పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 'మమతా బెనర్జీ' (Mamata Banerjee) రాష్ట్రంలో తమ పార్టీ ఆధిపత్యాన్ని గురించి వివరిస్తూ.. 'ఎన్నికలు రావచ్చు, పోవచ్చు' కానీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం అధికారాన్ని కొనసాగిస్తుందని ఉద్ఘాటించారు.
తూర్పు మేదినీపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతుందని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు నినాదాలు చేసే వారు కూడా రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ తప్పకుండా అధికారంలో కొనసాగుతుందని గుర్తుంచుకోవాలని అన్నారు.
ఎన్నికల సమయంలో ఢిల్లీ నుంచి కొందరు వస్తుంటారు, ఎన్నికలు అయిన తరువాత మళ్ళీ కన్పించరని, ఎవరైనా చనిపోయినా రారు అని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు.
ఇదిలావుండగా.. లోక్‌సభ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాయ్ ఆదివారం తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు గౌరవం లేదని భావించి రాజీనామా చేసినట్లు రాయ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment