తెలుగులో ఒకప్పుడు హీరోయిన్‌గా చేసి, ఇప్పుడు సీరియల్స్‌లో నటిస్తున్న నటికి లోక్‌సభ ఎన్నికల్లో సీటు దక్కింది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలకు సంబంధించిన హడావుడి మొదలైపోయింది. తాము రాష్ట్రంలో ఒంటరిగానే బరిలో దిగుతున్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. మొత్తం 42 స్థానాలకు గానూ ఎవరెవరు పోటీ చేస్తున్నారనే విషయమై క్లారిటీ ఇచ్చేశారు. ఇందులోనే ప్రముఖ నటికి అవకాశం దక్కడం చర్చనీయాంశమైంది.
(ఇదీ చదవండి: పూనమ్ కౌర్ ట్వీట్.. సీఎం జగన్ సాయం మరోసారి తెరపైకి)
తెలుగులో 'బావగారు బాగున్నారా!', 'కన్యాదానం', 'మావిడాకులు' చిత్రాల్లో నటించిన రచన బెనర్జీ.. తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. ఇప్పుడు ఈమెకే మమతా బెనర్జీ టికెట్ కేటాయించారు. హుగ్లీ నుంచి నటి రచనా బెనర్జీ బరిలోకి దిగనున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో బసిర్హాట్ నుంచి గెలిచిన హీరోయిన్ నుస్రత్ జహాన్‌కు ఈసారి మొండిచేయి ఎదురైంది. సందేశ్ ఖాలీ వివాదమే ఇందుకు కారణం.
(ఇదీ చదవండి: లోక్‌సభ ఎన్నికల బరిలో టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్)
Comments
Please login to add a commentAdd a comment