కోల్‌కతా: దేశంలో నాలుగు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా మూడు దశల్లో వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ జరగాల్సి ఉంది. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. ఇండియా కూటమి 315 సీట్లు గెలుస్తుందని, బీజేపీ గరిష్టంగా 195 సీట్లకు పరిమితం అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని బంగావ్ లోక్‌సభ నియోజకవర్గం ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఢిల్లీలో మోదీ ఉండరు.. కానీ దీదీ ఇక్కడి ప్రజలతోనే ఉంటుందని అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు.
ఇప్పటి వరకు పోలింగ్ బాగా జరిగింది. ఈసారి మోదీ అధికారంలోకి రావడం లేదు. అందుకే కేంద్రంలోని అధికార పార్టీ నేతలు భయపడుతున్నారు. మళ్లీ మోదీ పీఎం కాలేరని గ్రహించారు. 400 సీట్ల గురించి గొప్పగా చెప్పుకోవద్దు అని బెనర్జీ అన్నారు.
బొంగావ్ నియోజకవర్గంలో ఆధిపత్యం చెలాయించే మాతువాస్ గురించి బెనర్జీ మాట్లాడుతూ.. "ప్రధానమంత్రికి మాతువాస్ పట్ల అంత ప్రేమ ఉంటే, వారికి పౌరసత్వం ఇవ్వాలి. కానీ సీఏఏ అమలు సరికాదని ఆమె అన్నారు. దీనిని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని కూడా పేర్కొన్నారు.
#WATCH | North 24 Parganas, Bangaon: West Bengal CM Mamata Banerjee says, "... Didi will bring the INDIA alliance to power there (at the Centre), we will help from here (West Bengal). The INDIA alliance will win with all of us (parties). As per the calculations we have till… pic.twitter.com/ROccx2dhhD
— ANI (@ANI) May 13, 2024
Comments
Please login to add a commentAdd a comment