
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటకలో పెట్రోల్, డిజిల్ ధరల పెంపుపై జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. కర్ణాటక ఎన్నికల ఓటింగ్ ముగియగానే ఇంధన ధరలు భారీగా పెంచారన్నారు. సాధ్యమైనంత మందిని ఫూల్స్‌ను చేయడమే మోదీనామిక్స్ ముఖ్య సూత్రంగా ట్వీటర్‌లో పేర్కొన్నారు. సోమవారం కర్ణాటకలో పెట్రోల్‌పై 17 పైసలు, డిజిల్‌పై 21 పైసలు ధర పెరిగిన సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లలో ఇదే అధికం. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు అన్ని కలుపుకుని ధరలు మండిపోతున్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 74.80 పైసలు, డిజిల్ రూ. 66.14 పైసలుగా ఉంది. డిజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి.
Karnataka finishes voting, FUEL prices rise to a 4 yr. high!
— Rahul Gandhi (@RahulGandhi) May 14, 2018
The Key Principle of Modinomics: fool as many people as you can, as often as you can. #PeTrolledhttps://t.co/TdRP20rfAb
Comments
Please login to add a commentAdd a comment