సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు వరుసగా 14వ రోజు ఆదివారం కూడా భగ్గుమన్నాయి. తాజా పెంపుతో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్‌కు రూ 78.12 పలికింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ 82.76కు చేరింది. ఇక ముంబయి, చెన్నై నగరాల్లో పెట్రో ధరలు రికార్డు స్థాయిలో లీటర్‌కు రూ 85.93, రూ 81.11కు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం, పెట్రో ఉత్పత్తులపై ఎక్సయిజ్ సుంకం విధింపు కారణంగా పెట్రో ధరలు రోజురోజుకూ భారమవుతున్నాయి.
మరోవైపు పెట్రో ధరల తగ్గింపుపై దృష్టిసారిస్తామని, ఎక్సైజ్ సుంకంలో కోత సహా పలు చర్యలు చేపడతామని కేంద్రం ఇప్పటికే ప్రకటించినా ఆ దిశగా అడుగులు పడకపోవడంతో వినియోగదారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పెట్రో ధరలు అత్యంత గరిష్టస్థాయికి చేరడంతో వాహనదారులు సహా నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment