న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నారంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఆరోపించారు. తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన, కాంటెంప్ట్ ఆఫ్ హౌస్, నేరంగా ఆయన పేర్కొన్నారు. మొయిత్రా, వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకుంటున్నట్లు ఉన్న తిరుగులేని సాక్ష్యాలను ఒక న్యాయవాది తనతో పంచుకున్నారని దూబే చెప్పారు.
‘అదానీ గ్రూప్ లక్ష్యంగా ఇప్పటి వరకు ఆమె లోక్‌సభలో ఇప్పటి వరకు 50 నుంచి 61 వరకు ప్రశ్నలడిగారు. 12 డిసెంబర్ 2005 నాటి ‘క్యాష్ ఫర్ క్వెరీ’ వ్యవహారాన్ని గుర్తుచేసే విధంగా పార్లమెంట్‌లో ప్రశ్నలు అడగడం ద్వారా వ్యాపారవేత్త శ్రీ దర్శన్ హీరానందానీ వ్యాపార ప్రయోజనాలను కాపాడేందుకు మహువా మోయిత్రా పన్నిన నేరపూరిత కుట్ర అనేందుకు ఎలాంటి సందేహం లేదు.
విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఈ ఆరోపణల్లో నిగ్గు తేల్చాలి’అని ఆయన స్పీకర్ బిర్లాను కోరారు. దీనిపై మొయిత్రా ఘాటుగా స్పందించారు. ముందుగా దుబేపై పెండింగ్‌లో ఉన్న ఆరోపణలపై స్పీకర్ చర్యలు తీసుకున్నాక తనపై చర్యలకు ఉపక్రమిస్తే సంతోషిస్తానని ఆమె అన్నారు. ‘నకిలీ డిగ్రీ పట్టావాలా, ఇతర బీజేపీ ప్రముఖులపై పెండింగ్‌లో ఉన్న ఉల్లంఘనలు చాలానే ఉన్నాయి.
స్పీకర్ వాటిని పరిష్కరించిన వెంటనే నాకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేయిస్తే స్వాగతిస్తా’అంటూ ఆమె ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. రెండు పార్టీలకు చెందిన ఈ ఎంపీల మధ్య పార్లమెంట్‌లోనూ తరచూ వాదోపవాదాలు జరుగుతుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment