tmc party
-
లోక్‌సభ ఎన్నికల బరిలో టాలీవుడ్ హీరోయిన్.. ఆ స్థానంలో పోటీ?
తెలుగులో ఒకప్పుడు హీరోయిన్గా చేసి, ఇప్పుడు సీరియల్స్‌లో నటిస్తున్న నటికి లోక్‌సభ ఎన్నికల్లో సీటు దక్కింది. తాజాగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు సంబంధించిన హడావుడి మొదలైపోయింది. తాము రాష్ట్రంలో ఒంటరిగానే బరిలో దిగుతున్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. మొత్తం 42 స్థానాలకు గానూ ఎవరెవరు పోటీ చేస్తున్నారనే విషయమై క్లారిటీ ఇచ్చేశారు. ఇందులోనే ప్రముఖ నటికి అవకాశం దక్కడం చర్చనీయాంశమైంది. (ఇదీ చదవండి: పూనమ్ కౌర్ ట్వీట్.. సీఎం జగన్ సాయం మరోసారి తెరపైకి) తెలుగులో 'బావగారు బాగున్నారా!', 'కన్యాదానం', 'మావిడాకులు' చిత్రాల్లో నటించిన రచన బెనర్జీ.. తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. ఇప్పుడు ఈమెకే మమతా బెనర్జీ టికెట్ కేటాయించారు. హుగ్లీ నుంచి నటి రచనా బెనర్జీ బరిలోకి దిగనున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో బసిర్హాట్ నుంచి గెలిచిన హీరోయిన్ నుస్రత్ జహాన్‌కు ఈసారి మొండిచేయి ఎదురైంది. సందేశ్ ఖాలీ వివాదమే ఇందుకు కారణం. (ఇదీ చదవండి: లోక్‌సభ ఎన్నికల బరిలో టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్) -
సందేశ్‌ఖాలీలో మళ్లీ ఉద్రిక్తత.. అప్రమత్తమైన పోలీసులు!
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఉత్తర 24 పరగణా జిల్లాలోని బసిర్హాట్ సబ్ డివిజన్లో ఉన్న సందేశ్‌ఖాలీలో బుధవారం అర్ధరాత్రి మరోమారు ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. సందేశ్‌ఖలీలో రైతులు, పేదల భూములను టీఎంసీ నాయకులు ఆక్రమించారని, మహిళలను లైంగికంగా వేధించారనే ఆరోపణలున్నాయి. టీఎంసీ నేతల వేధింపులకు వ్యతిరేకంగా మహిళలు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా ఈ నిరసనల్లోకి దిగింది. టీఎంసీ నేత షాజహాన్తో సహా నిందితులందరినీ అరెస్టు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాగా సందేశ్‌ఖాలీలో కొనసాగుతున్న హింసాకాండ కారణంగా మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతోందంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీసు చీఫ్‌కి నోటీసు పంపింది. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాలోని సందేశ్‌ఖాలీలో ఒక రాజకీయ నేత మద్దతుదారులు పేద మహిళలను హింసించారని ఆరోపిస్తూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన నివేదికలను ఎన్హెచ్ఆర్సీ స్వీకరించింది. సందేశ్‌ఖాలీలో ఇటీవల జరిగిన సంఘటనలు దిగ్భ్రాంతికి గురిచేసేలా మానవ హక్కుల ఉల్లంఘనలను సూచిస్తున్నాయని కమిషన్ పేర్కొంది. ఈ ఘటనల్లో పాలుపంచుకున్నవారిపై చేపట్టిన చర్యలకు సంబంధించి నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ పోలీసు డైరెక్టర్ జనరల్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసు జారీ చేసింది. -
ప్రశ్నలడిగేందుకు లంచం తీసుకున్నారు
న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నారంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఆరోపించారు. తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన, కాంటెంప్ట్ ఆఫ్ హౌస్, నేరంగా ఆయన పేర్కొన్నారు. మొయిత్రా, వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకుంటున్నట్లు ఉన్న తిరుగులేని సాక్ష్యాలను ఒక న్యాయవాది తనతో పంచుకున్నారని దూబే చెప్పారు. ‘అదానీ గ్రూప్ లక్ష్యంగా ఇప్పటి వరకు ఆమె లోక్‌సభలో ఇప్పటి వరకు 50 నుంచి 61 వరకు ప్రశ్నలడిగారు. 12 డిసెంబర్ 2005 నాటి ‘క్యాష్ ఫర్ క్వెరీ’ వ్యవహారాన్ని గుర్తుచేసే విధంగా పార్లమెంట్లో ప్రశ్నలు అడగడం ద్వారా వ్యాపారవేత్త శ్రీ దర్శన్ హీరానందానీ వ్యాపార ప్రయోజనాలను కాపాడేందుకు మహువా మోయిత్రా పన్నిన నేరపూరిత కుట్ర అనేందుకు ఎలాంటి సందేహం లేదు. విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఈ ఆరోపణల్లో నిగ్గు తేల్చాలి’అని ఆయన స్పీకర్ బిర్లాను కోరారు. దీనిపై మొయిత్రా ఘాటుగా స్పందించారు. ముందుగా దుబేపై పెండింగ్‌లో ఉన్న ఆరోపణలపై స్పీకర్ చర్యలు తీసుకున్నాక తనపై చర్యలకు ఉపక్రమిస్తే సంతోషిస్తానని ఆమె అన్నారు. ‘నకిలీ డిగ్రీ పట్టావాలా, ఇతర బీజేపీ ప్రముఖులపై పెండింగ్‌లో ఉన్న ఉల్లంఘనలు చాలానే ఉన్నాయి. స్పీకర్ వాటిని పరిష్కరించిన వెంటనే నాకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేయిస్తే స్వాగతిస్తా’అంటూ ఆమె ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. రెండు పార్టీలకు చెందిన ఈ ఎంపీల మధ్య పార్లమెంట్‌లోనూ తరచూ వాదోపవాదాలు జరుగుతుంటాయి. -
మమతా బనెర్జీ ఏం చేస్తుందో చూడండి..!
-
‘ఆమె కాలనాగు, పనికిరాని ఆర్థికమంత్రి’
కోల్‌కతా : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మల నాశనం చేశారని ఆరోపించారు. ఇలాంటి పనికిరాని ఆర్థికమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఆమె ఓ కాలనాగు అని, పాము కాటుకు మనునుషులు చనిపోయినట్లుగా, నిర్మల ఆర్థిక వ్యవహారాల కారణంగా సామాన్య జనం చనిపోతున్నారని మండిపడ్డారు. పెంట్రోల్ ధరల పెంపుకు నిరసనగా ఆదివారం బంకురా జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికమంత్రి పదవికి నిర్మల వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైల్వేలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆయన వ్యతిరేకించారు. కాగా, టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. తన పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పట్టు కోల్పోయారని రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విమర్శించారు. టీఎంసీ ప్రభుత్వంలో అవినీతి ఘోరంగా పెరిగిపోయిందని, కిందిస్థాయి నేతల నుంచి పెద్దస్థాయి నేతల వరకు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. టీఎంసీలో అంతర్గత వైరుధ్యం మొదలైందని, దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.ఇలాంటి వ్యాఖ్యలకు తాము పెద్దగా ప్రాధాన్యత ఇవ్వమని, నిరాశతో ఇలాంటి అర్ధంలేని మాటలు చెబుతున్నారని దిలీప్ వ్యాఖ్యానించారు. -
పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా
పార్లమెంట్‌లోని ఉభయ సభలలో సమైక్యాంధ్ర నినాదాలు శుక్రవారం మారుమ్రోగాయి. దాంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభను మధ్యాహ్నం 12.00 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు.లోక్‌సభ ప్రారంభం కాగానే సీమాంధ్రకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర ప్రాంత ఎంపీలు పెద్దపెట్టున్న నినాదాలు చేశారు. ఆ క్రమంలో స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. పార్లమెంట్ పై తీవ్రవాదులు దాడి చేసి నేటితో 12 ఏళ్లు పూర్తి అయింది. ఈ సందర్బంగా ఆ దాడి ఘటనలో అమరులైన జవాన్లకు లోక్‌సభ ఘనంగా నివాళులు అర్పించింది. అయితే మహిళ న్యాయవాదిపై లైంగిక వేధింపులకు పాల్పడిన జస్టిస్ గంగూలీని వెంటనే పదవి నుంచి తొలగించాలని తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. వారితో బీజేపీ సభ్యులు గొంతుకలిపారు. అటు సీమాంధ్ర ఎంపీల నినాదాలు, ఇటు తృణమూల్, బీజేపీ సభ్యుల నినాదాలతో లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో మధ్యాహ్నం 12.00 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు.