ప్రవర్తన సిగ్గుచేటు అని ముఖ్యమంత్రి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment