జడేజా పరుగుల వేగం కంటే... | Actress Ramya Calculate Petrol Price With Jadeja Runs | Sakshi
Sakshi News home page

జడేజా పరుగుల వేగం కంటే...

Published Tue, Sep 11 2018 11:32 AM | Last Updated on Tue, Sep 11 2018 11:32 AM

Actress Ramya Calculate Petrol Price With Jadeja Runs - Sakshi

క్రికెటర్‌ జడేజా , రమ్య

కర్ణాటక, బొమ్మనహళ్లి :  క్రికెటర్‌ జడేజా పరుగుల వేగం కంటే దేశంలో పెట్రోల్‌ ధర వేగంగా పెరుగుతోందని ప్రముఖ నటి, కాంగ్రెస్‌ నాయకురాలు రమ్య తన ట్వీట్‌ లో ఎద్దేవా చేశారు. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న భారత్‌ టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ రవీంద్ర జడేజా చేసిన పరుగుల కంటే భారత దేశంలో పెట్రోల్‌ ధర ఎక్కువగా ఉందని ఆమె పేర్కొన్నారు. జట్టులో అత్యధిక స్కోర్‌ సాధించిన రవీంద్ర జడెజా 86 పరుగులు చేశారని, దేశంలో పెట్రోల్‌ ధర రూ. 87 ఉందని ఆమె తన ట్వీట్‌లో ఎద్దేవా చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement